Parenting Tips : పిల్లలకు ఐదేళ్ల వయసులో నేర్పించాల్సిన 5 విషయాలు.. తప్పక తెలుసుకోవాలి-parenting tips 5 things to teach your children by the age of 5 check in details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Parenting Tips : పిల్లలకు ఐదేళ్ల వయసులో నేర్పించాల్సిన 5 విషయాలు.. తప్పక తెలుసుకోవాలి

Parenting Tips : పిల్లలకు ఐదేళ్ల వయసులో నేర్పించాల్సిన 5 విషయాలు.. తప్పక తెలుసుకోవాలి

Jun 07, 2024, 12:55 PM IST Anand Sai
Jun 07, 2024, 12:55 PM , IST

  • Parenting Tips In Telugu : పేరెంటింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. పిల్లలకు చిన్న వయసులో నేర్పించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఐదేళ్ల వయసులో పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని విధానాలు ఇక్కడ ఉన్నాయి.

పిల్లలతో మానసికంగా సురక్షితమైన సంబంధాలను ఏర్పరుచుకోవడం అనేది ప్రతీ తల్లిదండ్రులు పాటించాల్సిన పద్ధతి. ఎందుకంటే వారితో చిన్న వయసులోనే భావోద్వేగ కనెక్షన్ ఉంటే.. మీరు వారిని సరైన దారిలో నడిపించవచ్చు. వారితో సరిగా లేకుంటే వారి భవిష్యత్ మీద ప్రభావం పడుతుంది. వారితో కనెక్ట్ అవుతూనే ఐదేళ్ల వయసులో కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. అప్పుడే వారు సరైన దారిలో వెళ్తారు.

(1 / 6)

పిల్లలతో మానసికంగా సురక్షితమైన సంబంధాలను ఏర్పరుచుకోవడం అనేది ప్రతీ తల్లిదండ్రులు పాటించాల్సిన పద్ధతి. ఎందుకంటే వారితో చిన్న వయసులోనే భావోద్వేగ కనెక్షన్ ఉంటే.. మీరు వారిని సరైన దారిలో నడిపించవచ్చు. వారితో సరిగా లేకుంటే వారి భవిష్యత్ మీద ప్రభావం పడుతుంది. వారితో కనెక్ట్ అవుతూనే ఐదేళ్ల వయసులో కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. అప్పుడే వారు సరైన దారిలో వెళ్తారు.(Unsplash)

వారి భావోద్వేగాలను గౌరవప్రదమైన మార్గాల్లో వ్యక్తీకరించేలా ప్రోత్సహించాలి. పదజాలం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను విస్తరించడానికి పిల్లలకు సహాయపడాలి.

(2 / 6)

వారి భావోద్వేగాలను గౌరవప్రదమైన మార్గాల్లో వ్యక్తీకరించేలా ప్రోత్సహించాలి. పదజాలం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను విస్తరించడానికి పిల్లలకు సహాయపడాలి.(Pexels)

పిల్లలకు హద్దులను ఎలా నిర్ధారించుకోవాలో నేర్పాలి. ఇతరుల స్థలాన్ని, సరిహద్దులను గౌరవించడం చెప్పాలి. ఉదాహరణకు పెద్దలు బట్టలు మార్చుకునే ప్రదేశానికి రానివ్వకుండా వారికి హద్దలు చెప్పాలి.

(3 / 6)

పిల్లలకు హద్దులను ఎలా నిర్ధారించుకోవాలో నేర్పాలి. ఇతరుల స్థలాన్ని, సరిహద్దులను గౌరవించడం చెప్పాలి. ఉదాహరణకు పెద్దలు బట్టలు మార్చుకునే ప్రదేశానికి రానివ్వకుండా వారికి హద్దలు చెప్పాలి.(Unsplash)

ఏదైనా విషయం చెప్పే ముందు క్లారిటీగా ఉండేలా వారికి నేర్పించాలి. అనవసరంగా కంగారు పడకుండా చూసుకోవాలి. విషయాలు చెప్పే ముందు విరామం తీసుకోవడం లేదా ఆపడం వంటి వివిధ కోపింగ్ నైపుణ్యాల గురించి నేర్చుకోవాలి.

(4 / 6)

ఏదైనా విషయం చెప్పే ముందు క్లారిటీగా ఉండేలా వారికి నేర్పించాలి. అనవసరంగా కంగారు పడకుండా చూసుకోవాలి. విషయాలు చెప్పే ముందు విరామం తీసుకోవడం లేదా ఆపడం వంటి వివిధ కోపింగ్ నైపుణ్యాల గురించి నేర్చుకోవాలి.(Photo by Working Solutions)

తప్పుల ద్వారా నేర్చుకుంటారని వారికి నేర్పాలి. పట్టుదలతో ఉండటం నేర్చుకోవాలి, వారి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించాలి. అనుభవాలే గొప్ప పాఠాలు అని పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి.

(5 / 6)

తప్పుల ద్వారా నేర్చుకుంటారని వారికి నేర్పాలి. పట్టుదలతో ఉండటం నేర్చుకోవాలి, వారి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించాలి. అనుభవాలే గొప్ప పాఠాలు అని పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి.(Unsplash)

అర్థవంతమైన మార్గాల్లో తమ కుటుంబానికి, సమాజానికి ఎలా దోహదపడాలో పిల్లలకు నేర్పించాలి. రోడ్డు మీద చెత్త వేయడం, రోడ్డు క్రాస్ చేయడం, సమాజాన్ని ఎలా చూడాలో నేర్పించాలి. అప్పుడే పిల్లవాడు బుద్ధిపూర్వకంగా, గౌరవప్రదంగా ఉండటం నేర్చుకుంటాడు.

(6 / 6)

అర్థవంతమైన మార్గాల్లో తమ కుటుంబానికి, సమాజానికి ఎలా దోహదపడాలో పిల్లలకు నేర్పించాలి. రోడ్డు మీద చెత్త వేయడం, రోడ్డు క్రాస్ చేయడం, సమాజాన్ని ఎలా చూడాలో నేర్పించాలి. అప్పుడే పిల్లవాడు బుద్ధిపూర్వకంగా, గౌరవప్రదంగా ఉండటం నేర్చుకుంటాడు.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు