Drink for Beauty: దసరాకు మెరిసిపోవాలనుకుంటున్నారా? ఐదు రోజులపాటు ఈ డ్రింక్‌ను తాగండి, చర్మం కాంతివంతంగా మారుతుంది-drink beetroot juice for five days and the skin will become brighter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drink For Beauty: దసరాకు మెరిసిపోవాలనుకుంటున్నారా? ఐదు రోజులపాటు ఈ డ్రింక్‌ను తాగండి, చర్మం కాంతివంతంగా మారుతుంది

Drink for Beauty: దసరాకు మెరిసిపోవాలనుకుంటున్నారా? ఐదు రోజులపాటు ఈ డ్రింక్‌ను తాగండి, చర్మం కాంతివంతంగా మారుతుంది

Haritha Chappa HT Telugu
Published Oct 08, 2024 08:30 AM IST

Drink for Beauty: దసరాకు పిల్లలు, పెద్దలు సిద్ధమైపోతారు. కొత్త దుస్తులతో పండుగ చేసేందుకు రెడీ అవుతారు. దసరా రోజు అందంగా మెరవాలనుకుంటే ముందు ఐదు రోజులు పాటు ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ ను తాగేందుకు ప్రయత్నించండి.

మీ చర్మసౌందర్యాన్ని పెంచే డ్రింకు
మీ చర్మసౌందర్యాన్ని పెంచే డ్రింకు (Pixabay)

తెలుగు రాష్ట్రాల్లో దసరా పెద్ద పండుగ. ఆ పండుగకు ఇల్లంతా కళకళలాడిపోతూ చుట్టాలతో నిండిపోతుంది. ఎక్కడెక్కడో నగరాల్లో ఉన్నవారు కూడా దసరాకు సొంత ఇంటికి, గ్రామాలకు చేరుకుంటారు. ఆరోజు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దసరాకు మెరవాలనుకుంటే ఈరోజు నుంచే ప్రతిరోజూ ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. ఐదు రోజులు పాటు ఈ జ్యూస్‌ను తాగి చూడండి. దసరా రోజు మీ చర్మం కాంతివంతంగా మారిపోతుంది.

తాజా పండ్లు, కూరగాయలతో తయారు చేసిన జ్యూసుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని మెరిపిస్తాయి. పోషకాలు అధికంగా ఉండే ఈ జ్యూస్ మీ శరీరాన్ని హైడ్రేటింగ్ చేస్తుంది. దీని వలన చర్మం కాంతివంతంగా మారుతుంది.

బీట్ రూట్ ఉపయోగాలు

బీట్రూట్.. యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లతో నిండి ఉంటుంది. మీ చర్మంలో రక్త ప్రవాహాన్ని బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి రక్షణగా నిలుస్తాయి. చర్మ కణాలను పునర్జీవితం చేయడంలో ముందుంటాయి. కేవలం బీట్రూట్ మాత్రమే కాదు క్యారెట్లు, దోసకాయలు, పాలకూర, తేనె, అల్,లం నిమ్మకాయ వంటి వాటిలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటన్నింటితోను జ్యూసులు చేసుకుని తాగితే మీ చర్మం తక్కువ రోజుల్లోనే మెరుపు సంతరించుకుంటుంది.

అందానికి దోసకాయ

ప్రతిరోజు ఒక క్యారెట్ తినడం లేదా బీట్రూట్ క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగడం చేయండి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. చర్మానికి కొల్లాజెన్ చాలా ముఖ్యమైనది. చర్మానికి ఎలాంటి నష్టం రాకుండా ఇది కాపాడుతుంది. దోసకాయను సూపర్ హైడ్రేటర్ గా చెప్పుకుంటారు. దీనిలో నీరు నిండి ఉంటుంది. దోసకాయలో ఉండే సిలికా మీ చర్మాన్ని మృదువుగా దృఢంగా మారుతుంది మారుస్తుంది.

పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యం, అందమైన చర్మానికి ఎంతో అవసరమైనవి. పాలకూరలో కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలు ఎక్కువ. ఇవి చర్మాన్ని చికాకు పెట్టకుండా కాపాడతాయి.

బీట్రూట్ జ్యూస్ లో నిమ్మరసం కూడా పిండుకుంటే మంచిది. ఇది నేచురల్ డిటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే సహజంగానే మీ చర్మాన్ని పరిశుభ్రంగా మారుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చర్మానికి అవసరమైన కొలాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది.

రోజుకో స్పూను తేనె తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. తేనెను బీట్రూట్ జ్యూస్ లో వేసుకుంటే అంత రుచిగా ఉండదు. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ తేనె తినడం అలవాటు చేసుకోండి. దీంతో పాటు బీట్రూట్ జ్యూస్ ని కూడా తింటే ఎంతో మంచిది.

చర్మాన్ని మెరిపించే జ్యూస్ తయారీ

బీట్రూట్ కొన్ని ముక్కలు, క్యారెట్ కొన్ని ముక్కలు, దోసకాయ ముక్కలు, పాలకూర ఆకులు, నిమ్మరసం, చిన్న అల్లం ముక్క తీసుకొని బ్లెండర్లో వేయాలి. తగినంత నీరు కూడా వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి ఆ జ్యూస్‌ను తాగేయాలి. అందులో తేనె కలుపుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. ఇక మిగిలిన గుజ్జుతో హల్వా చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు కూడా నచ్చుతుంది.

Whats_app_banner