Smoking causes memory loss: స్మోకింగ్‌తో మీ జ్ఞాపకశక్తికి పొగ.. ఏ వయస్సులో అంటే
Smoking causes memory loss: స్మోకింగ్ వల్ల మెమొరీ లాస్ సమస్యలు వస్తాయని, అయితే త్వరగా మానేసిన వారిలో ఈ సమస్య తగ్గుతుందని ఒక అధ్యయనం తేల్చింది.
మధ్యవయస్కులైన స్మోకర్లలో పొగ తాగని వారితో పోల్చితే మెమొరీ లాస్ (జ్ఞాపకశక్తి), కన్ఫ్యూజన్ సమస్యలు వస్తాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అలాగే ఇటీవలే స్మోకింగ్ ఆపేసిన వారిలో గ్రహణ శక్తి తగ్గుదల తక్కువగా ఉందని తేలింది.
ఓహియో స్టేట్ యూనివర్శిటీ తొలిసారిగా స్మోకింగ్, గ్రహణ శక్తి తగ్గుదల అంశాలపై అధ్యయనం చేసింది. మీరు స్మోకింగ్ కారణంగా మెమొరీ లాస్ ఎదుర్కొన్నారా? కన్ఫ్యూజన్‌కు గురవుతున్నారా? తరచుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారా? అనే ప్రశ్నను అడగడం ద్వారా ఈ అధ్యయనం జరిపింది.
స్మోకింగ్, అల్జీమర్స్ డిసీజ్, డిమెన్షియా వంటి వాటి మధ్య గల సంబంధంపై గతంలో జరిగిన అధ్యయనం ఆధారంగా తాజా అధ్యయనం చేసినట్టు అల్జీమర్స్ డిసీజ్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రధాన రచయిత జెన్నా రజైక్ చెప్పారు.
కాగా పొగ తాడం ఆపేస్తే కేవలం శ్వాసకోశ ఆరోగ్యం, కార్డియోవాస్కులర్ ఆరోగ్యం మెరుగపడడమే కాకుండా, నాడీసంబంధిత ఆరోగ్యం కూడా మెరుగైనట్టు వివరించారు.
‘45 నుంచి 49 ఏళ్ల మధ్య గల వయస్సు వారిలో ఈ సంబంధం ఎక్కువగా గమనించాం. స్మోకింగ్ మానేస్తే గ్రహణ శక్తికి మేలు చేసే అవకాశం ఉన్నట్టు అధ్యయనం తేల్చింది..’ అని చెప్పారు. అయితే వృద్ధాప్యంలో ఉన్న వారిలో ఎక్కువగా తేడా కనిపించలేదని కూడా అధ్యయనం తేల్చింది. అంటే పొగ తాగడం కాస్త ముందుగానే మానేస్తే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని తేలింది.
ఈ అధ్యయనం కోసం 2019 జాతీయ బిహేవియరల్ రిస్క్ ఫ్యాక్టర్ సర్వైలెన్స్ సిస్టమ్ నుంచి డేటా తీసుకున్నారు.
తాజా స్మోకర్లు, ఇటీవలే స్మోకింగ్ మానేసిన వారు, కొన్నేళ్ల క్రితం పొగ తాగడం మానేసిన వారి సబ్జెక్టివ్ కాగ్నిటివ్ డిక్లైన్ (ఎస్‌సీడీ)ని పోల్చి చూసింది. మొత్తంగా 45 ఏళ్ల వయస్సు ఉన్న 1,36,018 మంది డేటాను విశ్లేషించింది. ఇందులో ఎస్‌సీడీ 11 శాతం మందిలో ఉంది. పొగ తాగని వారితో పోల్చితే పొగ తాగే వారిలో ఎస్‌సీడీ 1.9 రెట్లు ఉన్నట్టు అధ్యయనం గమనించింది. పొగ తాగడం మానేసి పదేళ్లు కూడా కాని వారిలో ఎస్‌సీడీ 1.5 రెట్లు ఉన్నట్టు గమనించింది. పదేళ్ల కంటే ఎక్కువ కాలం క్రితమే మానేసిన వారిలో మాత్రం నాన్ స్మోకింగ్ గ్రూప్ కంటే స్వల్పంగా ఎస్‌సీడీ ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది.
టాపిక్