Beard man: గడ్డం ఉన్న మగవారు రొమాన్స్‌లో రెచ్చిపోతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?-are men with beards more romantic what do the studies say ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beard Man: గడ్డం ఉన్న మగవారు రొమాన్స్‌లో రెచ్చిపోతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Beard man: గడ్డం ఉన్న మగవారు రొమాన్స్‌లో రెచ్చిపోతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Haritha Chappa HT Telugu
Sep 14, 2024 08:00 AM IST

గడ్డం ఉన్న పురుషులు ఎలాంటి వారో తెలుసుకునేందుకు అధ్యయనం జరిగింది. ఆ పరిశోధనలో గడ్డం ఉన్న మగవారు చాలా రొమాంటిక్ గా ఉంటారని కూడా తేలింది. గడ్డం పెంచుకున్న మగవారిని నమ్మవచ్చని కూడా అధ్యయనం చెబుతోంది.

గడ్డం ఉన్న మగవారు రొమాంటిక్‌గా ఉంటారా?
గడ్డం ఉన్న మగవారు రొమాంటిక్‌గా ఉంటారా? (shutterstock)

ప్రతి మహిళ తన భాగస్వామి చాలా రొమాంటిక్, కేరింగ్ స్వభావం కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఆమె ఎన్నో కలలు కంటుంది. ఇందుకోసం ఆమె తన భాగస్వామి రూపాన్ని కూడా తీక్షణంగా గమనిస్తారు. మంచి రిలేషన్ షిప్ విషయానికి వస్తే అందం కన్నా మంచి వ్యక్తిత్వం ఉండటం ముఖ్యం. ప్రేమ, గౌరవం రెండింటినీ కాపాడుకునే ప్రతి బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది. ఇటీవల జరిగిన అధ్యయనంలో విజయవంతమైన సంబంధాలకు కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు.

కొత్త అధ్యయనం ప్రకారం, గడ్డం ఉన్న అబ్బాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటాడు, వారు మంచి ఫ్యామిలీ మ్యాన్ అవుతాడు. ఆసక్తికరంగా, గడ్డం లేని పురుషుల కంటే గడ్డం ఉన్న పురుషులు మంచి శృంగార భాగస్వాములుగా ఉండే అవకాశం ఉంది.

ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, గడ్డాలు పెంచుకునే పురుషులు తన భాగస్వామిని సంతోష పెట్టేందుకు చూస్తారు, వారు అనుబంధాలకు చాలా విలువిస్తారు. క్లీన్ షేవ్ చేసుకున్న పురుషులు తరచూ కొత్త భాగస్వామి కోసం వెతుకుతూ ఉంటారట. ఈ అధ్యయనంలో భాగంగా 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల 414 మంది పురుషులు పాల్గొన్నారు.

గడ్డం వల్ల లాభం

గడ్డం ఉన్న పురుషుల వ్యక్తిత్వం ఎంతో సున్నితంగా ఉంటుంది. వారికి సంబంధాలపై అవగాహన కూడా ఎక్కువగానే ఉంటుంది. గడ్డం ఉన్న పురుషులు క్రమశిక్షణగా ఉంటారు. సంయమనం స్వభావాన్ని సూచిస్తారు.

ఒక వ్యక్తి తన ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి తరచుగా క్లీన్ షేవ్ చేయించుకోవాలని అనుకుంటారు. కానీ గడ్డం పెంచుతూ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే ముఖ వెంట్రుకల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి ఎక్కువ శ్రమ, సమయం అవసరం. అటువంటి పరిస్థితిలో, తన గడ్డాన్ని బాగా నిర్వహించగల వ్యక్తి తెలివైన, క్రమబద్ధమైన వ్యక్తిగా ఎదుగుతాడు.

ముఖంపై గడ్డాలు ధరించే పురుషులు రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత తమ రొమాంటిక్ రిలేషన్ షిప్, ఫ్యామిలీపై ఫోకస్ పెడతారని ఈ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం, మీరు గడ్డం ఉన్న వ్యక్తిని ఎంచుకోవడానికి ప్రయత్నించండి.

గడ్డం ఉన్న పురుషులు తమ బంధాలను నిలబెట్టుకోవడానికి, సంబంధాలకు కట్టుబడి ఉంటారు. గడ్డం పెంచే మగవారు వేగవంతమైన జీవితాన్ని ఇష్టపడరు. అందుకే వారిని జీవిత భాగస్వాములు నమ్మవచ్చు.

గుబురుగా గడ్డం పెంచుకునే పురుషులు కాస్త యవ్వనంగా కనిపిస్తారని అధ్యయనం చెబుతోంది. అయితే గడ్డాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని, గ్రూమింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గడ్డం పెంచడం వల్ల రేడియేషన్ కిరణాలు ముఖంపై పడకుండా జాగ్రత్త పడవచ్చు కూడా.

టాపిక్