Ayurvedic Skincare Routine । ముఖంలో సహజ నిగారింపు రావాలంటే.. ఇవి ఉపయోగించండి!
Ayurvedic Skincare Routine: మీ చర్మ సంరక్షణ కోసం రసాయన ఆధారిత ఉత్పత్తులను నివారించండి. కొన్ని ఆయుర్వేద ఉత్పత్తులు ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
Ayurvedic Skincare Routine: ఆయుర్వేద విధానంలో చర్మ సంరక్షణ అనేది కేవలం బయటి నుంచి మాత్రమే కాకుండా లోపల నుండి చర్మాన్ని చికిత్స చేసే ప్రక్రియ, ఈ ప్రక్రియతో ఆరోగ్యకరమైన బాహ్య చర్మాన్ని పొందవచ్చు. తులసి, కలబంద వంటి మొక్కల నుండి పసుపు, నెయ్యి వంటి ఆహార పదార్థాల వరకు సహజంగా లభించేవన్నీ ఆయుర్వేద చర్మ సంరక్షణ విధానంలో ఉపయోగించవచ్చు. ఇవి రసాయన రహితమైనవి, పర్యావరణ హితమైనవి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ కృతి సోనీ రోజూవారీ చర్మ సంరక్షణ కోసం ఉపయోగపడే కొన్ని ఆయుర్వేద పదార్థాలను పేర్కొంది. ఈ ఆర్గానిక్ స్కిన్‌కేర్ ఎలిమెంట్స్ చర్మానికి చాలా విభిన్నమైన ప్రయోజనాలను చేకూర్చుతాయని పేర్కొంది. మీరు మీ చర్మ సౌందర్యం కోసం ఆయుర్వేదంపై ఆసక్తిని కలిగి ఉంటే, మీ చర్మానికి అద్భుతాలు చేయగల ఐదు సహజ, రసాయన రహిత, సురక్షితమైన డాక్టర్ కృతి సోనీ సూచించిన ఆయుర్వేద పదార్థాలను చూడండి.
తులసి
ఆయుర్వేద వైద్యంలో తులసిని 'మూలికల రాణి' గా అభివర్ణిస్తారు. తులసి ఆకులు సాంప్రదాయ మూలికలు, ఇవి వివిధ రకాలు, రూపాల్లో కనిపిస్తాయి. తులసి నూనెను షాంపూ, సీరం, జుట్టు నూనెలతో సహా అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. తులసి ఆకులలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల కారణంగా, ఇది వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యల చికిత్సకు సహాయపడుతుంది. తులసి ఆకులలో విటమిన్లు నల్ల మచ్చలు, మొటిమలను నివారించగలవు.
కుంకుమాది తైలం
ఇది నువ్వుల నూనెను ఉపయోగించే తీసే ఒక బేస్ ఆయిల్. కుంకుమాది తైలం చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్ వలే పనిచేస్తుంది. ఇది పొడి, కఠినమైన చర్మాన్ని సమతుల్యం చేస్తుంది. పొడి చర్మం కలవారు ఈ తైలాన్ని క్రమం తప్పకుండా, సక్రమంగా ఉపయోగించడం వారి చర్మానికి చాలా మేలు కలుగుతుంది. చర్మ కణాలలో జీవం వచ్చి ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మం పొందుతారు. అదనంగా, ఈ కుంకుమాది తైలం మొటిమలు, బ్లాక్ హెడ్స్‌కు సహజ నివారణ. మీ చర్మంపై నూనెను పూయడం వల్ల మురికిని శుభ్రపరుస్తుంది , చర్మంలోని మృతకణాలను తొలగించి, రంధ్రాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది.
కలబంద
చర్మ సంరక్షణ ఉత్పత్తుల విషయానికి వస్తే కలబంద ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. అలోవెరా అనేది సాంప్రదాయ వైద్యంలో చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే ఒక మూలికా మొక్క. దీని ఆకుల నుంచి ఉత్పత్తి అయ్యే జెల్‌ను నేరుగా చర్మానికి ఉపయోగించవచ్చు. ఇది మచ్చలు, దద్దుర్లు, మొటిమలతో సహా అనేక రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. మీరు మీ చర్మ సంరక్షణ దినచర్యలో కలబందను ఉపయోగిస్తే మృదువైన చర్మం పొందుతారు.
కుంకుమపువ్వు
మీ ముఖంపై మంచి మెరుపు, స్పష్టమైన రంగును కోరుకుంటే కుంకుమపువ్వును ఉపయోగించండి. మొటిమలు, మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలకు కుంకుమపువ్వు మంచి ఔషధం. ఇది చర్మకాంతిని చాలా మెరుగ్గా పెంచుతుంది. దానిలోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా, కుంకుమపువ్వు మీ చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనం చేకూర్చుతుంది. కుంకుమపువ్వు మీ చర్మ కణాల రికవరీ రేటును పెంచుతుంది, దీనిలో యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు ఎక్కువే. అందువలన, చర్మంపై మొటిమలు, మచ్చలు, చారలు, గాయాలు వేగంగా నయం చేయడానికి కుంకుమపువ్వును వివిధ రూపాల్లో వాడవచ్చు.
నెయ్యి
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్మం పొడిబారడం లేదా చర్మం ఉన్నవారికి, చర్మం పొరలుగా మారడం అనేది చాలా సాధారణమైన లక్షణం. ఇలాంటి సమస్యలకు నెయ్యి, దాని ఉపఉత్పత్తులు అద్భుతమైన పరిష్కారం. ఈ నెయ్యి చర్మం లోతైన పొరలను చేరుకుంటుంది, లోపలి నుండి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మం కూడా నెయ్యిని సులభంగా గ్రహిస్తుంది, తద్వారా మృదుత్వం పెరుగుతుంది. నెయ్యిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి వృద్ధాప్య సంకేతాలను నివారిస్తూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, సహజ నిగారింపును కూడా అందిస్తుంది.
మీ చర్మ సంరక్షణ దినచర్యలో ఈ పదార్థాలను ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. రసాయన ఆధారిత ఉత్పత్తులను నివారించండి. ఆయుర్వేదంతో మీ చర్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, తేమగా, ఆరోగ్యంగా ఉంచుకోండి.
సంబంధిత కథనం