తెలుగు న్యూస్ / ఫోటో /
Apple Event 2022 | ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఫార్ ఔట్’ తేదీ ఖరారు!
ఎట్టకేలకు సెప్టెంబర్ 7న షెడ్యూల్ చేసిన Apple లాంచ్ ఈవెంట్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. దీనికి యాపిల్ సంస్థ 'ఫార్ అవుట్' అని పేరు పెట్టింది. ఈ ఈవెంట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iPhone 14 సిరీస్‌తో సహా మరెన్నో కొత్త యాపిల్ ప్రొడక్ట్స్ విడుదల చేయవచ్చునని భావిస్తున్నారు. ఏమేం ఆశించవచ్చు?
ఎట్టకేలకు సెప్టెంబర్ 7న షెడ్యూల్ చేసిన Apple లాంచ్ ఈవెంట్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. దీనికి యాపిల్ సంస్థ 'ఫార్ అవుట్' అని పేరు పెట్టింది. ఈ ఈవెంట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iPhone 14 సిరీస్‌తో సహా మరెన్నో కొత్త యాపిల్ ప్రొడక్ట్స్ విడుదల చేయవచ్చునని భావిస్తున్నారు. ఏమేం ఆశించవచ్చు?
(1 / 6)
ఐఫోన్ 14 సిరీస్ విడుదల అతి దగ్గరిలో ఉంది. లాంచ్ ఈవెంట్లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ అనే నాలుగు స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు విడుదల అవనున్నాయని లీక్‌లు సూచిస్తున్నాయి.(FrontPageTech)
(2 / 6)
అయితే అందరి దృష్టి ఇప్పుడు ఐఫోన్ 14 ప్రో వెర్షన్ అలాగే స్పెక్స్-బూస్ట్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ పైనే ఉన్నాయి. ఇవి అద్భుతమైన, అతిపెద్ద అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. కొత్త A16 బయోనిక్ చిప్‌సెట్, 48MP ప్రైమరీ కెమెరా, ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే ఫీచర్, కొత్త నాచ్-లెస్ డిజైన్ వంటి ఫీచర్లు ఎలా ఉండనున్నాయో అని ఎదురుచూస్తున్నారు.(iUpdate / YouTube)
(3 / 6)
ఈవెంట్లో ఒక్క ఐఫోన్ 14 మాత్రమే కాదు, కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ కూడా మూడు కొత్త మోడళ్లతో ఆవిష్కరించనున్నారని అంచనా ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 8; రిఫ్రెష్ చేసిన Apple Watch SE, అలాగే అథ్లెట్ల కోసం ఉద్దేశించిన కఠినమైన "ప్రో" మోడల్ ఉండవచ్చు.(Amritanshu / HT Tech)
(4 / 6)
కొత్త Airpods ప్రో విడుదల కూడా ఉంటుందా? అని కొన్ని లీకులు వస్తున్నాయి. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మేము యాపిల్ Airpodsలో కొత్త అప్డేట్స్ రాలేదు. ఈసారి మాత్రం Apple ఛార్జింగ్ కేసు, Apple లాస్‌లెస్ ఆడియో కోడెక్ (ALAC) అలాగే మరికొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో కొత్త AirPods ప్రో 2ని పరిచయం చేయవచ్చు.(HT Tech)
(5 / 6)
సరికొత్త iOS 16 ప్రివ్యూని ఇప్పటికే పరిచయం చేశారు. ఇప్పుడు, Apple తమ iOS 16 లో స్థిరమైన వెర్షన్‌ను iPhone 14 విడుదలతో పాటుగా ప్రకటించవచ్చు. iOS 16తో పాటు, Apple watchOS 9ని కూడా విడుదల చేయనుంది. అయితే iPad వినియోగదారులు iPadOS 16 కోసం మరికొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది.(Amritanshu / HT Tech)
ఇతర గ్యాలరీలు