Raisins With Curd : ఎండు ద్రాక్షను పెరుగులో కలిపి తింటే మీ స్టామినా పెరుగుతుంది
Raisins With Curd : ఎండుద్రాక్ష, పెరుగు కలిపి తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పురుషుల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం వదిలించుకోవటం లేదా రోగనిరోధక శక్తిని పెంచుకువాలనుకునేవారూ ఇది తినొచ్చు.
పెరుగు, ఎండుద్రాక్షలు(Curd and Raisins) తినడం అనేది అద్భుతమైన ఔషధంగా ఉంది. రక్తపోటు ఉన్నవారు రోజూ తినాలి. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ కూడా పెరుగు, ఎండుద్రాక్ష తినమని సలహా ఇస్తున్నారు. ఎండుద్రాక్ష, పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, దానిని ఎప్పుడు తినాలో తెలుసుకుందాం.
ఎండు ద్రాక్షను పెరుగులో కలిపి తింటే పేగులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే పెరుగు, ఎండుద్రాక్షలను కలిపి తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా(Bacteria) వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా దీని వినియోగం పేగు మంటలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు బలహీనమైన రోగనిరోధక శక్తి(Immunity)ని కలిగి ఉంటే, సులభంగా వ్యాధులకు గురవుతారు. అటువంటి పరిస్థితిలో మీరు పెరుగులో ఎండుద్రాక్షను కలిపి తింటే, అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీరు వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి సురక్షితంగా ఉండగలరు.
శరీరంలో ఐరన్ లోపం కారణంగా, రక్తహీనత ఉండవచ్చు. పెరుగులో ఎండుద్రాక్షను కలిపి తింటే, అది శరీరంలోని ఐరన్ లోపాన్ని తొలగిస్తుంది. దీంతో రక్తహీనత వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడేవారు ఎండుద్రాక్షను పెరుగులో కలిపి తింటే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ ఎండుద్రాక్ష, పెరుగు తినడం పురుషులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్పెర్మ్ కౌంట్(Sperm Count) పెరుగుతుంది. స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది. మీరు కూడా ఈ సమస్యతో ఉన్నట్టయితే.. ఎండుద్రాక్ష, పెరుగు తినడం ప్రారంభించవచ్చు.
ఒక పరిశోధన ప్రకారం, పెరుగు తీసుకోవడం పురుషులలో వీర్య నాణ్యతను మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. పెరుగు అనేక ఇతర వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. అందుకే పెరుగు తినమని సలహా ఇస్తారు. ఎండుద్రాక్షను టెస్టోస్టిరాన్ పెంచే ఆహారంగా చెబుతారు. ఇది పురుషుల లైంగిక సమస్యలను తొలగించడానికి, వారి వివిధ శారీరక సమస్యల నుంచి బయటపడేసేందుకు ప్రభావవంతంగా పనిచేసే హార్మోన్.
సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ కూడా ఎండుద్రాక్షను పెరుగుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. పెరుగు మంచి ప్రోబయోటిక్, ఎండుద్రాక్షలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. మొదట ఒక గిన్నెలో 4-5 ఎండుద్రాక్ష, కొద్దిగా పెరుగు జోడించాలి. పెరుగును కనీసం 8 గంటలపాటు ఉంచాలి. పెరుగును ఎండుద్రాక్షతో కలిపి మధ్యాహ్న భోజనంలో లేదంటే.. సాయంత్రం 4 గంటల తర్వాత తీసుకోవచ్చు.
గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా కథనం ఇచ్చాం. ఏదైనా తీసుకునే ముందు, మీరు తప్పనిసరిగా వైద్యులు లేదా నిపుణుల నుండి సలహా తీసుకోవాలి.