Heart-healthy Nuts। మీ గుండె ఆరోగ్యానికి రోజూ కొన్ని ఇలాంటి నట్స్ తినండి!
Heart-healthy Nuts: గింజలను తినడం వలన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక్కడ మీ గుండెకు ఆరోగ్యకరమైన కొన్ని గింజల జాబితాను, వాటిని తినడానికి సరైన మార్గం ఏమిటనేది తెలియజేస్తున్నాము.
Heart-healthy Nuts: తక్కువ పరిమాణంలో తింటూ ఎక్కువ పోషకాలను పొందాలనుకుంటే నట్స్ తినడం ప్రారంభించండి. గింజలు అనేక పోషకాలకు గొప్ప మూలం. బాదాంపప్పు, హాజెల్ నట్స్, పెకాన్, పైన్ నట్స్, పిస్తాపప్పులు, వాల్‌నట్స్ వంటి నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలోనూ సహాయపడతాయి. గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోడానికి మీ డైట్ లో నట్స్ చేర్చుకోండి. వీటిలో ఉండే ప్రయోజనకరమైన ఫైబర్స్, గుండెపోటు ఇంకా స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు 30 గ్రాముల గింజలను తినడం వలన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక్కడ మీ గుండెకు ఆరోగ్యకరమైన కొన్ని గింజల జాబితాను, వాటిని తినడానికి సరైన మార్గం ఏమిటనేది తెలియజేస్తున్నాము.
వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా 3 సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలోని ఆక్సీకరణ నష్టంతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది, వాల్‌నట్స్ తినడం జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా మెదడును పనితీరును మెరుగుపరచడం, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత రుగ్మతల ఆగమనాన్ని నెమ్మదిస్తుంది. వాల్‌నట్‌లను రాత్రిపూట నానబెట్టిన తర్వాత తింటే ఉత్తమ ప్రయోజనాలను అందిస్తాయి.
బాదం
బాదంపప్పులో పెద్ద మొత్తంలో పోషకాలు నిల్వ ఉంటాయి. దీన్ని పచ్చిగా లేదా కాల్చి తినవచ్చు. వీటిలో విటమిన్ ఇ , ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర నియంత్రణలో మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదం తినడం వల్ల ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది. బాదంలను రాత్రంతా నానబెట్టిన తర్వాత ఉదయం తినడం ద్వారా మెరుగైన ప్రయోజనాలుంటాయి.
వేరుశనగ
వేరుశనగల్లో మంచి కొవ్వులు, ప్రోటీన్, పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి విటమిన్లు , ఖనిజాలకు గొప్ప నిధి. అదనంగా యాంటీఆక్సిడెంట్ రెస్వెరాట్రాల్‌ను కలిగి ఉంటుంది. ఇది శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది , మోనోఅన్‌శాచురేటెడ్, బహుళఅసంతృప్త కొవ్వులను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వేరుశనగలను తినడం క్యాన్సర్లు, అల్జీమర్స్ వంటి డీజెనరేటివ్ నరాల వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.
పిస్తాపప్పులు
పిస్తాపప్పులలో రోగనిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇంకా ఇవి యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. పిస్తా తినడం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఫైబర్స్, ఖనిజాలు, అసంతృప్త కొవ్వులతో నిండి ఉన్నందున రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచడంలోనూ సహాయకారిగా ఉంటుంది.
జీడిపప్పు
జీడిపప్పులో మంచి కొవ్వులు, ప్రోటీన్, మాంగనీస్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. జీడిపప్పులో ఉండే స్టెరిక్ యాసిడ్ ఎల్‌డిఎల్ స్థాయిలను తగ్గిస్తుంది. జీడిపప్పును మితంగా తింటే అది గుండె ఆరోగ్యానికి, బ్లడ్ షుగర్ నియంత్రణకు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీడిపప్పును వివిధ రకాలుగా తినవచ్చు. పచ్చిగా లేదా మసాలాలు కలిపి లేదా ప్యూరీలా చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు. అయితే జీడిపప్పును మితంగా తిన్నప్పుడే ప్రయోహనకరం, అతిగా తింటే వ్యతిరేక ప్రభావాలు ఉంటాయని గ్రహించాలి.
సంబంధిత కథనం