Sleeping Tips: జీన్స్ ప్యాంట్ వేసుకొని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!
Sleeping Tips: జీన్స్ ప్యాంట్‍తోనే కొన్ని సందర్భాల్లో నిద్రిస్తుంటారు. అయితే, ఇదే అలవాటైతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే కొంతకాలంలోనే సమస్యలు తలెత్తుతాయి. ఆ వివరాలు ఇవే..
ఆరోగ్యం బాగుండాలంటే ప్రతీ రోజు తగినంతసేపు నిద్రపోవడం చాలా ముఖ్యం. మంచి నాణ్యమైన నిద్ర పట్టేందుకు మనం వేసుకునే దుస్తులు కూడా ఓ ముఖ్యమైన అంశంగా ఉంటాయి. కొందరు బాగా బయట తిరిగివచ్చో, దుస్తులు మార్చే ఓపిక లేకనో.. ఏమవుతుందిలే అని ఆలోచించో జీన్స్ ప్యాంట్‍తోనే నిద్రిస్తుంటారు. అయితే, ఇలా జీన్స్ ప్యాంట్‍తో నిద్రిస్తే కొంతకాలానికే సమస్యలు తలెత్తుతాయి. త్వరగా దుష్ప్రభావం కనిపిస్తుంది. జీన్స్ ధరించి పడుకుంటే కలిగే నష్టాలు ఏవో ఇక్కడ చూడండి.
అసౌకర్యంగా.. నిద్రకు భంగంగా..
జీన్స్ ప్యాంట్లు సాధారణంగా బిగుతుగా ఉంటాయి. వీటిని ధరించి నిద్రపోతే అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. నిద్రపట్టినా మధ్యమధ్యలో చిరాకుగా ఉంటుంది. నిద్రకు ఆటంకాలు కలుగుతాయి. దీంతో నాణ్యమైన గాఢ నిద్రపట్టదు. దీనివల్ల ఎక్కువసేపు నిద్రపోయినా సరిపోదు. సరైన నిద్ర లేకుంటే ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయి.
చర్మానికి సమస్యలు
టైట్‍గా ఉండే జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే తొడల మధ్య తేమ ఎక్కువ అవుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో దురద పెరగడం, చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. ఇది చాలా చిరాకు కలిగిస్తుంది. ఇలా కొనసాగితే చర్మ సమస్య అధికమవుతుంది.
రక్తప్రసరణకు కష్టం.. వేడి కూడా..
జీన్స్ ప్యాంట్ బిగుతుగా ఉండటంతో చర్మానికి గట్టిగా అతుక్కొని ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో కొన్ని అవయవాలకు రక్తం సరిగా అందదు. అవయవాల పనితీరు సవ్యంగా సాగేందుకు ఆటంకంగా ఉంటుంది. జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలోని వేడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. శ్వాస కూడా పూర్తిస్థాయిలో తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
జీర్ణానికీ ఇబ్బందే
జీన్స్ ప్యాంట్‍తో పడుకుంటే కడుపుపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీనివల్ల పేగుల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చు. గ్యాస్, కడుపు ఉబ్బడం లాంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ప్యాంట్‍లకు ఉండే బటన్స్, ట్యాగ్స్ కూడా కడుపుపై మరింత ఒత్తిడి తీసుకొస్తాయి. అందుకే జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రపోకూడదు.
ఎలాంటివి వేసుకోవాలి
నిద్రపోయేందుకు కాటన్, సిల్క్ సహా శరీరానికి బాగా గాలి ఆడే క్లాత్‍తో ఉండే దుస్తులు ధరించాలి. టైట్‍గా కాకుండా ఈ దుస్తులు లూజ్ ఫిట్‍తో ఉండాలి. దీనివల్ల చాలా అనుకూలంగా ఉంటాయి. నిద్ర సుఖంగా పట్టేందుకు ఇలాంటి దుస్తులు సహకరిస్తాయి. వదులైనవాటి వల్ల రాత్రివేళ రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అవయవాలు మెరుగ్గా విశ్రాంతి తీసుకుంటాయి. బ్యాక్టీరియా పేరుకొని చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. శరీరం రిలీఫ్‍గా ఫీల్ అయ్యే దుస్తులనే రాత్రివేళ నిద్రించేటప్పుడు ధరించాలి.