Apple iPhone 14 Sales : విడుదల ఈరోజే.. కానీ సేల్స్ ఎప్పటినుంచో తెలుసా?-apple iphone 14 sales starts in india from next week check details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Apple Iphone 14 Sales : విడుదల ఈరోజే.. కానీ సేల్స్ ఎప్పటినుంచో తెలుసా?

Apple iPhone 14 Sales : విడుదల ఈరోజే.. కానీ సేల్స్ ఎప్పటినుంచో తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 07, 2022 01:47 PM IST

Apple iPhone 14 Sales : ప్రతి యాపిల్ అభిమాని.. Apple iPhone 14 విడుదల కోసం కొన్నిరోజుల నుంచి తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఆరోజు రానే వచ్చేసింది. కొత్త ఐఫోన్ 14 సిరీస్‌ కాసేపట్లో విడుదల కానుంది. అయితే దానిని పొందాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే Apple iPhone 14 సేల్స్ కోసం ఇంకోవారం ఆగాల్సిందే అంటున్నారు నిపుణులు.

<p>iPhone 14 సిరీస్</p>
iPhone 14 సిరీస్

Apple iPhone 14 Sales : Apple ఈవెంట్ 2022 భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి Apple అభిమాని టెక్ దిగ్గజం ప్రారంభించబోయే.. తదుపరి తరం గాడ్జెట్‌లను పొందడానికి వేచి చూస్తున్నారు. అయితే నివేదికల ప్రకారం.. ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్‌లు, 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు, కొత్త జత ప్రో TWS ఇయర్‌బడ్‌లను విడుదల చేస్తుంది.

Apple గత నెల చివర్లో iPhone 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ కోసం ఆహ్వానాలను పంపింది. అంతకు ముందు కంపెనీ మునుపటి సంవత్సరాల వలె సెప్టెంబర్ రెండవ మంగళవారం ఈవెంట్‌ను హోస్ట్ చేస్తుందని భావించారు. అయితే ఆపిల్ ఈవెంట్‌ను ధృవీకరించడానికి ముందే.. సెప్టెంబర్ 7 న ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. చివరికి అదే నిజమైంది.

విశ్లేషకుల అంచనాల ప్రకారం iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Maxతో కూడిన Apple iPhone 14 సిరీస్ సెప్టెంబర్ 16 నుంచి అమ్మకానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపిల్ ఐఫోన్ 13 సెప్టెంబర్ 24 న US, భారతదేశంలో విక్రయించారు. అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 16న ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ సిరీస్ అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. భారతదేశం, చైనాలోని కర్మాగారాల నుంచి ఆపిల్ రాబోయే iPhone 14 స్మార్ట్‌ఫోన్‌ను ఏకకాలంలో రవాణా చేయవచ్చని.. Apple విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

మింగ్-చి కువో ట్వీట్ల ప్రకారం.. ఆపిల్ తన సరఫరాపై భౌగోళిక రాజకీయ ప్రభావాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. భారత మార్కెట్‌ను తదుపరి కీలక వృద్ధి డ్రైవర్‌గా చూస్తోంది. "భారతదేశంలో ఫాక్స్‌కాన్ ఐఫోన్ ఉత్పత్తి సైట్ కొత్త 6.1" iPhone 14ను 2H22లో మొదటిసారిగా చైనాతో దాదాపుగా ఏకకాలంలో రవాణా చేస్తుందని నా తాజా సర్వే సూచిస్తుంది." అని కుయో తన ట్విట్టర్ పోస్ట్‌లో రాశారు.

యాపిల్ ఈవెంట్ 2022 భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇది కంపెనీ మొదటి డైరక్ట్ ఈవెంట్. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగానే.. ఆపిల్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆపిల్ అభిమానులు ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం