వర్షాకాలంలో జీర్ణక్రియను మెరుగుపరిచే ఐదు ఆహారాలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jul 26, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో తేమ, ఉష్ణోగ్రతలు లాంటివి మారడంతో ఇన్ఫెక్షన్ల వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. కొన్ని రకాల ఆహారాలు మీ డైట్‍లో తీసుకోవడం వల్ల ఈ ఇబ్బందులు తగ్గుతాయి. వానాకాలంలో జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు తోడ్పడే 5 ఆహారాలు ఇవి.

Photo: Pexels

అల్లంలో యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచటంతో పాటు పేగుల్లో మంట, గ్యాస్, వికారం లాంటివి తగ్గిస్తుంది. అందుకే వానాకాలంలో ఆహారంలో అల్లం ఉండేలా చూసుకోవాలి.

Photo: Pexels

పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల కదలికను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు, ఉదర ఆరోగ్యానికి మేలు మేలు చేస్తుంది. 

Photo: Pexels

యగర్ట్, పెరుగులో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచగలవు. పేగుల్లో ఫ్లోరాను సమతుల్యంగా ఉంచగలవు. గ్యాస్ లాంటి సమస్యలను నివారించగలవు. 

Photo: Pexels

పేగుల ఆరోగ్యానికి మేలు చేసే ప్రీబయోటిక్స్ వెల్లుల్లిలో ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మంచి చేయటంతో పాటు పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. 

Photo: Pexels

అరటి పండ్లలో ఫైబర్, సహజమైన ప్రీబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. పేగుల కదలికను మెరుగుపరచడంతో పాటు కడుపులో మంట, తేపులను ఇది తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

Photo: Pexels

పక్షవాతం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?

Image Source From unsplash