Baby Box Office Collections: బాక్సాఫీస్ దగ్గర బేబీ సంచలనం.. తొలి రోజు కంటే పదో రోజు కలెక్షన్లే ఎక్కువ-baby box office collections on day 10 beat day 1 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baby Box Office Collections: బాక్సాఫీస్ దగ్గర బేబీ సంచలనం.. తొలి రోజు కంటే పదో రోజు కలెక్షన్లే ఎక్కువ

Baby Box Office Collections: బాక్సాఫీస్ దగ్గర బేబీ సంచలనం.. తొలి రోజు కంటే పదో రోజు కలెక్షన్లే ఎక్కువ

Hari Prasad S HT Telugu

Baby Box Office Collections: బాక్సాఫీస్ దగ్గర బేబీ సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ తొలి రోజు కంటే పదో రోజు కలెక్షన్లే ఎక్కువ కావడం విశేషం. ఇప్పటి వరకూ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

బేబీ మూవీ

Baby Box Office Collections: బేబీ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. పది రోజుల్లోనే సినిమా ఏకంగా రూ.66.6 కోట్లు వసూలు చేయడం విశేషం. అందులోనూ సినిమా తొలి రోజు కలెక్షన్ల కంటే పదో రోజు కలెక్షన్లు ఎక్కువ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా పదో రోజు రూ.3.4 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు ఈ మూవీ కలెక్షన్లు రూ.2.6 కోట్లు మాత్రమే. అయితే తొలి రోజు నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో క్రమంగా కలెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి. పదో రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో బేబీ 9వ స్థానంలో నిలిచింది.

మహేష్ సరిలేరు నీకెవ్వరు (రూ.3.18 కోట్లు), శ్రీమంతుడు (రూ.2.81 కోట్లు), అల్లు అర్జున్ సరైనోడు (రూ.2.74 కోట్లు) లాంటి సినిమాలను బేబీ వెనక్కి నెట్టింది. పుష్ప ది రైజ్ మూవీ పదో రోజు కలెక్షన్లు అయిన రూ.3.41 కోట్లకు చాలా దగ్గరగా రావడం విశేషం. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి విజయ్ అందించిన మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అయింది.

బేబీ టైటిల్‌కు త‌గిన‌ట్లుగానే న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు సాయిరాజేష్ ఈ మూవీని తెర‌కెక్కించారు. ప్రేమ విష‌యంలో నేటి యువ‌త ఆలోచ‌న‌విధానం ఎలా ఉంటుంది? ప్రేమ‌ను స్వీక‌రించే, అర్థం చేసుకునే విధానంలో యువ‌త అభిప్రాయాలు ఎలా మారిపోతుంటాయ‌న్న‌ది రియ‌లిస్టిక్‌గా ఈ సినిమాలో(Baby Movie Review) చూపించారు. త‌మ వ‌య‌సు, ప‌రిణ‌తితో పాటు ఆధునిక జీవిన విధానం వ‌ల్ల త‌మ ఆలోచ‌న తీరులో వ‌చ్చే మార్పుల వ‌ల్ల యువ‌త ఎదుర్కొనే సంఘర్ష‌ణ‌ను హృద్యంగా సినిమాలో ఆవిష్క‌రించారు.

మూడు పాత్ర‌ల నేప‌థ్యంలో ఈ ట్రయాంగిల్ ల‌వ్‌స్టోరీని యూత్ ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యేలా అందంగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు డైరెక్ట‌ర్‌. ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌లు టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్స్‌పై చాలా వ‌చ్చాయి. వాటికి భిన్నంగా నేటి ప్రేమాయ‌ణాలు ఎలా ఉంటున్నాయ‌న్న‌ది క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా ఈ సినిమాలో చూపించేందుకు ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించారు. విఫ‌ల ప్రేమికుడిగా ఆనంద్ దేవ‌ర‌కొండ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ క‌థ(Baby Movie Review) మొద‌ల‌వుతుంది. స్కూల్‌డేస్‌లోని ల‌వ్ స్టోరీని చాలా నోస్ట‌ల్జిక్‌గా చూపించారు డైరెక్ట‌ర్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌తో ఈ ల‌వ్ సీన్స్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

సంబంధిత కథనం