Monday Motivation : ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే ఓ మంచి మాట అనుకోండి..
Monday Motivation : రోజు చివరిలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. దానిలో నెగిటివ్ ఆలోచనలు కూడా ఉంటాయి. అయితే మీ ఉదయాన్ని మాత్రం మీకు ఏదో మంచి జరగబోతుంది అనే ఆలోచనతో ప్రారంభించండి. అది మీకు మీరు గడపబోయే రోజుపై ఇష్టాన్ని, సానుకూలతను పెంచుతుంది.
Monday Motivation : నిజం చెప్పాలంటే.. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశమే. ఉదయం నిద్రలేచినప్పుడల్లా.. మీరు దానిని కొత్త ప్రారంభంగా పరిగణించాలి. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలున్నా.. వాటిని పక్కన పెట్టి.. మీకు మంచి జరుగుతుందనే నమ్మకంతో మీ రోజును ప్రాంరభించండి. ఇది మీ హృదయాన్ని పూర్తిగా సానుకూలతతో నింపుతుంది. ఇలా ఉండడం మీకు, మీ జీవితానికి చాలా అవసరం. నిజమే పరిస్థితుసు ఎప్పుడూ ఒకేలా ఉండవు. దీనిని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడూ మంచి జరగదు అని ఎందుకు.. మంచి జరుగుతుందని అనుకుంటే సరిపోతుంది కదా. మంచి జరిగినా.. చెడు జరిగినా దానిని మనం ఆపలేము. కానీ మనకి మంచి జరగాలి అని కోరుకోవడంలో తప్పేమి లేదు కదా.
ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా.. ప్రతికూలతలనేవి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మీరు అనుమతించకూడదు. లేదంటే మీ జీవితంలో, ఆశించిన విజయాన్ని సాధించడంలో మీరు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు చేయగలిగే గొప్ప విషయం ఏదైనా ఉంది అంటే.. అది మీ జీవితం పట్ల మీరు సానుకూల దృక్పథాన్ని ఎంచుకోవడం. ఇదే విజయానికి కీలకం. ఈ విషయం మీరు ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత త్వరగా సక్సెస్ అవుతారు. ఎవరైనా జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటారు కానీ.. ఓడిపోవాలి అనుకోరుగా. ఓటమి తథ్యం అని తెలిసినా.. చివరి వరకు మనం మన సంకల్పాన్ని వదలకూడదు. సానుకూల దృక్పథంతో ఉంటే.. ఫలితాలు కూడా సానుకూలంగానే ఉంటాయి.
అందుకే మీ రోజుని ఓ సానుకూల ఆలోచనతో ప్రారంభించండి. మీకు తెలుసా ఆశ అనేది మనిషిని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఆ ఆశలేని రోజు ఎందుకు బతికి ఉన్నామో మనకి కూడా తెలియదు. ఉన్న రోజుల మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు బతకాలి అనే ఆలోచన మదిలో మెదిలితే అది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. పోరాడాలి అనే కోరికను చంపేస్తుంది. చివరికి అది మీలోని అసమర్థుడిని మీకు పరిచయం చేస్తుంది. కానీ రేపు అనే రోజు మీ జీవితంలో ఉన్నప్పుడు.. ఆ రోజు మనం ఏమి నేర్చుకుంటున్నాము.. ఏమి సాధిస్తున్నాము.. మన దారిలో కొత్తగా ఏమి వస్తుంది అనేది మీలో సానుకూలతను పెంచుతుంది. రేపటిపై మీకు నమ్మకాన్ని, హోప్ ఇస్తుంది.
ప్రతిరోజు మీరు ఏదైనా సాధించడానికి మీకు కొత్త అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఉదయం నిద్రలేచినప్పుడల్లా.. అంతా మంచే జరుగుతుంది అనే ఆలోచనతో రోజు ప్రారంభించండి. ఈ ఆశ మీకు ఉన్నప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారు. అదే ఆశను కోల్పోతే.. మీరు జీవితంలో విఫలమయ్యే అవకాశం ఉంది. ఆశ లేకుండా జీవించడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మొదట్లో కాస్త కష్టంగా అనిపించవచ్చు. కానీ రోజూ మంచి జరుగుతుంది అనుకోండి. మీలో పాజిటివ్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి. కచ్చితంగా మీకు మంచి జరుగుతుంది.
సంబంధిత కథనం
టాపిక్