Samantha | పొరపాటున కూడా పచ్చబొట్టు వేయించుకోకండి.. యువతకు సమంత సందేశం-samantha advices to youngster never get tattooed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha | పొరపాటున కూడా పచ్చబొట్టు వేయించుకోకండి.. యువతకు సమంత సందేశం

Samantha | పొరపాటున కూడా పచ్చబొట్టు వేయించుకోకండి.. యువతకు సమంత సందేశం

Maragani Govardhan HT Telugu
Apr 19, 2022 06:25 AM IST

హీరోయిన్ సమంత తన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ సెషన్‌లో టాటూల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమంత ఎలాంటి టాటూలు వేయించుకోవాలనికుంటోందని అడిగిన అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది.

సమంత
సమంత (Twitter)

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత(Samantha) ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతోంది. హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత ఈ భామ కెరీర్‌పై ఫోకస్ పెట్టి దూసుకెళ్తోంది. బోల్డ్ పాత్రలకు కూడా సై అంటూ తెలుగుతో పాటు ఇతర భాషలపైనా దృష్టి పెట్టింది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోపక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. వీలు చిక్కినప్పుడల్లా తనకు సంబంధించిన అప్డేట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోందీ ఈ బ్యూటీ. ఇటీవలే సామ్ ఇన్‌స్టాలో తన అభిమానుల కోసం క్వశ్చన్-ఆన్సర్ సెషన్‌ను(Sam Question and Answer Session) నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ అభిమాని పచ్చబొట్టు(Tattoo) గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది.

“సమంత ఎలాంటి టాటూలను వేసుకోవాలనుకుంటుంది” అని సదరు అభిమాని సామ్‌ను అడిగారు. దీంతో ఈ ముద్దుగుమ్మ షాకింగ్ ఆన్సర్ చెప్పింది. “నా సలహా అయితే యువత అస్సలు పచ్చబొట్టే వేయించుకోకూడదు. ఎప్పటికీ టాటూ అనేది శరీరంపై ఉండకూడదు" అని నొక్కి చెప్పింది. సమంత ఇచ్చిన సమాధానానికి అందరూ షాకయ్యారు. ఎందుకంటే సామ్‌ ఇప్పటికే మూడు టాటూలను వేయించుకుంది.

తన మాజీ భర్త నాగచైతన్యకు సంబంధించి మూడు పచ్చబొట్లను సమంత వేయించుకుంది. ఆమె మొదటి టాటూ YMC అని వీపుపై ఉంటుంది. వైఎంసీ అంటే ఏం మాయ చేశావే అని అర్థం. నాగచైతన్యతో సామ్ చేసిన తొలి చిత్రం ఇదే. రెండోది నడుము పైభాగంలో కుడి వైపున(పక్కటెములక వద్ద) 'చై'(Chay) అని ఉటుంది. ఈ మూడో టాటూ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. మూడోది మోచేతుల వద్ద చై. సామ్ అని ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా బాణం గుర్తులతో ఉంటుంది.

బాలీవుడ్‌పైన దృష్టి పెట్టిన సామ్.. అక్కడ వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించిన సమంత తన నటనతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువైంది. ఇటీవలే ముంబయిలో వరుణ్ ధావన్‌తో కలిసి సందడి చేసింది సమంత. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని స్పష్టత వచ్చింది. జులైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. జులైలో ప్రారంభించి నాలుగైదు నెలల్లో ముగించాలని మూవీ మేకర్స్ అనుకున్నారట.

ఓ పక్క తెలుగులో శకుంతలం, యశోధ లాంటి సినిమాలు చేస్తోంది మన సామ్. వీటితో పాటు తమిళంలోనూ ఓ సినిమాకు ఓకే చెప్పింది. విజయ్ దేవరకొండతో కలిసి ఓ చిత్రానికి పచ్చ జెండా ఊపిందట సామ్. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారట.

WhatsApp channel

సంబంధిత కథనం