ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అనేక పోషకాలు అందుతాయి. అయితే, ఖర్జూరాలను అతిగా తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా, ఖర్జూరాలు మోతాదుకు మించి తీసుకుంటే ఎదురయ్యే సమస్యలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
ఖర్జూరాలను అతిగా తింటే జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. ఆహారం జీర్ణయ్యేందుకు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే, కడుపు నొప్పి సమస్య కూడా ఎదురుకావొచ్చు.
Photo: Pexels
ఖర్జూరాల్లో క్యాలోరిక్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి ఎక్కువగా తింటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ రిస్క్ అధికమవుతుంది.
Photo: Pexels
ఖర్జూరాలు అతిగా తింటే చర్మంపై దద్దుర్లు, దురద లాంటి సమస్యలు రావొచ్చు. వీటిలో సల్ఫేట్ ఎక్కువగా ఉండడం కారణంగా ఇలా జరుగుతుంది.
Photo: Pexels
ఖర్జూరాలు తినడం వల్ల ఎముకల దృఢత్వానికి మేలు జరుగుతుంది. అయితే, వీటిని అతిగా తింటే కండరాల నొప్పులు వస్తాయి. ఖర్జూరాల్లో పొటాషియం అధికం ఉండండం ఇందుకు కారణం అవుతుంది.
Photo: Pexels
ఖర్జూరాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తింటే ఊభకాయం రావడం, బరువు పెరగడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
Photo: Pexels
మానవ శరీరంలో పాంక్రియాస్ గ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి.