Bad Cholesterol: ఈ విటమిన్ లోపిస్తే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది జాగ్రత్త, ఈ ఆహారాలు తినండి-deficiency of this vitamin can increase bad cholesterol in your body eat these foods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bad Cholesterol: ఈ విటమిన్ లోపిస్తే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది జాగ్రత్త, ఈ ఆహారాలు తినండి

Bad Cholesterol: ఈ విటమిన్ లోపిస్తే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది జాగ్రత్త, ఈ ఆహారాలు తినండి

Haritha Chappa HT Telugu
Aug 29, 2024 10:13 AM IST

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. చెడు ఆహారపు అలవాట్లు వల్ల చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు. విటమిన్ బి3 లోపం వల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయే అవకాశం ఉంది.

చెడు కొలెస్ట్రాల్
చెడు కొలెస్ట్రాల్ (shutterstock)

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎన్నో రకాల సమస్యలు మొదలవుతాయి. చెడుకొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది పేరుకుపోతున్నట్టు మనకు ఎలాంటి లక్షణాలు చూపించదు. పూర్తిగా పేరుకపోయాక గుండెజబ్బులు, డయాబెటిస్ వంటివి వస్తాయి. కాబట్టి మొదటి నుంచే చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకోవాలి.

చెడు కొలెస్ట్రాల్ అంటే?

చెడు కొలెస్ట్రాల్ అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్. ఇది శరీరంలో తక్కువగానే ఉండాలి. దీని పరిమాణం పెరిగితే ధమనుల్లో ఫలకాలు ఏర్పడతాయి. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం తరచుగా జంక్ ఫుడ్, శుద్ధి చేసిన పిండి పదార్థాలతో చేసిన ఆహారాలు తినడం, నూనె నిండిన ఆహారాలు తినడం, తక్కువ శారీరక వ్యాయామం అని చెబుతారు వైద్యులు.

కానీ చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం పేలవమైన ఆహారం, తక్కువ శారీరక శ్రమ, ఒత్తిడి, ధూమపానం వంటివి మాత్రమే కాదు, నియాసిన్ అనే విటమిన్ బి 3 లోపించడం కూడా కారణమే. ఈ విటమిన్ లోపం వల్ల శరీరం మంచి కొలెస్ట్రాల్‌ను సరిగా ఉత్పత్తి చేయలేకపోతోందని వైద్యులు వివరిస్తున్నారు. అందువల్ల, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి విటమిన్ బి3 లోపం లేకుండా చూసుకోవడం ముఖ్యం.

వాస్తవానికి, విటమిన్ బి3 శరీరంలో తయారైన ఎంజైమ్‌లను కాలేయానికి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు, నియాసిన్ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్, ట్రైగ్లిజరైడ్ల ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.

నియాసిన్ కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది, ఇది రక్తంలో కూడా చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచదు.

విటమిన్ బి 3 నిండిన ఆహారాలు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. విటమిన్ బి3 అదనపు పొరలా పనిచేస్తుంది. ఇది ధమనులను చెడు కొలెస్ట్రాల్ నుండి రక్షిస్తుంది.

ట్రైగ్లిజరైడ్ గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైనవి. విటమిన్ బి3 రక్తంలో కొవ్వు పరిమాణం పెరగకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు అంటే కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది. ఇది గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది.

ఏం చేయాలి?

వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా దాన్ని తగ్గించుకోవాలి. రోజు రెండు కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. తరువాత లిపిడ్ ప్రొఫైల్ టెస్టు ద్వారా చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గకపోతే విటమిన్ బి3 ఉన్న ఆహారాలను అధికంగా తినండి. లేదా వైద్యుల సలహాతో తగిన మందులు వాడండి. నియాసిన్ సప్లిమెంట్స్ కూడా వైద్యులు సూచించే అవకాశం ఉంది.

విటమిన్ బి3 కోసం తినాల్సిన ఆహారాలు

విటమిన్ బి3 ను ఆహారం ద్వారా సహజంగా పొందవచ్చు. ఇందుకోసం మీరు తరచూ ఏం తినాలంటే… చికెన్, ట్యూనా చేప, పుట్టగొడుగులు, బ్రౌన్ రైస్, వేరుశెనగ, అరటి పండ్లు, నట్స్, సీడ్స్ వంటివి. వీటిని తరచూ తినడం వల్ల విటమిన్ బి3 లోపాన్ని అధిగమించవచ్చు. తద్వారా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకోవచ్చు.

టాపిక్