Bigg Boss 8 Telugu Day 17: వైలెంట్‍గా ఆడతానంటూ రెచ్చిపోయిన పృథ్వి.. మళ్లీ ఏడ్చేసిన మణి.. ఎక్కువ గుడ్లు ఎవరికంటే..-bigg boss 8 telugu day 17 highlights today episode roundup prithviraj loses cool on adithya om manikanta cries again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu Day 17: వైలెంట్‍గా ఆడతానంటూ రెచ్చిపోయిన పృథ్వి.. మళ్లీ ఏడ్చేసిన మణి.. ఎక్కువ గుడ్లు ఎవరికంటే..

Bigg Boss 8 Telugu Day 17: వైలెంట్‍గా ఆడతానంటూ రెచ్చిపోయిన పృథ్వి.. మళ్లీ ఏడ్చేసిన మణి.. ఎక్కువ గుడ్లు ఎవరికంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 18, 2024 11:31 PM IST

Bigg Boss 8 Telugu Day 17 Roundup: బిగ్‍బాస్ హౌస్‍లో కోడిగుడ్లతో పెట్టిన టాస్క్‌లో రచ్చరచ్చ జరిగింది. కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు గొడవలు పడ్డారు. ఈ క్రమంలో పృథ్విరాజ్, ఆదిత్య ఓం మధ్య వాదన గట్టిగానే జరిగింది. పృథ్వి నోరు జారి రెచ్చిపోయారు. మణి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.

Bigg Boss 8 Telugu Day 17: వైలెంట్‍గా ఆడతానంటూ రెచ్చిపోయిన పృథ్వి.. మళ్లీ ఏడ్చేసిన మణి.. ఎక్కువ గుడ్లు ఎవరికంటే..
Bigg Boss 8 Telugu Day 17: వైలెంట్‍గా ఆడతానంటూ రెచ్చిపోయిన పృథ్వి.. మళ్లీ ఏడ్చేసిన మణి.. ఎక్కువ గుడ్లు ఎవరికంటే..

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఫిజికల్ టాస్క్ రసాభాసగా సాగింది. కోడిగుడ్లతో జరిగిన ఈ గేమ్‍లో నిఖిల్, అభయ్ క్లాన్‍లోని కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీపడ్డారు. ఒకరినొకరు తీసుకోవడంతో పాటు కిందామీదా పడ్డారు. ఆదిత్య ఓంతో పృథ్విరాజ్ గొడవపడ్డారు. మాటలతోనూ రెచ్చిపోయారు. మణికంఠ ఓ దశలో కిందపడిపోయారు. ఆ తర్వాత ఎమోషనల్ అయ్యారు. 17వ రోజు (18వ ఎపిసోడ్) ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

ఆ గొడవ కంటిన్యూ

రేషన్ కోసం జరిగిన బెలూన్ ఛాలెంజ్ విషయంలో నిఖిల్, అభయ్ క్లాన్ సభ్యుల మధ్య వాదన కొనసాగింది. యష్మి గట్టిగానే గొడవ కొనసాగించారు. నిఖిల్‍తో పాటు సంచాలక్‍గా ఉన్న సోనియాపై కోపం వ్యక్తం చేశారు. తాను స్ట్రాటజీ ప్రకారమే బాక్స్ నుంచి బయటికి వచ్చి ఆడానని మణితో అభయ్ అన్నారు. నిఖిల్ స్టిక్ విరిగితే తనకు ఏం సంబంధం అని చెప్పారు. దీనిపైనే చర్చ ఎక్కువసేపు సాగింది.

ఏడ్చేసిన విష్ణు

ప్రేరణ, మణికంఠ దోశలు వేశారు. తినేందుకు విష్ణుప్రియ వెళ్లారు. అయితే, తన ప్లేట్‍లో దోశను పడేసినట్టు ప్రేరణ వేశారంటూ విష్ణు కన్నీరు పెట్టుకున్నారు. అడ్డుకునే వారికి వేసినట్టు చేశారంటూ బాధపడ్డారు. కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చారు. “ఎవరిదైనా ఆకలే కదా” అని విష్ణు ఏడ్చారు. సీతను ఆమెను సముదాయించారు. ఈ విషయంపై ప్రేరణపై మణి అరిచారు. ఆ తర్వాత ప్రేరణ, విష్ణు మళ్లీ మాట్లాడుకున్నారు. నీ వల్లే పెద్దగా అయిందని మణిపై ప్రేరణ ఆరోపణ చేశారు. దీన్ని మణి అంగీకరించలేదు. యూటిట్యూడ్ చూపించొద్దని చెప్పేశారు. బంగారు కోడిపెట్ట పాటతో 17వ రోజు మొదలైంది.

క్లాన్‍లకు రేషన్.. వంటకు టైమ్ రూల్

రేషన్ కోసం పెట్టిన టాస్కుల్లో రెండింట్లో గెలిచిన నిఖిల్‍కు చెందిన శక్తి క్లాన్‍ను బిగ్‍బాస్ అభినందించారు. మనసుకు నచ్చిన ఆహారాన్ని సంపాదించుకునేందుకు సూపర్ మార్కెట్‍కు వెళ్లేందుకు అర్హత సాధించారని చెప్పారు. ఒక్క టాస్కే గెలిచిన అభయ్‍కు చెందిన కాంతార క్లాన్‍ను మిగిలి ఉన్న రేషన్ వెనక్కి ఇచ్చేయాలని బిగ్‍బాస్ ఆదేశించారు. ఏమీ లేవని అభయ్ చెప్పారు. మిగిలిన కొంత ఫుడ్‍ను స్టోర్ రూమ్‍లో పెట్టేశారు. ఆ తర్వాత సూపర్ మార్కెట్‍లోకి వెళ్లి నిఖిల్ రేషన్ షాపింగ్ చేశారు. అభయ్‍కు కూడా సరుకులను షాపింగ్ అవకాశాన్ని బిగ్‍బాస్ ఇచ్చారు.

వారం మొత్తం మీద వంట చేసుకునేందుకు 14 గంటల సమయమే అని రూల్ పెట్టారు బిగ్‍బాస్. బెల్ కొట్టి సమయం వినియోగించుకోవాలని అన్నారు. దీనిపై కూడా కంటెస్టెంట్ల మధ్య చర్చోపచర్చలు జరిగాయి.

ప్రభావతి 2.0 ఎంట్రీ

ప్రభావతి 2.0 అంటూ ఓ కోడిపెట్టె ఆకారం హౌస్‍లోకి వచ్చింది. తాను పంపించే గుడ్లను జాగ్రత్తగా చూసుకొని.. తాను అడిగినప్పుడు ఎక్కువ తిరిగిచ్చే క్లాన్‍కు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయని ప్రభావతి 2.0 చెప్పింది. రెండు క్లాన్‍ల సభ్యులు ఎలా గేమ్ ఆడాలని చర్చించుకున్నారు.

గేమ్‍లో రచ్చరచ్చ

ఈ కోడిగుడ్ల ఛాలెంజ్‍లో కంటెస్టెంట్లు హోరాహోరీగా తలపడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. గొడవలు పడ్డారు. ఇది ఫిజికల్ టాస్క్ కావటంతో ఒకరినొకరు లాగేసుకున్నారు. కోడి నుంచి గుడ్లను తీసుకునేటప్పుడు తీవ్రంగా పోటీపడ్డారు. దెబ్బలు తగులుతున్నాయని అంటే.. “నేను అమ్మాయినైనా ఆడడం లేదా.. అలా అయితే టాస్కులు వద్దని బిగ్‍బాస్‍తో చెప్పండి” అంటూ యష్మి అన్నారు.

అభయ్‍తో పృథ్వి గొడవ

గుడ్లను తీసుకునే క్రమంలో ఆదిత్య ఓంపై బలప్రయోగం చేశారు పృథ్విరాజ్. మెడ పట్టుకొని పక్కకు తీసేశారు. అయితే, మెడ పట్టుకొని అలా చేయవద్దని ఆదిత్య వారించారు. అయితే, తాను వైలెంట్‍గానే గేమ్ ఆడతానని, చేతకాకపోతే పక్కకుపోయి కూర్చోవాలని ఆదిత్యపై పృథ్వి అరిచారు. అది కరెక్ట్ కాదంటూ ఆదిత్య అన్నారు. గట్టి అరుస్తూ అభ్యంతరకర పదాలతో పృథ్వి రెచ్చిపోయి మాట్లాడారు. పక్కన వారు చెబుతున్నా పట్టించుకోకుండా అరిచారు. ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ పృథ్విని సమర్థిస్తూ సోనియా అరిచారు.

పడిపోయిన మణికంఠ.. కన్నీళ్లు

నిఖిల్ పక్కకు తోయటంతో మణికంఠ కిందపడ్డారు. కాసేపు కదలకుండా అలాగే ఉండిపోయారు. దీంతో ఇతర కంటెస్టెంట్లు కంగారు పడ్డారు. ఇక టాస్క్ ఆడొద్దని రెస్ట్ తీసుకోవాలని మణికంఠతో చీఫ్ అభయ్ అన్నారు. దీంతో తాను గేమ్ ఆడతానని మణి ఏడ్చేశారు. గేమ్ ఎవరైనా ఆడొచ్చని, లైఫ్ ముఖ్యమని, నమ్ముకొని ఇద్దరు ఉన్నారని అభయ్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. “ఎవరూ లేరు. ఈ షోనే నా లైఫ్. నా పెళ్లాం, బిడ్డలు నాకు కావాలంటే షో విన్ అవ్వాలి” అని మణి కన్నీళ్లు పెట్టుకున్నారు.

నిఖిల్ క్లాన్ వద్ద ఎక్కువ గుడ్లు.. నబీల్ ఔట్

అప్పటి వరకు కలెక్ట్ చేసిన గుడ్లను లెక్కించాలని బిగ్‍బాస్ చెప్పారు. నిఖిల్‍కు చెందిన శక్తి క్లాన్ వద్ద 66 కోడిగుడ్లు ఉన్నాయి. కాంతార క్లాన్ 34 కోడిగుడ్లను మాత్రం తీసుకుంది. దీంతో అభయ్ క్లాన్ నుంచి ఓ సభ్యుడిని టాస్క్ నుంచి తప్పించే అవకాశాన్ని నిఖిల్‍కు బిగ్‍బాస్ ఇచ్చారు. దీంతో నబీల్ ఇక ఆడకూడదని నిఖిల్ చెప్పారు. దీంతో ఈ టాస్కుకు ఇక నుంచి నబీల్ సంచాలక్‍గా ఉంటారని బిగ్‍బాస్ కన్ఫర్మ్ చేశారు. ఈ గుడ్లను తిరిగి ప్రభావతి 2.0 కోడికి ఇచ్చే ప్రక్రియ రేపటి ఎపిసోడ్‍లో ఉండే అవకాశం ఉంది.