How to Grow a Beard: గుబురు గడ్డంతో మీకు అందమే కాదు ఆరోగ్యం కూడా, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
గడ్డం పెంచితే దేవదాసు అని ఒకప్పుడు అందరూ ఎగతాళి చేసేవారు. కానీ ఇప్పుడు గడ్డం ఒక ట్రెండ్ అయిపోయింది. కుర్రాళ్ల నుంచి వయసు మళ్లిన వారి వరకు తమ పేస్‌కి సూట్ అయ్యేలా గడ్డం పెంచుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గడ్డం ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్‌గా అయిపోయింది. ఒకప్పుడు గడ్డం పెంచిన వారిని చూస్తే లవ్ ఫెయిల్యూరా? అంటూ హేళన చేసేవారు. కానీ.. ఇప్పుడు 10 మందిలో కనీసం 5-6 మంది గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు.
గడ్డం పెంచడమే కాదు.. అది అందంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం ముఖ్యం. గడ్డం పెరగాలంటే క్రమం తప్పకుండా గడ్డాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి కనీసం ఒకసారి మైల్డ్ షాంపూ, కండీషనర్ ఉపయోగించి గడ్డం వాష్ చేసుకోవాలి. అంతేకాక గడ్డం పొడిబారకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా దువ్వడం కూడా చాలా ముఖ్యం.
ఏం తినాలి?
గడ్డం ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. మాంసకృత్తులు సమృద్ధిగా ఉండే చేపలు, గుడ్లు తినడం ద్వారా గడ్డం బలంగా పెరుగుతుంది. బాదం, జీడిపప్పు లాంటివి తినడం వల్ల గడ్డం వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తాయి.
ఆకుకూరలు, క్యారెట్ వంటి ఆహారాలు ఐరన్, విటమిన్-ఏని అందిస్తాయి. ఇవి గడ్డం ఆరోగ్యానికి ఎంతో అవసరం. గడ్డం పర్ఫెక్ట్ లుక్ కోసం బియర్డ్ ఆయిల్స్‌తో మసాజ్ చేయడం కూడా మంచిది. యూకలిప్టస్ ఆయిల్ లేదా జామాయిల్ వాడితే గడ్డం సాఫ్ట్‌గా, చక్కగా పెరుగుతుంది.
గడ్డం ఆరోగ్యంగా పెరగాలంటే
మొదట గడ్డాన్ని సక్రమంగా ట్రిమ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలా ట్రిమ్మింగ్ చేయడం వల్ల గడ్డం శుభ్రంగా, సమపాళ్లలో పెరుగుతుంది. అలాగే చర్మం తేమ కోల్పోకుండా, పొడిబారకుండా ఉండేలా బియర్డ్ ఆయిల్‌ను రోజూ వాడడం మంచిది. ఆయిల్ గడ్డం కింద చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. దాంతో చర్మం పొడిబారడం, గడ్డంలో నల్ల మచ్చలు రావడాన్ని నివారిస్తుంది.
మంచి ఆహారం, యూజర్ ఫ్రెండ్లీ షేవింగ్ క్రిములు వాడితే గడ్డం నాజూకుగా ఉంటుంది. గడ్డాన్ని మెరుగ్గా పెంచడానికి ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. గడ్డం పెంచడం ఒక స్టైల్ మాత్రమే కాదు, ఆరోగ్యంగా, శ్రద్ధగా చూసుకుంటేనే అది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
గడ్డం లుక్‌తో ప్రయోజనాలు
గడ్డం లుక్‌ను ఎంచుకోవడం ఫ్యాషన్ మాత్రమే కాకుండా, కొన్ని విధాలుగా ఆరోగ్యపరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
- సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా, గడ్డం ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. గడ్డం ముఖాన్ని యూవీ కిరణాల నుండి రక్షిస్తుంది.
- గడ్డం చర్మాన్ని పొడిబారడం, మురికి, పొడిబారిన గాలులు నుంచి రక్షిస్తుంది. చర్మం సున్నితంగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
- గడ్డం ముఖాన్ని యువకుడిగా కనిపించేలా చేస్తుంది. మొటిమలు, మచ్చలు వంటి వాటిని చర్మం కప్పిపుచ్చుతుంది
- గడ్డం వాతావరణంలో దుమ్ము, ధూళి వంటివి ముఖానికి చేరకుండా ఆపుతుంది. దాంతో ఊపిరితిత్తుల సమస్యలు మీ దరిచేరవు
- గడ్డం మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది. ముఖ్యంగా గడ్డం ఉన్నవారిలో ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది.
కాబట్టి.. గడ్డం కేవలం ఒక ఫ్యాషన్ ట్రెండ్ మాత్రమే కాకుండా, మీ ఆరోగ్యం, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది.