Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్‍కు కౌంట్ డౌన్ మొదలు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్-kalki 2898 ad arrival in 100 days trending on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad: కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్‍కు కౌంట్ డౌన్ మొదలు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్‍కు కౌంట్ డౌన్ మొదలు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 30, 2024 07:52 PM IST

Prabhas Kalki 2898 AD Release: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్‍కు కౌంట్ డౌన్ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ మూవీ నేడు ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ హీరోగా గ్లోబల్ రేంజ్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్‍గా ఈ చిత్రం రానుంది.

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్‍కు కౌంట్ డౌన్ మొదలు
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్‍కు కౌంట్ డౌన్ మొదలు

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంపై అంచనాలు చాలా హైరేంజ్‍లో ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. హాలీవుడ్‍లోనూ ఈ మూవీపై బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీగా కల్కి 2898 ఏడీ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది.

కల్కి 2898 ఏడీ సినిమా మే 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అంటే నేటి(జనవరి 30) నుంచి సరిగ్గా 100 రోజుల్లో కల్కి మూవీ విడుదల కానుంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం వంద రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో నేడు సోషల్ మీడియాలో ఈ మూవీ ట్రెండ్ అవుతోంది.

కల్కి అరైవల్ ఇన్ 100డేస్ (#KalkiArrivalin100days) హ్యాష్ ట్యాగ్ నేడు ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‍ఫామ్‍లో నేషనల్ వైడ్‍లో ట్రెండింగ్‍లోకి వచ్చింది. కల్కి 100 రోజుల్లో వస్తోందంటూ నెటిజన్లు కౌంట్‍డౌన్ మొదలుపెట్టారు. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రపంచమంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోందని ట్వీట్స్ చేస్తున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమా గ్లోబల్ రేంజ్‍లో వస్తోంది. మే 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. ఈ మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది.

కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ హీరోగా ఉండగా.. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, నేచులర్ స్టార్ నాని కూడా ఈ చిత్రంలో క్యామియో రోల్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారనే రూమర్లు కూడా వచ్చాయి.

కల్కి 2898 ఏడీ సినిమా కోసం కొత్త ప్రపంచాన్నే సృష్టించారు దర్శకుడు నాగ్ అశ్విన్. అత్యాధునిక సాంకేతికతతో భారీ వీఎఫ్‍ఎక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారత సినీ ఇండస్ట్రీలో ఓ మైలురాయిగా ఈ మూవీ నిలిచిపోతుందనే అంచనాలు ఉన్నాయి. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రభాస్ లైనప్ ఇదే..

ప్రభాస్ తదుపరి రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. మారుతీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం కూడా ప్రభాస్ చేయనున్నారు. ఈ మూవీలో పోలీస్‍గా ప్రభాస్ కనిపిస్తారు. అలాగే, ‘సలార్ 2: శౌర్యంగపర్వం’ చిత్రాన్ని కూడా రెబల్ స్టార్ చేయనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ గతేడాది డిసెంబర్‌లో వచ్చి బ్లాక్‍బాస్టర్ అయింది. దానికి సీక్వెల్‍గా శౌర్యాంగపర్వం రూపొందనుంది.

IPL_Entry_Point