Weekend OTT Telugu Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే-weekend ott telugu releases double ismart ninda simbaa adios amigo on netflix aha video etv win prime video sonyliv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weekend Ott Telugu Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Weekend OTT Telugu Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Sep 06, 2024 08:14 PM IST

Weekend OTT Telugu Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా.. మరికొన్ని వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ వెర్షన్లు కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు.

ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Weekend OTT Telugu Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి తెలుగులో కొత్తగా మొత్తం 11 సినిమాలు, 3 వెబ్ సిరీస్ రానున్నాయి. వినాయక చవితి హాలీడే కూడా ఉండటంతో మంచి టైంపాస్ చేయడానికి చాలానే కంటెంట్ ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఆ సినిమాలు, సిరీస్ ఏవి? ఏయే ఓటీటీల్లో అవి ఉన్నాయో ఒకసారి చూద్దాం.

వీకెండ్ ఓటీటీ తెలుగు రిలీజెస్

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్, సోనీలివ్ లాంటి ఓటీటీల్లోకి వచ్చిన, రాబోతున్న తెలుగు, డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ ఇక్కడ చూడండి.

డబుల్ ఇస్మార్ట్ - ప్రైమ్ వీడియో

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. గత నెల 15న ఇండిపెండెన్స్ డేనాడు రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల్లోపే ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.

సింబా - ప్రైమ్ వీడియో, ఆహా వీడియో

జగపతి బాబు, అనసూయ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సింబా ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చింది. ప్రైమ్ వీడియో, ఆహా వీడియోల్లో ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 4) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

సత్య - ఆహా వీడియో

శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి నాడు ఆహా వీడియోలోకి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సత్య మూవీ రాబోతోంది. ఈ సినిమా కూడా వీకెండ్ లో మంచి టైంపాస్ సినిమాగా చెప్పొచ్చు.

భార్గవి నిలయం - ఆహా వీడియో

మలయాళం స్టార్ టొవినో థామస్ నటించిన మూవీ భార్గవి నిలయం. ఈ హారర్ మూవీ ప్రస్తుతం ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను మలయాళంతోపాటు తెలుగులోనూ చూడొచ్చు.

అడియోస్ అమిగో - నెట్‌ఫ్లిక్స్

మలయాళం నుంచే వచ్చిన మరో కామెడీ మూవీ అడియోస్ అమిగో. ఆసిఫ్ అలీ నటించిన ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా చూడొచ్చు.

నింద - ఈటీవీ విన్

వరుణ్ సందేశ్ నటించిన మూవీ నింద. ఈ సినిమా కూడా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ చూసేయండి.

వెల్‌కమ్ 2 లైఫ్ - ఈటీవీ విన్

వెల్‌కమ్ 2 లైఫ్ అనేది ఓ కొరియన్ వెబ్ సిరీస్. తొలిసారి ఈ సిరీస్ తెలుగు వెర్షన్ ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్ లో ఈ ఓటీటీలోకి వచ్చిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ లో ఇదీ ఒకటి.

కాల్ మి బే - ప్రైమ్ వీడియో

లైగర్ బ్యూటీ అనన్య పాండే నటించిన హిందీ వెబ్ సిరీస్ కాల్ మి బే. ఈ సిరీస్ తెలగులోనూ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. తొలి రోజే మంచి రివ్యూలు రావడంతో వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సిరీస్ కూడా యాడ్ చేసుకోండి.

విస్ఫోట్ - జియో సినిమా

జియో సినిమాలోకి వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ విస్ఫోట్. ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ నటించిన ఈ సినిమా హిందీతోపాటు తెలుగులోనూ ఈ ఓటీటీలోకి వచ్చింది.

ఇవే కాకుండా.. తనావ్ 2 వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో, హాలీవుడ్ మూవీ ది ఫాల్ గయ్ జియో సినిమాలో, ఇంగ్లిష్ సినిమా ది పర్ఫెక్ట్ కపుల్ నెట్‌ఫ్లిక్స్ లో.. బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై మూవీ నెట్‌ఫ్లిక్స్ లో, యాక్షన్ డ్రామా మూవీ ఏజెంట్ రెకాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ తెలుగులోనూ చూసే అవకాశం ఉంది.