Chinta Chiguru Pachadi: చింతచిగురు ఎండుమిర్చి రోటి పచ్చడి రెసిపీ, స్పైసీగా నోరూరించేస్తుంది-chinta chiguru endumirchi pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chinta Chiguru Pachadi: చింతచిగురు ఎండుమిర్చి రోటి పచ్చడి రెసిపీ, స్పైసీగా నోరూరించేస్తుంది

Chinta Chiguru Pachadi: చింతచిగురు ఎండుమిర్చి రోటి పచ్చడి రెసిపీ, స్పైసీగా నోరూరించేస్తుంది

Haritha Chappa HT Telugu
Sep 12, 2024 11:30 AM IST

Chintha Chiguru Pachadi: చింతచిగురు ఎండుమిర్చితో రోటి పచ్చడి చేసుకొని చూడండి. మీరు జీవితంలో దీని రుచి మర్చిపోలేరు. నోరూరించేలా ఉంటుంది. వేడి అన్నంతో తింటే అదిరిపోతుంది.

చింత చిగురు ఎండు మిర్చి పచ్చడి రెసిపీ
చింత చిగురు ఎండు మిర్చి పచ్చడి రెసిపీ

Chintha Chiguru Pachadi: రోటి పచ్చళ్ళు అంటే మీకు చాలా ఇష్టమా? అయితే మీ కోసమే చింతచిగురు ఎండుమిర్చితో రోటి పచ్చడి ఇక్కడ ఇచ్చాము. ఇది చేయడం చాలా సులువు. వేడివేడి అన్నంలో ఈ రోటి పచ్చడిని వేసుకొని కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. అప్పటికప్పుడు దీన్ని చేసుకొని తింటే రుచిగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే రెండు మూడు రోజులు పాటు తాజాగా నిల్వ ఉంటుంది. ఇక చేయడం ఎలాగో తెలుసుకోండి.

చింతచిగురు ఎండుమిర్చి రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు

చింతచిగురు - రెండు కప్పులు

ఎండు మిర్చి - వందగ్రాములు

నూనె - రెండు స్పూన్లు

ధనియాలు - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

మెంతులు - పావు స్పూను

పల్లీలు - అర కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

టమోటాలు - రెండు

ఉల్లిపాయ - ఒకటి

చింతచిగురు ఎండుమిర్చి రోటి పచ్చడి రెసిపీ

1. చింత చిగురును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి.

4. ఎండుమిర్చి వేగాక ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి.

5. కళాయిలో మిగిలిన నూనెలో పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.

6. కళాయిలో ఇంకా నూనె మిగిలే ఉంటుంది. ఆ నూనెలో చింత చిగురు, టమోటా ముక్కలను కూడా వేసి వేయించి అది కాస్త దగ్గరగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు రోట్లో ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి బాగా దంచుకోవాలి.

8. అవి బాగా దంచిన తర్వాత పల్లీలను కూడా వేసి బాగా దంచాలి.

9. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

10. అలాగే వేయించిన టమోటోలు, చింతచిగురు మిశ్రమాన్ని కూడా వేసి బాగా దంచాలి.

11. సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి దంచుకోవాలి.

12. ఉల్లిపాయలను మెత్తగా దంచాల్సిన అవసరం లేదు.

13. అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయ తగులుతూ ఉంటే రుచిగా ఉంటుంది.

14. దీనికి తాళింపు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవాలు, జీలకర్ర కూడా వేయించి అందులోనే కలిపేసాం. కాబట్టి రుచిగానే ఉంటుంది.

15. అంతే టేస్టీ చింతచిగురు ఎండుమిర్చి పచ్చడి రెడీ అయినట్టే.

16. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తిని చూడండి రుచి అదిరిపోతుంది.

17. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి.

18. ఇవి మీకు ఆహ్లాదమైన రుచిని అందిస్తాయి.

చింత చిగురు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చింతచిగురు తింటే కంటి సమస్యలు, థైరాయిడ్ వంటివి రాకుండా ఉంటాయి. గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు వంటివి కూడా తగ్గుతాయి. చింతచిగురులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ. అలాగే యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఎక్కువే. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో చింతచిగురు ఒకటి. ఇలా చింతచిగురు ఎండుమిర్చితో రోటి పచ్చడి చేసుకొని తినండి.. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

టాపిక్