Tattoo Blood Donation Rules : టాటూలు వేయించుకున్నవారు రక్తదానం చేయెుచ్చా?-can tattooed people donate blood and what is the rules ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tattoo Blood Donation Rules : టాటూలు వేయించుకున్నవారు రక్తదానం చేయెుచ్చా?

Tattoo Blood Donation Rules : టాటూలు వేయించుకున్నవారు రక్తదానం చేయెుచ్చా?

Anand Sai HT Telugu
Dec 22, 2023 03:00 PM IST

Tattoo Blood Donation Rules In Telugu : టాటూలు వేయించుకోవడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. అదో స్టైల్.. కానీ టాటూలు వేయించుకుంటే రక్తదానం చేయెుచ్చా? ఎప్పుడైనా ఆలోచించారా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పచ్చబొట్టు అనేది ఇప్పుడో ట్రెండ్. లుక్ ఉండేందుకు కొందరు, ఇష్టమైన వారిని జీవితాంతం గుర్తుంచుకునేందుకు మరికొందరు టాటూలు వేయించుకుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫ్యాషన్ ఎక్కువైపోయింది. అయితే రక్తదానం చేసే సమయంలో మాత్రం ఈ విషయాన్ని కచ్చితంగా గమనిస్తారు. ఆ విషయాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఈ కాలంలో టాటూలు వేయించుకునే ఆచారం పెరుగుతోంది. కొంతమంది తమ ప్రియమైన వారి చిత్రాలను టాటూలుగా వేయించుకుంటారు. కొంతమంది వ్యక్తులు ఇష్టమైన దేవతల చిత్రాలను పచ్చబొట్టుగా వేయిస్తారు. కొంతమంది తమ అభిమాన సెలబ్రిటీలను కూడా టాటూలు వేయించుకుంటారు. మరికొందరేమో.. కొన్ని రకాల గుర్తులను టాటూలుగా ఉపయోగిస్తారు. ఇష్టం, ఫ్యాషన్ ఏదైనా సరే.. ఈ ట్రెండ్ మాత్రం విపరీతంగా పెరిగింది. మార్కెట్లో చాలా టాటూలు వేసే దుకాణాలు వెలిశాయి.

పచ్చబొట్టు వేయించుకోవాలనే ఆసక్తి ఉన్నవారి మనసులో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. పచ్చబొట్టు వేయించుకున్న తర్వాత రక్తదానం చేయవచ్చా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. టాటూ వేయించుకున్న వెంటనే రక్తదానం చేయడానికి వీలు లేదు. దీనికి కూడా కారణాలు ఉన్నాయి.

పచ్చబొట్టులో ప్రధాన సమస్య సూదులు తిరిగి మళ్లీ ఉపయోగించడం. ఇది రక్తంలో వ్యాపించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. పచ్చబొట్టు సమయంలో ఉపయోగించే ఇంక్ మారదు. ఫలితంగా HIV, హెపటైటిస్ B ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల పచ్చబొట్టు వేయించుకున్న వారు వెంటనే రక్తదాన ప్రయత్నాలకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం, పచ్చబొట్టు విషయంలో కఠినమైన మార్గదర్శకాలు, నిబంధనలు ఏమీ లేవు.

ఇది వ్యక్తులు వారి స్వంత సౌలభ్యం కోసం వేయించుకుంటారు. కానీ నియంత్రణ లేకపోవడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల పరిశుభ్రమైన ప్రమాణాలను నిర్వహించడంలో చాలా శ్రద్ధ చూపే పేరున్న టాటూ పార్లర్ల సేవలను పొందడం మంచిది. పచ్చబొట్టు వేయించుకున్న తర్వాత వ్యక్తులు రక్త పరీక్ష చేయించుకున్న తర్వాతే రక్తదానం చేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కనీసం ఆరు నెలలు వేచి ఉండాలి. ఆ తర్వాతే రక్తదానం చేయాలి. మీరు మంచే చేయాలని అనుకుంటారు. కానీ మీరు వేయించుకున్న టాటూ కారణంగా రక్తదానం చేస్తే.. ఇతరుల జీవితాల మీద ప్రభావం పడుతుంది.

అలాగే చెవి, ముక్కు కుట్టడం వంటి ప్రక్రియలు చేసినప్పటికీ రక్తదానం చేయడం చాలా కాలం పాటు ఆపేయాలి. పైన చెప్పిన సూత్రాలు ఈ సందర్భంలో కూడా వర్తిస్తాయి. చెవి, ముక్కు కుట్టించుకున్నవారు ఒక వారం వేచి ఉండాలి. ప్రక్రియ ఫలితంగా అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉండదు.

అర్హత కలిగిన నిపుణుడి ద్వారా చెవులు, ముక్కు కుట్టించుకున్న వ్యక్తులు కూడా వేచి ఉండాలి. అది ఇద్దరికీ మంచిది కాదు. రక్తదానం చేయాలనుకునే వ్యక్తులు ఈ ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సరైన దశలను అనుసరించాలి. మీరు రక్తదానం చేస్తే.. ఏదైనా వ్యాధి వారిలోకి ప్రవేశిస్తే.. మీరు చేసిన పనికి ఫలితం లేకుండా పోతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.