Tattoo for Mental Health । శరీరంపై పచ్చబొట్టు ఉంటే మనసుకు మంచిదట.. ఎలాగంటే?!-tattoo is good for mental health says experts know why ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tattoo For Mental Health । శరీరంపై పచ్చబొట్టు ఉంటే మనసుకు మంచిదట.. ఎలాగంటే?!

Tattoo for Mental Health । శరీరంపై పచ్చబొట్టు ఉంటే మనసుకు మంచిదట.. ఎలాగంటే?!

Oct 31, 2022, 09:48 AM IST HT Telugu Desk
Oct 31, 2022, 09:48 AM , IST

  • Tattoo for Mental Health: టాటూలతో స్కిన్ ఇన్‌ఫెక్షన్‌లు, ఇతరత్రా సమస్యలు ఉన్నప్పటికీ, పచ్చబొట్లు మీ మనస్సు గాయాలను నయం చేయగలవని నిపుణులు అంటున్నారు. అవేంటో చూడండి.

ప్రజలు ఎందుకు పచ్చబొట్లు వేసుకుంటారు?  కొందరు సౌందర్యం కోసం, కొందరు ఆధ్యాత్మిక లేదా వ్యక్తిగత ఎదుగుదల కోసం, మరికొందరు ఇతరుల ప్రేమకు గుర్తుగా వేసుకుంటారు. పచ్చబొట్లు కలిగి ఉండటం వలన కొన్ని మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సెలబ్రిటీ టాటూ ఆర్టిస్ట్ సన్నీ భానుశాలి అన్నారు.

(1 / 7)

ప్రజలు ఎందుకు పచ్చబొట్లు వేసుకుంటారు? కొందరు సౌందర్యం కోసం, కొందరు ఆధ్యాత్మిక లేదా వ్యక్తిగత ఎదుగుదల కోసం, మరికొందరు ఇతరుల ప్రేమకు గుర్తుగా వేసుకుంటారు. పచ్చబొట్లు కలిగి ఉండటం వలన కొన్ని మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సెలబ్రిటీ టాటూ ఆర్టిస్ట్ సన్నీ భానుశాలి అన్నారు. (Pixabay)

టాటూలు శరీరానికి అందాన్ని కలిగించే యాక్సెసరీగా ఉండటం మాత్రమే కాదు వాటిలో శాశ్వతత్వం ఉంటుంది. ఈ ప్రక్రియలో కొద్దిగా నొప్పి కలిగినా మానసికంగా మేలు చేసే విషయాలూ ఉన్నాయి.

(2 / 7)

టాటూలు శరీరానికి అందాన్ని కలిగించే యాక్సెసరీగా ఉండటం మాత్రమే కాదు వాటిలో శాశ్వతత్వం ఉంటుంది. ఈ ప్రక్రియలో కొద్దిగా నొప్పి కలిగినా మానసికంగా మేలు చేసే విషయాలూ ఉన్నాయి. (Pixabay)

శరీరంపై టాటూ స్వీయ సాక్షాత్కారం అంటే మనకంటూ ఒక ఐడెంటిటీని సూచిస్తుంది. జీవితంలో తమ ఎదుగుదలని గుర్తించే ప్రక్రియగా టాటూ ఉంటుందని సైకియాట్రిస్ట్ డాక్టర్ రాహుల్ ఖేమానీ అన్నారు.

(3 / 7)

శరీరంపై టాటూ స్వీయ సాక్షాత్కారం అంటే మనకంటూ ఒక ఐడెంటిటీని సూచిస్తుంది. జీవితంలో తమ ఎదుగుదలని గుర్తించే ప్రక్రియగా టాటూ ఉంటుందని సైకియాట్రిస్ట్ డాక్టర్ రాహుల్ ఖేమానీ అన్నారు.(Pixabay)

వ్యక్తులు మరణించినా కూడా వారి గుర్తులు, జ్ఞాపకాలుగా టాటూలు ఉంటాయని, దుఃఖించే ప్రక్రియలో ఇది ఊరట కలిగించే విషయంగా కొంత మంది భావిస్తున్నారు.

(4 / 7)

వ్యక్తులు మరణించినా కూడా వారి గుర్తులు, జ్ఞాపకాలుగా టాటూలు ఉంటాయని, దుఃఖించే ప్రక్రియలో ఇది ఊరట కలిగించే విషయంగా కొంత మంది భావిస్తున్నారు. (Pixabay)

పచ్చబొట్టును మీరు నయం చేయలేని గత బాధలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. అంటే ఇవి శరీరంపై ఒక మచ్చగా, గాయాలుగా కాకుండా నిలదొక్కుకునే ధైర్యానికి బ్యాడ్జ్‌లుగా చూడవచ్చు అని సన్నీ భానుశాలి పేర్కొంది.

(5 / 7)

పచ్చబొట్టును మీరు నయం చేయలేని గత బాధలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. అంటే ఇవి శరీరంపై ఒక మచ్చగా, గాయాలుగా కాకుండా నిలదొక్కుకునే ధైర్యానికి బ్యాడ్జ్‌లుగా చూడవచ్చు అని సన్నీ భానుశాలి పేర్కొంది. (Pixabay)

  పచ్చబొట్టు అనేది చాలా వ్యక్తిగతమైనది.  ప్రత్యేక అర్ధాన్ని సూచించే డిజైన్ కొన్నిసార్లు బాధాకరమైనది, నిరుత్సాహానికి గురిచేసినప్పటికీ.. ఆ భావనను అధిగమిస్తే అది మీ బలాన్ని నిరంతరం గుర్తు చేస్తుందని టాటూ ఆర్టిస్ట్ భానుశాలి తెలిపారు.

(6 / 7)

పచ్చబొట్టు అనేది చాలా వ్యక్తిగతమైనది. ప్రత్యేక అర్ధాన్ని సూచించే డిజైన్ కొన్నిసార్లు బాధాకరమైనది, నిరుత్సాహానికి గురిచేసినప్పటికీ.. ఆ భావనను అధిగమిస్తే అది మీ బలాన్ని నిరంతరం గుర్తు చేస్తుందని టాటూ ఆర్టిస్ట్ భానుశాలి తెలిపారు.(Pexels)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు