ఇంట్లో శీకాయ పొడితో జుట్టు మెరిపించుకోండిలా

By Haritha Chappa
Aug 13, 2024

Hindustan Times
Telugu

 జుట్టు సమస్యలు ఉన్న వారు శీకాయను ఉపయోగించండి. ఇది చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు పెంచుతుంది. నల్లని వెంట్రుకలను ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

 శీకాయ పొడిలో నీళ్లు కలిపి జుట్టుకు క్లెన్సర్‌గా వాడవచ్చు. మూడు స్పూన్ల శీకాయ పొడిలో నీళ్లు కలిపి పేస్టులా చేసి మాడుకు, జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలకు స్నానం చేయాలి.

పెరుగు, శీకాయ పొడి, ఆలోవెరా జెల్, కొబ్బరి పాలు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి అరగంట పాటూ వదిలేసి తలకు స్నానం చేయాలి.

 జుట్టుకు పొడవుగా పెరగాలంటే శీకాయ పొడి, ఉసిరి పొడి, రీటా కలిపి పేస్టులా చేసి జుట్టుకు పట్టిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. 

రెండు కప్పుల నీటిలో శీకాయ పొడి వేసి మరిగించాలి. ఆ నీటిని జుట్టుకు పట్టించాలి. రాత్రంతా అలా వదిలేయాలి. ఉదయం స్నానం చేస్తే జుట్టు సున్నితంగా, షైనీగా ఉంటుంది.

 శీకాయతో తయారుచేసిన షాంపూలను వాడడం మంచిది. ఇది జుట్టుకు మెరుపును అందిస్తుంది.

శీకాయ ఆయుర్వేద మూలిక. జుట్టుకు పట్టిన మురికి, జిడ్డును శీకాయ వదిలిస్తుంది. 

శీకాయ పొడిని ప్రతిరోజూ వాడితే ఎంతో మంచిది. ఇది ఆయుర్వేద మూలిక కాబట్టి రోజూ వాడినా ఎలాంటి నష్టం ఉండదు.  

విటమిన్​ డీ లోపంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు- అందుకే ఈ ఫుడ్స్​ తినండి!

pexels