Maruthi on Raja Saab: రాజాసాబ్‍తో సత్తా చూపిస్తానన్న డైరెక్టర్ మారుతీ.. ‘బేబీ’ హిందీ రీమేక్‍ అప్‍డేట్‍ చెప్పిన ఎస్‍కేఎన్-you will see what i am says director maruthi on raja saab and skn reveals baby movie hindi remake update tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maruthi On Raja Saab: రాజాసాబ్‍తో సత్తా చూపిస్తానన్న డైరెక్టర్ మారుతీ.. ‘బేబీ’ హిందీ రీమేక్‍ అప్‍డేట్‍ చెప్పిన ఎస్‍కేఎన్

Maruthi on Raja Saab: రాజాసాబ్‍తో సత్తా చూపిస్తానన్న డైరెక్టర్ మారుతీ.. ‘బేబీ’ హిందీ రీమేక్‍ అప్‍డేట్‍ చెప్పిన ఎస్‍కేఎన్

Maruthi on Raja Saab: రాజాసాబ్ సినిమాతో తానేంటో చూపిస్తానని డైరెక్టర్ మారుతీ చెప్పారు. అలాగే, బేబీ సినిమా (Baby Movie Hindi Remake) హిందీ రీమేక్ గురించి ఎస్‍కేఎన్ అప్‍డేట్ ఇచ్చారు. ట్రూ లవర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో వారు మాట్లాడారు

Maruthi on Raja Saab: రాజాసాబ్‍తో నా సత్తా చూపిస్తానన్న డైరెక్టర్ మారుతీ

Maruthi on Raja Saab: డైరెక్టర్ మారుతీ ‘ట్రూ లవర్’ అనే చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్‌పై ఈ మూవీలో భాగమయ్యారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు మారుతీ. అయితే, ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించనున్న ‘రాజాసాబ్’ గురించి మారుతీకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా గురించి అప్‍డేట్లు ఇవ్వాలంటూ అడుగుతున్నారు ఫ్యాన్స్. ట్రూ లవర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 4) జరగగా.. రాజాసాబ్ గురించి చెప్పాలంటూ ప్రేక్షకులు కోరారు. దీంతో మారుతీ స్పందించారు.

రాజాసాబ్ మూవీ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనని, చేతల్లో చూపించాల్సిందేనని మారుతీ అన్నారు. ఆ చిత్రంతో తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. అలాగే, నెలకు ఓ అప్‍డేట్ ఇస్తామని గతంలో చెప్పిన మాటపై కూడా ఆయన స్పందించారు. అప్‍డేట్ అని ఏది పడితే అది ఇచ్చేయలేం కదా అని అన్నారు.

“దాని గురించి నేను మాటల్లో చెప్పలేను. నా చేతల్లో చూపించాల్సిందే. కచ్చితంగా నేనేంటో చూస్తారు” అని మారుతీ చెప్పారు. అయితే, నెలకు ఓ అప్‍డేట్ ఇస్తానని మారుతీ చెప్పారని, ఈ విషయంపై తనను అడగాలని రెబల్ స్టార్ ఫ్యాన్స్ తనకు చెప్పారని ఎస్‍కేఎన్ కల్పించుకున్నారు. దీంతో మళ్లీ మైక్ అందుకున్నారు మారుతీ.

“నెలకు ఒక అప్‍డేట్ అని చెప్పి.. ఏది పడితే అది ఇచ్చేయలేం కాదా. ఇది కూడా ఒక అప్‍డేటేనా అని అంటారు. ఇది కూడా ప్రాబ్లమే. ఒక మంచి అప్‍డేట్ అయితే ఇస్తాం. కొంచెం వేచిచూడండి. చర్చించుకొని నేనూ ఇస్తా. అభిమానులు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఎనర్జీ ఇలాగే ఇస్తే.. మీరు అనుకున్న దాని కంటే 10 శాతం ఎక్కువ పెట్టి మీ ముందుకు తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నా” అని మారుతీ చెప్పారు.

ప్రభాస్ హీరోగా నటించిన గ్లోబల్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఆ తర్వాతే రాజాసాబ్ మూవీ అప్‍డేట్స్ ఇస్తామనేలా ఇటీవల చెప్పారు మారుతీ. అలాగే, ప్రభాస్‍పై తన ప్రేమ ఎంతుందో ఈ మూవీతో చూపిస్తానని కూడా అన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న రాజాసాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. పంచె కట్టులో ప్రభాస్ అదిరిపోయారు.

బేబీ హిందీ రీమేక్‍పై ఎస్‍కేఎన్

చిన్న చిత్రంగా వచ్చిన 'బేబీ' గతేడాది బ్లాక్‍బాస్టర్ అయింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఆ హార్డ్ హిట్టింగ్ ట్రయాంగిల్ లవ్ మూవీని ఎస్‍కేఎన్ నిర్మించారు. అయితే, బేబీ సినిమా హిందీ రీమేక్ గురించి ట్రూ లవర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఎస్‍కేఎన్ వెల్లడించారు. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) రోజున బేబీ మూవీ బాలీవుడ్ రీమేక్ అప్‍డేట్ వస్తుందని తెలిపారు. తమిళంలోనూ బేబీని రీమేక్ చేస్తామని తెలిపారు.

ఎమోషనల్ లవ్ డ్రామాగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ట్రూ లవర్ సినిమాలో మణికందన్, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ ఎమోషనల్‍, ఇంటెన్స్‌గా ఉంది. ట్రూ లవర్ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.