Winter Hair Fall : ముక్కులో మూడు చుక్కల నెయ్యి.. జుట్టు రాలకుండా బెస్ట్ టిప్స్ ఇవే-home remedy for hair fall in winter season all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Hair Fall : ముక్కులో మూడు చుక్కల నెయ్యి.. జుట్టు రాలకుండా బెస్ట్ టిప్స్ ఇవే

Winter Hair Fall : ముక్కులో మూడు చుక్కల నెయ్యి.. జుట్టు రాలకుండా బెస్ట్ టిప్స్ ఇవే

Anand Sai HT Telugu

Winter Hair Fall Home Remedy : చలికాలం మెుదలైంది. అనేక చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను వస్తుంటాయి. కొంతమందికి విపరీతంగా జుట్టు రాలుతుంది. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.. జుట్టును కాపాడుకోవచ్చు.

జుట్టు రాలడం (unsplash)

జుట్టు కోసం కొందరు ఆయుర్వేద చికిత్సలను, మరికొందరు ఖరీదైన ఉత్పత్తులను ఆశ్రయిస్తున్నారు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం, ఇంటి నివారణలను ప్రయత్నించడం ద్వారా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయేవి ప్రతి ఇంట్లో సులభంగా దొరుకుతాయి. వింటర్ సీజన్‌(Winter Season)లో జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఏయే పదార్థాలు తీసుకోవచ్చో తెలుసుకుందాం.

కరివేపాకులు

ప్రతిరోజూ కనీసం 5-7 కరివేపాకులను తీసుకోవడం మెుదలుపెట్టండి. వాటిని పచ్చిగా తినవలసిన అవసరం లేదు. పోహా, ఉప్మా మొదలైన మీ వంటలో చేర్చుకోవచ్చు. ఈ ఆకులు హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో, ఇన్సులిన్ నిరోధకతను పెంపొందించడంలో సహాయపడతాయి.

అంతేకాకుండా మీ జుట్టును వాష్ చేసేందుకు పిడికెడు కరివేపాకులను నీటిలో వేసి మరిగించవచ్చు. ఇది చుండ్రు(Dandruff) చికిత్సలో కూడా సహాయపడుతుంది. కరివేపాకు టీని కూడా తాగవచ్చు. దీన్ని చేయడానికి ఒక కప్పు నీటిలో 5-7 కరివేపాకులను మరిగించి, దానిని ఫిల్టర్ చేసి తాగండి.

నువ్వుల నూనె

నువ్వుల నూనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ నూనె హృద్రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది. నువ్వుల నూనెను ఆహారంలో చేర్చుకుని తీసుకోండి. ఉదాహరణకు ఒక చెంచా నువ్వులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినండి. కావాలంటే కరివేపాకు టీ(Curry Leaves Tea) తయారు చేసేటప్పుడు దానికి ఒక చెంచా నువ్వులు వేయండి.

వేయించిన నువ్వులను అల్పాహారం లేదా భోజనంలోకి కూడా తినవచ్చు. ఇది కాకుండా సలాడ్ లేదా ఏదైనా డిష్ మీద కూడా చల్లుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన లడ్డూలకు వేయించిన నువ్వులు, నూనెను జోడించొచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఇంట్లో లడ్డూలు, చిక్కీలు, ఇతర తీపి వంటకాలు చేసేటప్పుడు నువ్వులతోపాటు బెల్లం వేసి ప్రతిరోజూ తినండి.

ఆవు నెయ్యి

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది. ముక్కు లోపల రెండు చుక్కల నెయ్యి వేయడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, జలుబు, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఇది కాకుండా ఉసిరి, మిఠాయిలో నెయ్యి కలిపి తింటే మంచి జరుగుతుందని అంటారు.