Siddharth Weds Aditi: మిస్టర్ & మిస్సెస్ సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ.. పెళ్లి బట్టలు, మేకప్ వివరాలివే-aditi rao hydari marries siddharth see their bridal looks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Siddharth Weds Aditi: మిస్టర్ &Amp; మిస్సెస్ సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ.. పెళ్లి బట్టలు, మేకప్ వివరాలివే

Siddharth Weds Aditi: మిస్టర్ & మిస్సెస్ సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ.. పెళ్లి బట్టలు, మేకప్ వివరాలివే

Koutik Pranaya Sree HT Telugu
Sep 16, 2024 03:11 PM IST

Siddharth Weds Aditi: సిద్ధార్థ్ తో అదితి రావు హైదరీ వివాహం జరిగింది. ఈ జంట సింపుల్ సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లి చేసుకున్నారు. మినిమల్ మేకప్, దుస్తులు, పూర్తి లుక్ వివరాలు చూసేయండి.

సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లి ఫొటోలు
సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లి ఫొటోలు

అదితి రావు హైదరి, సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. ఈ జంట వివాహం తమ దగ్గరి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వాళ్ల జీవితాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు కోసం వధూవరులిద్దరు క్రీం, తెలుపు రంగు సంప్రదాయ దుస్తులను ఎంచుకున్నారు. మీ వివాహానికి సింపుల్ అని నిరూపించారు. కానీ ఆమె హాఫ్ మూన్ ఆల్టా, సింపుల్ మేకప్ ఈ షోను కొల్లగొట్టాయి.

అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్

ఈ జంట తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "నా సూర్యుడివి నువ్వే, నా చంద్రుడివి నువ్వే, ఆ నక్షత్రాలన్నీ నువ్వే.." అంటే ఈ ఫొటోలకు క్యాప్షన్ పెట్టారు. మిస్సెస్ అండ్ మిస్టర్ అదు-సిద్ధు అనీ రాసుకొచ్చి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తారు.

పెళ్లి దుస్తులు:

తక్కువ అలంకరణ పట్ల అదితికీ ఉండే ఇష్టం ఆమె పెళ్లి రోజున కూడా కనిపించింది. తను పెళ్లి కోసం సిల్క్ క్రీమ్ కలర్ సాంప్రదాయ లెహంగా సెట్ ను ఎంచుకుంది. భారీ జరీ ఎంబ్రాయిడరీ పనితనంతో హాఫ్ స్లీవ్స్ ఉన్న బ్లవుజు, పెద్ద బార్డర్, గోల్డ్ థ్రెడ్ వర్క్ ఉన్న లెహెంగా చూడముచ్చటగా ఉంది. ఈ లెహెంగా సెట్ మీదికి టిష్యూ సిల్క్ ఎంబ్రాయిడరీ ఉన్న దుపట్టాను చీర పల్లులా వేసుకుంది.

చోకర్ నెక్లెస్, జుంకాలు, చేతికి కడియాలు, ఉంగరం, గాజులతో పాటూ బంగారు, పోల్కీ ఆభరణాలను ధరించారు. మధ్యలో పాపిట తీసి వదులుగా జడ వేసుకుని, సాంప్రదాయంగా కనిపించేలా కొప్పులో మల్లెపూలు పెట్టుకుంది అదితి. అలాగే చాలా సింపుల్ మెహందీ డిజైన్ ఎంచుకున్నారామె. చేతికి అర్థ చంద్రాకారంలో ఉన్న డిజైన్ వేసుకుంది.

మేకప్:

మేకప్ కోసం అదితి చాలా మినమల్ లుక్ ఎంచుకుంది. ఎర్రటి పెదాలు, నప్పే ఐషాడో, ఫెదర్డ్ ఐబ్రోలు, మస్కారా, బుగ్గలపై బ్రష్, మెరిసే హైలైటర్‌ మేకప్ కోసం వాడారు.

సిద్ధార్థ్ విషయానికొస్తే, అతను తన భార్యకు నప్పేలా సింపుల్ తెలుపు కుర్తా ధరించారు. దానికి సాంప్రదాయ పంచకట్లును, కోల్హాపూరీ శ్యాండల్స్, బంగారు రంగు స్ట్రాప్ ఉన్న వాచీ పెట్టుకున్నారు.

టాపిక్