Tribal Hair Oil: ఆదివాసీ నూనెలతో నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? వాటిలో ఎలాంటి పదార్థాలు కలుపుతారు?-do adivasi oils really promote hair growth what ingredients are added to them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tribal Hair Oil: ఆదివాసీ నూనెలతో నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? వాటిలో ఎలాంటి పదార్థాలు కలుపుతారు?

Tribal Hair Oil: ఆదివాసీ నూనెలతో నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? వాటిలో ఎలాంటి పదార్థాలు కలుపుతారు?

Haritha Chappa HT Telugu
Aug 21, 2024 02:00 PM IST

Tribal Hair Oil: ఈ మధ్య ఆదివాసీ హెయిర్ నూనెల తెగ వైరల్ అవుతున్నాయి. వాటి ధర కూడా ఎక్కువే. వీటి వల్ల జుట్టు రాలడం ఆగిపోయి, వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయని చెబుతారు. చుండ్రును కూడా తగ్గిస్తాయని అంటారు. ఆదివాసీ నూనెకు అంత శక్తి ఎలా వస్తుంది? వాటిలో ఏం కలుపుతారు?

ఆదివాసీ నూనెల్లో ఏం కలుపుతారు?
ఆదివాసీ నూనెల్లో ఏం కలుపుతారు? (Pixabay)

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువే. అలాగే జుట్టు పొడవుగా పెరగాలని కూడా కోరుకుంటారు. అలాంటి వారు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే నూనెలు రాస్తూ ఉంటారు. ఈ మధ్యన ఆదివాసీ నూనెల ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయ. ఆ నూనెలు రాయడం వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది. చుండ్రు కూడా పోతుందని, జుట్టు రాలడం ఆగిపోతుందని ఆదివాసీ హెయిర్ ఆయిల్ తయారుచేసిన వారు చెబుతున్నారు.

ఈ ట్రైబల్ హెయిర్ ఆయిల్ ఈ రోజుల్లో బాగా వైరల్ అవుతోంది. అయితే వీటిని వాడవచ్చా లేదా అనే సందేహం ఎక్కువమందికి ఉంది. ఆదివాసీ హెయిర్ నూనెలో ఎలాంటి పదార్థాలు వాడడం వల్ల ఆ నూనెకు ఎక్కువ శక్తి వస్తుందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్న వారు ఉన్నారు. ఆ నూనెలో కొన్ని ఆయుర్వేద మూలికలను వాడి ఉంటే కచ్చితంగా ఆ నూనె జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి కింద ఇచ్చే ఆయుర్వేద మూలికలు ఆదివాసీ నూనెలో వాడితే మీకు ఆ నూనె ఉపమోగపడుతుంది.

ఈ మూలికలతో

సహజసిద్ధమైన ఆయుర్వేద మూలికలను ట్రైబల్ హెయిర్ ఆయిల్ తయారీలో ఉపయోగిస్తారు. వాటిలో ముఖ్యమైనవి… బ్రాహ్మి, ఉసిరి, కడుపట్టి, మెంతయ లవంచ, కలబంద, మందార పువ్వు, భృంగరాజ్, కొబ్బరి నూనె, ఆముదం నూనె, బాదం నూనె, ఉసిరి, రత్నజోత్, ఉల్లిపాయ, మెంతులు, కాస్కస్, జటమాన్సి, కరివేపాకు. ఇవే కాకుండా ఇతర మూలికలను ఈ నూనెలో కలుపుతారని అంటారు. వీటన్నింటిన కలిపి చేసే ఆదివాసీ ఆయిల్ జుట్టుకు నిజంగానే మేలు చేస్తుంది.

బ్రాహ్మీ, భృంగరాజ్ వంటి మూలికలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.కేవలం బ్రహ్మీని జుట్టుకు అప్లై చేసినా చాలు…జుట్టు రాలిపోయే సమస్య తొలగిపోతుంది. అలాగే జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతే కాదు జుట్టు పెరుగుదల కూడా పెరుగుతుంది. అదేవిధంగా, భృంగరాజ్, ఉసిరి జుట్టుకు ప్రభావవంతమైన మూలికలుగా పరిగణిస్తారు. వీటన్నింటినీ బాదం, కొబ్బరి వంటి నూనెలతో కలిపి తలకు పట్టిస్తే చాలా ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉంది. జుట్టు సమస్యలు వేధిస్తుంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ ను కొనాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూడా తయారుచేయవచ్చు. కొబ్బరినూనెలో మూలికలను వేసి బాగా మరిగించి చల్లార్చుకుని రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

కేవలం నూనెలతో మాత్రమే కాదు… మంచి ఆహారం తిన్నా కూడా జుట్టు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఉసిరి, కరివేపాకులు ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు వంటివి ప్రతిరోజూ గుప్పెడు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇవి మీ జుట్టును, చర్మాన్ని కూడా మెరిపిస్తాయి. అలాగే నీటిని కూడా అధికంగా తాగాలి.

Whats_app_banner