Broccoli Almond Soup Recipe : మంచి ఆరోగ్యానికి వింటర్లోబ్రోకలీ ఆల్మండ్ సూప్ బెస్ట్..
Broccoli Almond Soup Recipe : ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. ఫిట్నెస్ మీద ఆసక్తి ఉన్నవారికి తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే.. ప్రోటీన్ అనేది మన ఆహారంలో సరైనా మోతాదులో లేకుంటే.. మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అయితే మీ ఉదయాన్ని ప్రోటీన్ ఫుడ్‌తో ప్రారంభించాలి అనుకుంటే.. ఇక్కడ ఓ సూప్ రెసిపీ మీకోసం ఎదురుచూస్తోంది.
Broccoli Almond Soup Recipe : ప్రోటీన్‌ను పెంచే క్రీమ్, తేలికపాటి సూప్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదే బ్రోకలీ, ఆల్మండ్ సూప్. ఇది పూర్తిగా పోషకాలతో నిండినది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన సూప్. పిల్లలనుంచి పెద్దలవరకు ఎవరైనా దీనిని హాయిగా సేవించవచ్చు. ముఖ్యంగా చలికాలంలో దీనిని తీసుకుంటే.. మీరు ఎక్కువసేపు ఎనర్జిటిక్‌గా ఉంటారు. మరి దీనిని ఎలా తయారు చేయాలి. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* వెజిటబుల్ స్టాక్ - 800 Ml
* బ్రోకలీ - 700 గ్రాములు
* బాదం - 50 గ్రాములు (ఫ్రై చేసినది)
* స్కిమ్డ్ మిల్క్ - 250 Ml
* ఉప్పు - రుచికి తగినంత
* పెప్పర్ - రుచికి తగినంత
తయారీ విధానం
బ్రోకలీ, ఆల్మండ్ సూప్ తయారీ చేయడం చాలా సులభం. ముందుగా బ్రోకలీని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని 6 నుంచి 8 నిముషాలు ఆవిరిలో ఉడికించాలి. ఈ బ్రోకలీని వెజిటబుల్ స్టాక్ లో కలపండి. ఈ మిశ్రమంలో బాదం, స్కిమ్డ్ మిల్క్‌ను బ్లెండర్‌లో వేసి.. మెత్తగా అయ్యేవరకు ప్రాసెస్ చేయండి. ఈ క్రీమ్ సూప్ లో సాల్ట్, పెప్పర్ వేసి బాగా కలపండి. ఓ 5 నిముషాలు దీనిని సన్నని మంటపై మరిగించండి. అంతే వేడి వేడి బ్రోకలీ ఆల్మండ్ సూప్ రెడీ.
సంబంధిత కథనం