Hijab ban: హిజాబ్ నిషేధం తర్వాత.. ఆ కాలేజీలో ఇప్పుడు జీన్స్ ధరించడంపై కూడా నిషేధం-after hijab ban chembur college bars entry of students wearing jeans ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hijab Ban: హిజాబ్ నిషేధం తర్వాత.. ఆ కాలేజీలో ఇప్పుడు జీన్స్ ధరించడంపై కూడా నిషేధం

Hijab ban: హిజాబ్ నిషేధం తర్వాత.. ఆ కాలేజీలో ఇప్పుడు జీన్స్ ధరించడంపై కూడా నిషేధం

HT Telugu Desk HT Telugu
Jul 02, 2024 07:46 PM IST

Hijab ban: విద్యార్థినులు బురఖా ధరించడంపై నిషేధం విధించిన చెంబూరులోని ఆచార్య మరాఠే కళాశాలలో ఇప్పుడు జీన్స్ ధరించడంపై కూడా బ్యాన్ విధించారు. సోమవారం నుంచి విద్యార్థినీ, విద్యార్థులు జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదని కాలేజీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT File (Representational Image))

Hijab ban: జీన్స్, టీషర్టులు ధరించిన విద్యార్థులను సోమవారం నుంచి కళాశాల ఆవరణలోకి అనుమతించకూడదని మహారాష్ట్రలోని చెంబూరులో ఉన్న ఆచార్య మరాఠే కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. దీంతో కొత్త వివాదం చెలరేగింది.

హిజాబ్ లపై నిషేధం

బుర్ఖాలు, నిఖాబ్ లు, హిజాబ్ లు, ఇతర మతపరమైన చిహ్నాలైన బ్యాడ్జీలు, టోపీలు తదితదర దుస్తులను నిషేధిస్తూ గతంలో చెంబూరు కళాశాల నిబంధనలు అమలు చేసింద. ఈ నిబంధనలతో కూడిన డ్రెస్ కోడ్ ను హైకోర్టు కూడా సమర్థించింది. దాంతో ఈ కళాశాల ఇటీవల వార్తల్లో నిలిచింది. కాలేజీకి వేసుకురావాల్సిన డ్రెస్ కోడ్ లో అబ్బాయిలు ప్యాంటు, హాఫ్ లేదా ఫుల్ షర్ట్, అమ్మాయిలు శరీరాన్ని పూర్తిగా కప్పే ఏదైనా ఇండియన్/ వెస్ట్రన్ డ్రెస్ ఉండాలని కాలేజీ యాజమాన్యం సూచించింది. ఇటీవల, ఉన్నత తరగతుల విద్యార్థులు "ఫార్మల్", "మంచి" దుస్తులను ధరించాలని నిర్దిష్ట సూచనలతో కళాశాల ఒక ఆదేశాలను జారీ చేసింది.

జీన్స్, టీ షర్ట్స్ కూడా నిషేధం

తాజాగా, సోమవారం నుంచి కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు జీన్స్, టీషర్టులు కూడా ధరించకూడదని కాలేజీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కాగా, కళాశాల యాజమాన్యం సంకుచిత వైఖరితో వ్యవహరిస్తోందని, డ్రెస్ కోడ్ నిబంధనలు తమ రాజ్యాంగబద్ధమైన మత, సాంస్కృతిక హక్కును ఉల్లంఘిస్తున్నాయని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాను సాధారణ దుస్తులైన జీన్స్ ధరించానని, అయితే సెక్యూరిటీ గార్డు తొలిసారిగా కాలేజీ గేటు వద్ద ఆపాడని ఓ విద్యార్థిని తెలిపింది. ‘జీన్స్ వేసుకోవడంలో తప్పేమీ లేదని నేను భావిస్తున్నాను. విద్యార్థుల ప్రస్తుత జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని కళాశాల యాజమాన్యం తన మనస్తత్వాలను మార్చుకోవాలి’ అని ఆ విద్యార్థిని వ్యాఖ్యానించింది. ఇదే తరహాలో కాలేజీలోకి ప్రవేశించకుండా నిషేధానికి గురైన మరో విద్యార్థి మాట్లాడుతూ.. 'ఈ రోజు ఉదయం 40 మందికి పైగా కాలేజీ గేటు బయట వేచి ఉండాల్సి వచ్చింది. ఆ రోజు క్లాసులు మిస్ అవడమే కాదు, ప్రతీ రోజూ ఉదయం కాలేజీకి ఏం వేసుకోవాలో అనే ఒత్తిడికి కూడా గురవుతాం’’ అన్నారు.

కాలేజీ స్పందన

కొన్ని రకాల జీన్స్, టీషర్టులపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ విద్యాగౌరి లేలే తెలిపారు. ‘వాటిని వర్గీకరించడానికి బదులు విద్యార్థులందరికీ జీన్స్, టీషర్టులపై నిషేధం విధించాం. మా విధానాలను వివరించడానికి నేను విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడాను" అని ఆమె హిందుస్తాన్ టైమ్స్ తో చెప్పారు.

Whats_app_banner