iPhone 13 or iPhone 14 : ఐ ఫోన్ 14 కొనే ప్లాన్ ఉందా? ఒక్కసారి ఇది చదవండి!
మొబైల్ ఫోన్స్‌లో iPhone బ్రాండ్‌కు ఉన్న వాల్యూనే వేరు. స్మార్ట్ ఫోన్స్‌లో రారాజు అది. ఐ ఫోన్ ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్. దాదాపు సంవత్సరానికి ఒక మోడల్‌ను యాపిల్ సంస్థ రిలీజ్ చేస్తుంటుంది. త్వరలో ఐఫోన్ 14ను రిలీజ్ చేయనుంది.
iPhone 13 or iPhone 14 : అయితే, ప్రస్తుతం iPhone 13 డిస్కౌంట్‌లో లభిస్తోంది. అందువల్ల ఇప్పుడు డిస్కౌంట్‌లో లభిస్తున్న iPhone 13 కొనుక్కోవడం బెటరా? లేక iPhone 14 విడుదల అయిన తరువాత ఆ లేటెస్ట్ మోడల్ కొనుక్కోవడం బెటరా? అని ఆలోచిస్తున్నారా? అయితే.. మీ కోసమే ఈ ఎనాలిసిస్..
iPhone 13 or iPhone 14 : ఆమెజాన్‌లో..
ఆమెజాన్‌లో ఇప్పుడు iPhone 13 దాదాపు రూ. 9 వేల డిస్కౌంట్‌తో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు కాకుండా iPhone 13ను ఇప్పుడు రూ. 70,900లకు కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్సచేంజ్ ఆఫర్లు కూడా యాడ్ అయితే, ఆ రేటు మరింత తగ్గుతుంది. కానీ, iPhone 14 లేటెస్ట్ వర్షన్ కదా? అందులో ఇంకా ఆధునిక ఫీచర్లు, మరింత నాణ్యమైన చిప్‌సెట్ ఉంటుంది కదా! అన్న ఆలోచన రావచ్చు.
iPhone 13 or iPhone 14 : సేమ్ చిప్‌సెట్
ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు..మరికొన్ని వారాల్లో విడుదల కానున్న iPhone 14లో కొత్తగా పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. iPhone 14లోనూ iPhone 13లో ఉపయోగించిన చిప్‌సెట్‌నే వాడుతున్నారు. iPhone 13లో A15 Bionic chipset ఉంటుంది. iPhone 14లో కూడా ఇదే చిప్‌సెట్‌ను వాడనున్నట్లు సమాచారం. కాకపోతే, రిఫ్రెష్ రేటు కొంత ఎక్కువ అంటే 90Hz ఉండొచ్చు. అలాగే, వెనుకవైపు iPhone 13లో మాదిరిగానే 12-megapixel dual rear camera setup ఉంటుంది. iPhone 13 కన్నా గణనీయమైన అప్‌గ్రేడేషన్లు కూడా ఉండవు. అంటే, దాదాపు iPhone 14తో కూడా iPhone 13 ఎక్స్‌పీరియన్సే ఉంటుంది.
iPhone 13 or iPhone 14 : ధర ఎక్కువ
మరోవైపు, iPhone 14 ధర కచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. సేమ్ ఫీచర్లను ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదని, iPhone 13తో అదే ఎక్స్‌పీరియన్స్ వస్తున్నప్పుడు తక్కువ ధరకు లభించే iPhone 13 కొనుక్కోవడం మేలని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయంలోనూ ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే, దాదాపు ఐదారేళ్ల ముందునాటి వర్షన్ల ఫోన్లకు కూడా లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను యాపిల్ అందిస్తుంది.
iPhone 13 or iPhone 14 : సేమ్ డిజైన్
డిజైన్ విషయంలోనూ iPhone 14లో పెద్ద ఇంప్రూవ్‌మెంట్ లేదని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు.. iPhone 14కు కూడా యాపిల్ పాత డిజైన్‌నే కొనసాగిస్తుంది. flat edge design ఉంటుంది. punch-hole display design ఉండదు. బ్యాటరీ లైఫ్ కొంత మెరుగుపడే అవకాశం ఉంది.
iPhone 13 or iPhone 14 : చివరగా..
అందువల్ల, ధరతో సంబంధం లేదు మాకు లేటెస్ట్ వర్షన్ iPhone కావాలనుకునే వారు iPhone 14 కోసం ఎదురుచూడవచ్చు. లేదంటే, అవే ఫీచర్లు తక్కువ ధరలో కావాలనుకునే వారు iPhone 13 కొనుక్కోవచ్చు. ఆమెజాన్‌లో డిస్కౌంట్ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కనుక.. త్వరగా నిర్ణయం తీసుకోండి..!