Stop Leggings: అన్ని డ్రెస్సులకు లెగ్గింగ్ మాత్రమే వేస్తే ఎలా? కొత్త ఆప్షన్లు ప్రయత్నిస్తే లుక్ మారిపోతుంది-best alternatives for leggings see the trendy options for pants ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stop Leggings: అన్ని డ్రెస్సులకు లెగ్గింగ్ మాత్రమే వేస్తే ఎలా? కొత్త ఆప్షన్లు ప్రయత్నిస్తే లుక్ మారిపోతుంది

Stop Leggings: అన్ని డ్రెస్సులకు లెగ్గింగ్ మాత్రమే వేస్తే ఎలా? కొత్త ఆప్షన్లు ప్రయత్నిస్తే లుక్ మారిపోతుంది

Koutik Pranaya Sree HT Telugu
Aug 21, 2024 09:30 AM IST

Stop Leggings: ప్రతి డ్రెస్సుకు లెగ్గింగ్ వేసుకుని లుక్ పూర్తి చేసేస్తున్నారా? అయితే కాస్త మీ ఫ్యాషన్ ట్రెండ్ మార్చాల్సిందే. లేదంటే ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా ట్రెండీగా అనిపించరు. లెగ్గింగ్ బదులుగా వేసుకోదగ్గ కొన్ని బాటమ్స్ ఉన్నాయి. అవేంటో చూడండి.

లెగ్గింగ్ ప్రత్యామ్నాయాలు
లెగ్గింగ్ ప్రత్యామ్నాయాలు (freepik)

ఒక కుర్తా కొంటున్నామంటే ముందు మన దగ్గరున్న లెగ్గింగ్‌తో మ్యాచ్ అవుతుందా లేదాని లెక్కేసుకుంటాం. మన దగ్గరున్న లెగ్గింగ్‌తో మ్యాచ్ అయితే అదో సంతృప్తి. కానీ ఇలా ప్రతి సారీ, అన్ని రకాల డ్రెస్సులకు, కుర్తా,కుర్తీలకు లెగ్గింగ్ వేసుకోవడం వల్ల లుక్ దెబ్బ తింటుంది. లెగ్గింగ్ మించి మంచి లుక్ ఇచ్చే అనేక రకాల ప్యాంట్లు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయ్. అవేంటో చూడండి.

మెటాలిక్ ప్యాంట్లు

పేరుతోనే తెలుస్తోంది కదా. గోల్డ్, సిల్వర్ లాంటి మెటాలిక్ రంగుల్లో అనేక రకాల ప్యాంట్ల ఆప్షన్లు ఉంటున్నాయి. ప్రతి రంగు కూడా మెటాలిక్ షేడ్ లో దొరుకుతోంది. కొన్ని రకాల కుర్తాలకు ఈ ప్యాంట్లు జత చేస్తే ట్రెండీగా, మోడర్న్ గా కనిపిస్తారు. లుక్ మారిపోతుంది.

పోంటే ప్యాంట్స్

లెగ్గింగులు, జీన్స్ కలిపితే ఎలా ఉంటుందో అవే పోంటే ప్యాంట్స్. అంటే లెగ్గింగ్ లాంటి సాగే గుణంతో సౌకర్యం ఇస్తాయి. జీన్స్ లాగే మంచి స్కిన్ ఫిట్ ఇస్తాయి. వీటిని షార్ట్ కుర్తాల మీదికి వేసుకుంటే కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి.

పలాజోలు

ఆ మధ్య పలాజోలు చాలా ట్రెండ్ అయ్యాయి. కానీ అందరినీ అంతలా చేరుకోలేదవి. ఇప్పుడు పలాజో ప్యాంట్లలోనే హై వెయిస్ట్ రకాలు, టై నాట్ రకాలు వస్తున్నాయి. ఇవి టీషర్టుల మీదికైనా బాగా నప్పుతాయి. చాలా ట్రెండీగా కనిపిస్తాయి. మీరు కొత్త లుక్ లో కనిపించాలనుకుంటే ఇవి ఒక్కసారైనా ట్రై చేయండి.

లెనిన్ ప్యాంట్లు

మీ లుక్ లెగ్గింగ్ వేసుకున్నట్లే ఉండాలి కానీ, కొత్తగా కనిపించాలంటే ఈ లెనిన్ ప్యాంట్లు ట్రై చేయొచ్చు. వీటిలో ప్లీటెడ్ ప్యాంట్లు, హై వెయిస్ట్ ప్యాంట్లు.. రకరకాలుగా దొరుకుతాయి. వీటిని రోజూవారీ వేసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి.

కాటన్ ప్యాంట్లు

ఇది వరకు కాటన్ ప్యాంట్లు కేవలం పంజాబీ డ్రెస్ మీదే కనిపించేవి. కానీ ఇప్పుడు ఈ కాటన్ ప్యాంట్లకు ఎలాస్టిక్ వచ్చి అచ్చం లెగ్గింగ్ లాగా ఉంటాయి. స్కిన్ టైట్ లుక్ ఉంటుంది. అలా వద్దనుకుంటే పటియాలా ప్యాంట్లూ ప్రయత్నించొచ్చు. కాలర్డ్ నెక్ కుర్తాలకు, కాటన్ కుర్తాలకు పటియాలా మంచి లుక్ ఇస్తుంది.

స్కర్టులు

అఫీషియల్ వేడుకల నుంచి ట్రెండీ ఈవెంట్ల దాకా నప్పేలా రకరకాల స్కర్టులుంటాయి. లెనిన్ తో చేసిన మ్యాక్జీ స్కర్టులు అధికారిక ప్రోగ్రాములకు నప్పితే, డెనిమ్ స్కర్టులు ఎక్కడికైనా క్యాజువల్ గా వేసుకోవచ్చు. అలాగే జార్జెట్ తో చేసిన పలాజో స్కర్టులయితే రోజూవారీ అయినా వాడేయొచ్చు. వీటి మీదకి టీషర్టులు, క్రాప్ టాప్స్.. ఏవైనా నప్పేస్తాయి.

టాపిక్