Brain foods for kid: పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలా? ప్రతిరోజూ వీటిని తినిపించండి
Brain foods for kid: పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తేనే చదువు వారికి వస్తుంది. కాబట్టి వారి మానసిక ఆరోగ్యాన్ని, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

Brain foods for kid: జ్ఞాపకశక్తి , శ్రద్ధ, ఏకాగ్రత, పరిష్కార నైపుణ్యాలు... ఇవన్నీ కూడా ఇచ్చేది మెదడే. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు చక్కగా చదువగలుగుతారు. మెదడు ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చాలా అవసరం. కాబట్టి మీ పిల్లల రోజువారి ఆహారంలో ఇవన్నీ ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ప్రతిరోజూ గుప్పెడు డ్రైఫ్రూట్లను తినిపించడం ద్వారా వారి జ్ఞాపక శక్తిని పెంచవచ్చు. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినిపించడం ద్వారా వారి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి రోజూ వారికి గుప్పెడు నట్స్ తినిపించండి.
బాదంపప్పు
బాదం పప్పులను తరచూ పిల్లలు చేత తినిపిస్తే వారికి విటమిన్ కె, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. రాత్రిపూట బాదంపప్పును నానబెట్టి ఉదయాన పొట్టు తీసి వారికి ఇచ్చి తినమని చెప్పండి. ఇది మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. దీనివల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది.
ఆక్రోట్లు
వీటిని వాల్ నట్లు అని కూడా పిలుస్తారు. వీటిలో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. నాడీ మార్గాల అభివృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ పిల్లలకు నీటిలో నానబెట్టిన వాల్నట్స్ ఇవ్వండి. వారి జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
ఎండుద్రాక్ష
ఎండు ద్రాక్షలు సహజంగానే స్వీట్ గా ఉంటాయి. వీటిని తినిపించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రవాహం సరిగా జరిగేలా చూస్తాయి. మెదడుకు తగినంత ఆక్సిజన్ సరఫరా అయ్యేలా జాగ్రత్త పడతాయి. కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని ఇది ఎంతగానో కాపాడతాయి.
జీడిపప్పు
రుచికరమైన డ్రై ఫ్రూట్స్‌లలో జీడిపప్పు ఒకటి. రోజూ నాలుగు జీడిపప్పు పలుకులను పిల్లల చేత తినిపించండి. మెదడుకు మేలు చేసే విలువైన పోషకాలు దీనిలో ఉంటాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే మెగ్నీషియం జీడిపప్పుల్లో అధికంగా ఉంటుంది. జీడిపప్పులు తినడం వల్ల మానసిక ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. నెగటివ్ థింకింగ్ తగ్గుతుంది. అభిజ్ఞా పని తీరును కాపాడుతుంది.
ఎండు ఖర్జూరాలు
ఖర్జూరాలలో సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది. అలాగే ఫైబర్ ఉంటుంది. మెదడు పనితీరుకు అవసరమైన ఎన్నో పోషకాలు దీనిలో ఉంటాయి. ఖర్జూరాలు తినడం వల్ల శక్తి త్వరగా అందుతుంది. ఫైబర్ కూడా శరీరంలో స్థిరంగా విడుదలవుతూ ఉంటుంది. మెదడును అప్రమత్తంగా ఉంచడంలో ఖర్జూరాలు ముందుంటాయి. ఇవి మెదడును ఆక్సికరణ ఒత్తిడి నుండి కాపాడతాయి.
పిస్తా
పిస్తా పప్పులు చూస్తేనే నోరూరి పోతుంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంచే పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ b6, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. విటమిన్ బి6లో న్యూరో ట్రాన్స్ మీటర్ల ఉత్పత్తికి కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి విటమిన్ b6 కోసం పిస్తాలను కచ్చితంగా తినాలి. మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరిచేందుకు పిస్తాలు ఉపయోగపడతాయి.