Wife and Husband Age Gap : భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే వచ్చే 5 సమస్యలు-5 problems that arise if the age gap between husband and wife more ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wife And Husband Age Gap : భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే వచ్చే 5 సమస్యలు

Wife and Husband Age Gap : భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే వచ్చే 5 సమస్యలు

Anand Sai HT Telugu
Jun 09, 2024 08:00 PM IST

Wife and Husband Age Gap Problems : భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉండటం అనేది కామన్. కానీ అతిగా వయసులో తేడా ఉంటే మాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మానసికంగా, శారీరకంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే వచ్చే సమస్యలు
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే వచ్చే సమస్యలు (Unsplash)

దంపతుల మధ్య వయసులో తేడా సంబంధాలను ప్రభావితం చేస్తుందా అనేది చాలా మందికి ఉండే ప్రశ్న. ఏజ్ గ్యాప్ పెళ్లి చేసుకున్న వారిని అడిగితే కొందరు ప్లస్ అని, చాలా మంది మైనస్ అంటున్నారు. 5 ఏళ్లకు మించి గ్యాప్ వస్తే కొంత అభిప్రాయ భేదాలు వస్తాయని చాలా మంది దంపతులు సాధారణంగా చెప్పే అభిప్రాయం. ఎందుకంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. జంటల మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉంటే సాధారణంగా వచ్చే సమస్యలు కొన్ని ఉన్నాయి.

మెచ్యూరిటీ సమస్య

మన స్నేహితుల గుంపుని పరిశీలించండి. మనకంటే కొంచెం పెద్దవాళ్ళతో మనం ఎక్కువగా తిరగలేం. కంఫర్టబుల్‌‌ ఉండలేం. మన వయసు వాళ్ళతో తిరుగుతున్నట్లుగా పెద్దవాళ్లతో ఉండలేం. చాలా పెద్దవాళ్ళు కాబట్టి మన మధ్య ఒక హద్దు ఉంటుంది. రిలేషన్ షిప్ లో కూడా అంతే. ఒకే ఆలోచనలు, ఒక విషయాన్ని తీసుకునే విధానం చాలా భిన్నంగా ఉంటాయి. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే.. ఒక వ్యక్తికి చాలా ఉత్తేజకరమైనది, మరొకరికి కాదు. ఈ వ్యత్యాసం సంబంధాలలో కూడా సమస్యలను కలిగిస్తుంది.

ప్రాముఖ్యత మారుతుంది

ఈ విషయంలో మనల్నే ఉదాహరణగా తీసుకోండి. వయస్సుతో ప్రాముఖ్యత మారుతుంది. మనకు 17 సంవత్సరాల వయస్సులో ఉండే ఆలోచన, 24 సంవత్సరాల వయస్సులో ఉండదు. అనుభవాలు, పరిపక్వత, మన ఆలోచనలను కూడా మారుస్తుంది. 18 ఏళ్ళ వయసులో మన ఆలోచన తప్పు కాదు, అది సరైనది. ఇప్పుడు వయసు పెరిగాక వచ్చిన ఆలోచన ఇది సరైనది. వయస్సు అంతరం ఉన్న వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదం ఉంటుంది. ఇక్కడ ఇద్దరికీ వారి స్వంత ఇష్టాలు ఉంటాయి.

సామాజిక వ్యత్యాసం

వయసులో తేడా అధికంగా ఉంటే.. సామాజిక వ్యత్యాసం ఉంటుంది. వారి అభిరుచులు భిన్నంగా ఉంటాయి. వారు పెరిగిన వాతావరణం, వారు నేర్చుకున్న సంస్కృతి కూడా ప్రభావం చూపుతాయి. మనం పెరిగిన వాతావరణం మన వ్యక్తిత్వంపై చాలా ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామికి స్వేచ్ఛను ఇవ్వకపోతే.. నన్ను కట్టివేస్తున్నారనే ఆలోచన మెుదలవుతుంది. నా ఇష్టం వచ్చినట్లు ఏమీ చేయలేను అనే ఫీలింగ్ ప్రారంభమవుతుంది. ఇది ఇద్దరి మధ్య గొడవలు సృష్టిస్తుంది.

ఆరోగ్య సమస్య

భాగస్వామి మనకంటే 10-15 సంవత్సరాలు పెద్దగా ఉన్నప్పుడు, వారిలో కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. వయస్సు 30 దాటినప్పుడు డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కనిపించడం సాధారణం. పునరుత్పత్తిలో కూడా సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కుటుంబంలో సమస్యను పెంచుతాయి.

అధికారం చెలాయించడం

వయసు ఎక్కువగా ఉన్నవారు అధికారాన్ని ప్రయోగిస్తారు. ఆమె చిన్నది కావడం, అంతగా తెలియకపోవడం, అన్ని నిర్ణయాలు స్వయంగా తీసుకోవడం, నాకు అన్నీ తెలుసు అనే వైఖరి పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు కుటుంబాన్ని కూడా బలహీనపరుస్తాయి. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి.. కానీ ఇంతకు మించిన ప్రేమతో ఏజ్ గ్యాప్ ఉన్నా బాగా బతికేవారూ ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం.. అది లేనప్పుడు చిన్న విషయాలు పెద్దవిగా మారతాయి.

Whats_app_banner