Best Bridal Juices : పెళ్లి చేసుకోబోయే యువతులు ఈ జ్యూస్‌లు తాగండి.. ముఖం మెరిసిపోతుంది-best pre bridal juices for glowing skin naturally abc juice aloe vera tomato ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Bridal Juices : పెళ్లి చేసుకోబోయే యువతులు ఈ జ్యూస్‌లు తాగండి.. ముఖం మెరిసిపోతుంది

Best Bridal Juices : పెళ్లి చేసుకోబోయే యువతులు ఈ జ్యూస్‌లు తాగండి.. ముఖం మెరిసిపోతుంది

Anand Sai HT Telugu
Apr 20, 2024 02:00 PM IST

Best Bridal Juices In Telugu : పెళ్లి సమయంలో అందంగా మెరిసిపోవాలని అందరూ అనుకుంటారు. ఇందుకోసం రకారకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో కొన్ని రకాల జ్యూస్‌లు తాగితే అమ్మాయిలు మెరిసిపోతారు.

అందాన్ని పెంచే జ్యూస్ లు
అందాన్ని పెంచే జ్యూస్ లు (Unsplash)

మేకప్ లేకుండా సహజమైన పండ్లు మీ చర్మాన్ని మెరిసేలా చేయగలవని మీకు తెలుసా? ఎలా అని ఆలోచిస్తున్నారా? వధువు చర్మాన్ని మెరిసేలా చేసే జ్యూస్‌లు కొన్ని ఉన్నాయి. అవేంటో కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ జ్యూస్‌లు తాగడం వల్ల పెళ్లిలో వధువు చర్మం మెరిసిపోతుంది. మేకప్ లేకుండా చర్మం మెరిసిపోవడానికి సహజసిద్ధమైన పండ్లను ఉపయోగించవచ్చు. పెళ్లికూతురు చర్మాన్ని మెరిసేలా చేసే ఆ జ్యూస్‌ల గురించి చూద్దాం..

దోసకాయ, అలోవెరా జ్యూస్

దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. అలోవెరా మీ చర్మంలో వాపు, అసమతుల్యతను తగ్గిస్తుంది. ఈ 2 జ్యూస్‌లను కలిపి తాగడం వల్ల మీ చర్మం మెరిసిపోతుంది. పెళ్లి సమయంలో అందంగా మెరిసిపోతారు.

టొమాటో, ఆకుకూరల రసం

టొమాటోలో లైకోపీన్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా కారణమవుతుంది. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ఆకుకూరలు, టమోటాలు చర్మానికి అవసరమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి మెుత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

పాలకూర, నిమ్మరసం

ఆకుకూరలు పోషకాలతో నిండి ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది మన శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. చర్మాన్ని సమస్యల నుంచి నయం చేస్తుంది. ఈ పాలకూర రసంలో కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి ఇది ముఖ్యం.

ABC జ్యూస్

యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ కలయికలో యాంటీఆక్సిడెంట్లు, వివిధ విటమిన్లు ఉంటాయి. ఇది మన చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉంటుంది. బీట్‌రూట్‌లో ఐరన్, విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ బి6 ఉంటాయి. యాపిల్స్ మీ శరీరానికి అవసరమైన ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. యువతులు తమ చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే ఈ ఏబీసీ జ్యూస్ తప్పనిసరిగా తాగాలి.

దానిమ్మ, ఆరెంజ్ జ్యూస్

ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మలో పుష్కలంగా ఉన్నాయి. ఇది మన చర్మాన్ని ఎప్పటికీ యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మానికి కాంతిని ఇస్తుంది.

పుచ్చకాయ, పుదీనా రసం

మెరిసే చర్మానికి హైడ్రేషన్ చాలా అవసరం. పుచ్చకాయ కచ్చితంగా దీన్ని చేస్తుంది. పుదీనా జోడించడం వల్ల చర్మం రిఫ్రెష్ అవుతుంది. చర్మం చికాకును కూడా నియంత్రిస్తుంది.

యాపిల్, కివీ జ్యూస్

యాపిల్స్ చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. కివీ పండులో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది చాలా అవసరం. ఈ రెండు పండ్ల రసాలను కలిపి తీసుకుంటే మీ చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

క్రాన్బెర్రీ జ్యూస్

క్రాన్బెర్రీస్లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మెరిసే చర్మానికి ఇది చాలా అవసరం. ఈ రసం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

WhatsApp channel