Matcha boba tea: టీ మానలేకపోతే ఆరోగ్యం పెంచే మాచా బొబా టీ తాగండి, రోజూ తాగినా నో ప్రాబ్లమ్-benefits of drinking matcha boba tea see its complete health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Matcha Boba Tea: టీ మానలేకపోతే ఆరోగ్యం పెంచే మాచా బొబా టీ తాగండి, రోజూ తాగినా నో ప్రాబ్లమ్

Matcha boba tea: టీ మానలేకపోతే ఆరోగ్యం పెంచే మాచా బొబా టీ తాగండి, రోజూ తాగినా నో ప్రాబ్లమ్

Koutik Pranaya Sree HT Telugu
Aug 21, 2024 08:00 AM IST

Matcha boba tea: మాచా బోబా టీ యొక్క రిఫ్రెషింగ్ రుచితో మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి! ఏకాగ్రత నుండి గుండె నాళాల ఆరోగ్యం వరకు ఇది ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెల్సుకోండి.

మాచా బోబా టీ
మాచా బోబా టీ (Photo by Green Heart Love)

మచా బోబా టీ రుచిలో చాలా బాగుంటుంది. ఈ టీలో సాబుదానా ఉంటుంది. ఈ టీ రుచిని ఆస్వాదిస్తూ.. మధ్య మధ్యలో తగిలో సాబుదానాను నములుతూ ఉంటే కొత్త రుచి తప్పకుండా నచ్చుతుంది. ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన పానీయం అని చెప్పొచ్చు. దీన్ని తాగడం వల్ల లాభాలు తెల్సుకోండి.

పోషకాలు:

ఈ టీ కోసం వాడే మాచా గ్రీన్ టీ ని ప్రత్యేకంగా పెంచి, ప్రాసెస్ చేసిన గ్రీన్ టీ ఆకుల నుండి తయారు చేస్తారు. ఈ మాచా టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాల అధికంగా ఉంటాయి. ఇందులో కాటెచిన్స్, ముఖ్యంగా ఎపిగల్లోకాటెచిన్ గాలేట్ (ఇజిసిజి) ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. 

  1. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి: రెగ్యులర్ గ్రీన్ టీతో పోలిస్తే మాచా గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
  2. పోషకాలు: మాచాలో విటమిన్లు ఎ, సి, ఇ, కె తో పాటే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యానికి,  శ్రేయస్సుకు తోడ్పడతాయి.

మాచా బోబా టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

  1. మెరుగైన ఏకాగ్రత: మాచాలో ఎల్-థియనిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది ప్రశాంతతను, ఏకాగ్రతను పెంచుతుంది. కాఫీతో పోలిస్తే తక్కువ మొత్తంలో  కెఫిన్‌ ఉంటుంది దీంట్లో. ఎటువంటి ప్రభావాలు లేకుండా ఏకాగ్రత, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  2. రోగనిరోధక పనితీరు: మాచాలోని యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఇజిసిజి, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడం ద్వారా రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయని తేలింది.
  3. గుండె ఆరోగ్యం: మాచాతో గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మాచా బోబా టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ మీరు దీన్ని ఎక్కడ తాగుతున్నారో ముఖ్యం. కొన్ని షాపుల్లో దీంట్లో ఎక్కువ చక్కెరలు, ప్రిజర్వ్డ్ పాలను వాడతారు. కొన్నింటిలో పంచదారతో పాటూ ఫ్రూట్ షుగర్ బేస్ తో దీన్ని తయారు చేస్తారు. బదులుగా గ్రీన్ టీ బేస్ ఉన్న మాచా బోబా టీ మాత్రమే మంచి ప్రయోజనాలు ఇస్తుంది.