Short girls styling tips: సాంప్రదాయ దుస్తుల్లో పొడుగ్గా కనిపించాలంటే.. ఈ స్టైలింగ్ టిప్స్ ఫాలో అవ్వండి
Short girls styling tips: ఎత్తు తక్కువగా ఉంటుంది కాబట్టి కుర్తా లేదా చీర ధరించడం మానుకోండి, ఎందుకంటే ఎత్తు చిన్నదిగా కనిపిస్తుంది, అప్పుడు ఈ చిట్కాలను పాటించండి, అలియా భట్ పొడవుగా కనిపిస్తుంది.
తక్కువ ఎత్తు ఉన్న అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు వేసుకోడానికి కాస్త ఆలోచిస్తారు. చీరలు, కుర్తాల్లో ఎత్తు మరీ తక్కువగా కనిపించడమే కారణం. జీన్స్, టీషర్ట్ వేసుకున్నప్పుడు ఎవరైనా కాస్త ఎత్తుగానే కనిపిస్తారు. అయితే సాంప్రదాయ దుస్తుల్లోనూ, చీరకట్టులోనూ పొడవుగా కనిపించాలంటే కొన్ని స్టైలింగ్ టిప్స్ తెలిస్తే చాలు. దానికోసం హై హీల్స్ మాత్రమే పరిష్కారం కాదు. అవేంటో తెల్సుకోండి.
నెక్ డిజైన్:
డ్రెస్ నెక్ డిజైన్ ప్రభావం పూర్తి లుక్ మీద ఉంటుంది. హైనెక్, రౌండ్ నెక్ దుస్తులు ఇంకా పొట్టిగా కినిపించేలా చేస్తాయి. అందుకే వి నెక్ డిజైన్ లేదా డీప్ రౌండ్ నెక్ లాంటివి ఎంచుకోండి. వీటితో మెడ భాగం పొడుగ్గా కనిపిస్తుంది.
స్లీవ్స్ డిజైన్:
పొట్టి చేతులు వేసుకోవడం అస్సలు వద్దు. దాని కంటే త్రీ ఫోర్త్ హ్యాండ్, ఫుల్ హ్యాండ్స్, లేదా స్లీవ్ లెస్ లాంటి డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వండి. వీటితో చేతులు పొడుగ్గా కనిపిస్తాయి. షార్ట్ స్లీవ్స్ వేసుకుంటే అవి మిమ్మల్ని పొట్టిగా కనిపించేలా చేస్తాయి.
రంగులు
పొడవుగా కనిపించడంలో రంగుల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. పైన టాప్ ఓ రంగు, కింద ప్యాంట్ ఓ రంగు, మల్టీ కలర్ మేళవింపులు వేసుకోవడం వద్దు. బదులుగా మోనోక్రొమాటిక్ లుక్స్ ట్రై చేయండి. అంటే పైనుంచి కింది దాకా ఒకే రంగులో ఉండే దుస్తులు. ఇవి శరీరాన్ని ఒకేలా కనిపించేలా చేసి పొడవుగా ఉన్నారనే భావన కల్పిస్తాయి.
ప్రింట్లు
పెద్ద పెద్ద మోటిఫ్లు, ప్రింట్లు ఉన్న దుస్తులకు బదులుగా సాదాసీదాగా ఉండే చిన్న ప్రింట్లు, సింపుల్ ఎంబ్రాయిడరీ రకాలు ఎంచుకోండి. చీర కట్టుకుంటే చిన్న బార్డర్ ఉన్నవే ఎంచుకోండి. భారీ ఎంబ్రాయిడరీ, పెద్ద బార్డర్, బోల్డ్ ప్రింట్ ఉన్న బట్టలు ఎత్తు కనిపించేలా చేస్తాయి.
ప్యాంట్ పొడవు:
పొడవుగా కనిపించాలంటే ప్యాంట్లు పొడవుగా ఉండేలా చూసుకోవాలి. షార్ట్ ప్యాంట్స్, యాంకిల్ లెంగ్త్ ఉండే కుర్తా ప్యాంట్లు, లెగ్గింగ్లు, పలాజోలు మీ ఎత్తు తగ్గిస్తాయి. కాబట్టి సాంప్రదాయ దుస్తుల మీదకి ముఖ్యంగా కుర్తాల మీదకి పొడవుగా ఉండే ప్యాంట్ రకాలు ఎంచుకోండి.