Siddharth Aditi wedding: సిద్ధార్థ్, అదితీలు పెళ్లి చేసుకుంది తెలంగాణలోని ఈ ఆలయంలోనే.. ఆలయ విశిష్టత, వివరాలివే
Siddharth Aditi wedding: అదితి రావు హైదరి, సిద్ధార్థ్ 400 ఏళ్ల పురాతన ఆలయంలో ను వివాహం చేసుకున్నారు. ఈ ఆలయం తెలంగాణలోనే ఉంది. ఈ ఆలయ వివరాలు, దీనికి కారణాలు తెల్సుకోండి.
నటి అదితి రావు హైదరి, హీరో సిద్ధార్థ్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. చాలా సింపుల్‌గా, హుందాగా జరిగింది వాళ్ల పెళ్లి. వాళ్ల దుస్తులు, మేకప్ వివరాలు, పెళ్లి వేడుకలతో పాటూ మరో విషయం కూడా చర్చనీయాంశమైంది. వాళ్లు పెళ్లి జరిగిన చోటు గురించి చాలా మంది తెల్సుకోవాలనుకుంటున్నారు. ఆ ఆలయం పేరు రంగనాయక స్వామి ఆలయం. తెలంగాణ రాష్ట్రంలోనే ఉందిది. ఇంతకీ ఆ ఆలయాన్నే వివాహం కోసం ఎందుకు ఎంచుకున్నారో, ఆలయ వివరాలు కూడా తెల్సుకుందాం.
ఆ సంస్థానానిని రాజు:
అదితిరావు హైదరీ తాత (అమ్మ వాళ్ల నాన్న) వనపర్తి సంస్థానానికి చివరి రాజు. వాళ్ల కుటుంబం తరచూ ఇప్పటికీ ఈ ఆలయానికి పూజల కోసం వెళ్తుందని వోగ్ ఇండియాకు ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలో అదితి చెప్పారు. అదితి, సిద్ధార్థ్‌ల పెళ్లి జరిగింది వనపర్తిలోని 400 ఏళ్ల పురాతన ఆలయంలో. ఈ ఆలయం వాళ్ల కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైంది.
శ్రీ రంగనాయక స్వామి ఆలయం ప్రాముఖ్యత:
తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లో శ్రీ రంగనాయకస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయానికి రైలు బస్సు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్ గద్వాల్‌లో ఉంది. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. విజయనగర పాలకుడు కృష్ణదేవరాయలు శ్రీరంగానికి వెళ్లి అక్కడి శ్రీ రంగనాయకస్వామి ఆలయాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత తను కూడా ఆయన రాజ్యంలో రంగనాయకస్వామి ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు.
తర్వాతి రోజు శ్రీ మహా విష్ణువు కలలోకి వచ్చి తన విగ్రహం రాజ్యంలో ఉందని, ఒక డేగ ఆ ప్రదేశానికి తీసుకెళ్తుందని రాజుకు చెప్పాడు. మరుసటి రోజు కృష్ణదేవరాయలు డేగను వెంబడించగా స్వామివారి విగ్రహం కోతకోట, కన్వాయపల్లి పర్వతాల మధ్య కనిపించింది. ఆ విగ్రహాన్ని ప్రతీష్టించి రత్న పుష్కరిని నదీ సమీపంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. విజయనగర శిల్పకలకు ఇది నిదర్శనం.
అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ పెళ్లి వివరాలు:
ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రీం, తెలుపు సాంప్రదాయ దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు. అదితి రావ్ క్రీం రంగు లెహెంగా సెట్ ధరించింది. చాలా మినిమల్ మేకప్, సింపుల్ మెహందీతో క్లాసిక్ పెళ్లి కూతురు లుక్ ఎంచుకుంది. సిద్ధార్థ్ తెలుపు రంగు చొక్కా, పంచ, చేతికి బంగారు స్ట్రాప్స్ ఉన్న వాచీ ధరించి పెళ్లి కొడుగ్గా కనిపించారు.