Salt In Tea Benefits : టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే కలిగే ప్రయోజనాలు చాలా
Salted Tea Benefits : ఉదయం లేవగానే టీ తాగడం చాలా మందికి అలవాటు. కానీ ఈ టీలో ఉప్పు వేసుకుని తాగితే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా?
మీకు ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉందా? ఇక నుంచి టీ చేసేటప్పుడు చిటికెడు ఉప్పు వేయండి. ఉప్పు వేయడమేంటని ఆశ్చర్యపోకండి. సాల్టెడ్ టీ తాగడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని చూద్దాం..
కొందరు టీ తాగకపోతే ఏ పని చేయలేరు. ఉదయం లేవగానే మెుదట టీ తాగాలి. ఆ తర్వాతే ఇతర పనులు. లేదంటే రోజును మెుదలుపెట్టలేరు. మరికొందరికి పని మధ్యలో తరచుగా టీ తాగడం అలవాటు. టీని అనేక విధాలుగా తయారు చేయవచ్చు. మసాలా టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలా అనేక రుచుల్లో తయారు చేసుకోవచ్చు. అయితే ఓ చిన్న విషయం తెలుసుకోవాలి.
టీ రకాలు
హెర్బల్ టీ : మూలికలతో చేసిన టీ
స్పైస్ టీ : లవంగాలు, యాలకులు, అల్లం వంటి మసాలాలతో చేసిన టీ
సాధారణ టీ : పాలతో చేసిన టీ, పంచదార కలుపుతారు
బ్లాక్ టీ : పాలు లేకుండా చేసిన టీ
పుదీనా టీ : పుదీనా ఆకులతో చేసిన టీ
ఉప్పు కలిపిన టీతో కలిగే ప్రయోజనాలు
టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ మితంగా తీసుకోవాలి. అప్పుడే ప్రయోజనాలు పొందుతారు. టీలో చక్కెరకు బదులుగా బెల్లం వాడండి. ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. ఈ టీలలో చిటికెడు ఉప్పు వేసుకోండి. ఎక్కువగా వేయవద్దు.
వినడానికి వింతగా అనిపించినా టీలో కాస్త ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఈ రకమైన టీని కాశ్మీర్, చైనాలో తయారుచేస్తారు. ఎందుకంటే ఉప్పుతో టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. టీలో ఉప్పు వేస్తే ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోవచ్చు, కానీ రుచి బాగుంటుంది. పంచదార వేసినట్లుగా ఎక్కువగా వేయవద్దు. చిటికెడు ఉప్పు టీకి రుచిగా ఉంటుంది. ముందుగా మీరు సాధారణ టీ లాగా సిద్ధం చేసుకోండి. తర్వాత తాగేటప్పుడు చిటికెడు ఉప్పు కలపండి.
టీలో ఉప్పు కలపడం వల్ల ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ సంరక్షించబడతాయి. శరీరంలో ఎసిడిటీని బ్యాలెన్స్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గొంతు సమస్యను నివారించడానికి, రోజుకు రెండు గ్లాసుల సాల్టెడ్ టీని తాగాలి. మెటబాలిజం సజావుగా సాగేందుకు సహకరిస్తుంది. మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ సాల్టెడ్ టీ తాగడం చాలా మంచిది. సాల్టెడ్ టీ తాగడం వల్ల ముఖంపై వచ్చే మొటిమల సమస్య తగ్గుతుంది.
ఈ టీతో నరాల సమస్యలు నయం అవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఈ టీ ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గితే ఆరోగ్యానికి చాలా మంచిది. టీలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటుంది.
ఉప్పు కలిపిన టీ రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కడుపు ఆరోగ్యానికి కూడా మంచిది. క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎముకలను సాల్టెడ్ టీ ఆరోగ్యంగా ఉంచుతుంది.