Chicken Biryani: చికెన్ కూర మిగిలిపోతే దాంతో ఇలా బిర్యానీ వండేయండి, రుచి అదిరిపోతుంది
Chicken Biryani: చికెన్ కర్రీ మిగిలిపోతే దాంతో టేస్టీగా చికెన్ బిర్యాని వండొచ్చు. ఇది చాలా సులువు కూడా. ఇలా మిగిలిపోయిన కర్రీని సరికొత్త డిష్‌గా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం.
Chicken Biryani: ప్రతి ఇంట్లో కర్రీ మిగిలిపోవడం అనేది సహజమే. అందులోనూ చికెన్ కర్రీ కొంచెం ఎక్కువగానే వండుతాం కాబట్టి చికెన్ కర్రీ ఎంతో కొంత మిగిలిపోతుంది. అలా మిగిలినప్పుడు దాన్ని సరికొత్త డిష్ గా మార్చవచ్చు. మిగిలిపోయిన చికెన్ కర్రీతో ఒకసారి చికెన్ బిర్యాని వండి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. అది కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇలా మిగిలిపోయిన చికెన్ కర్రీ తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
మిగిలిపోయిన చికెన్ కర్రీతో బిర్యాని చేయడానికి కావాల్సిన పదార్థాలు
మిగిలిపోయిన చికెన్ కర్రీ - ఒక కప్పు
బియ్యం - రెండు కప్పులు
ఉల్లిపాయ - ఒకటి
టమోటా - ఒకటి
పెరుగు - అరకప్పు
పచ్చిమిర్చి - నాలుగు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒక స్పూన్
పసుపు - అర స్పూన్
ధనియాల పొడి - ఒక స్పూన్
గరం మసాలా - అర స్పూను
లవంగాలు - నాలుగు
యాలకులు - రెండు
బిర్యానీ ఆకు - ఒకటి
నూనె - మూడు స్పూన్లు
మిగిలిపోయిన చికెన్ కర్రీతో బిర్యాని ఇలా చేసేయండి
1. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టండి. దానిలో నూనె వేయండి.
2. నూనె వేడెక్కాక లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేయించండి.
3. అది వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చిని వేసి వేయించండి.
4. ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
5. ఆ తర్వాత టమోటో తరుగును వేసి పైన మూత పెట్టి ఉడికించండి.
6. టమోటో మెత్తగా అయ్యి ఇగురులా అయ్యే వరకు ఉడికించాలి.
7. అందులో ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
8. అలాగే పెరుగును కూడా వేసి కలుపుకోవాలి.
9. మిగిలిపోయిన చికెన్ కర్రీని కూడా అందులో వేసి కలుపుకోవాలి. ఇగురు లాగా వచ్చే వరకు ఉండాలి.
10. మరోవైపు బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేయాలి.
11. అందులోని యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు కూడా వేసి కాస్త ఉప్పు వేసి ఉడికించాలి.
12. బియ్యం 80% ఉడికాక స్టవ్ కట్టేయాలి.
13. ఇప్పుడు పక్కన ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో 80 శాతం ఉడికిన అన్నాన్ని గరిటతో పొరలు పొరలుగా వేసుకోవాలి.
14. అలా అన్నమంతా వేసాక పైన మూత పెట్టి చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించాలి.
15. ఇది సాధారణంగా చేసుకునే బిర్యాని లాగే చాలా రుచిగా ఉంటుంది. వండుతున్నప్పుడే ఘుమఘుమలాడిపోతుంది.
చికెన్ కర్రీ మిగిలిపోయినప్పుడు దాన్ని ఏం చేయాలని ఆలోచించకుండా... మరుసటి రోజు ఇలా చికెన్ బిర్యానీని వండేయండి. దీని రుచి టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యాని త్వరగా అవ్వాలన్నా కూడా ఇది ఒక సులువైన మార్గం. దీని వేడివేడిగా తింటే రుచి మాములుగా ఉండదు. కేవలం మిగిలిపోయిన చికెన్ కర్రీతోనే కాదు, మిగిలిపోయిన ఫిష్ కర్రీ, మటన్ కర్రీలతో కూడా ఇలా బిర్యాని వండుకోవచ్చు. ఒకసారి ఈ బిర్యాని రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు నచ్చడం ఖాయం.