Mystery Thriller OTT: ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ మలయాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్‌-fahadh faasil mystery thriller movie irul streaming on aha ott from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mystery Thriller Ott: ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ మలయాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్‌

Mystery Thriller OTT: ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ మలయాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 04, 2024 08:34 AM IST

Mystery Thriller OTT: ఫ‌హాద్ ఫాజిల్‌, మంజుమ్మ‌ల్ బాయ్స్ ఫేమ్ సౌబీన్ షాహిర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఇరుల్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ త‌మిళ్ వెర్ష‌న్ ఆహా ఓటీటీలో సెప్టెంబ‌ర్ 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ
మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ

Mystery Thriller OTT: ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఇరుల్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ఆడియెన్స్‌ను మెప్పించింది. మ‌ల‌యాళంలో రిలీజైన మూడు ఏళ్ల త‌ర్వాత ఈ మూవీ త‌మిళంలోకి రాబోతోంది. సెప్టెంబ‌ర్ 6 నుంచి ఆహా ఓటీటీలో ఇరుల్‌ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా త‌మిళ్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. తెలుగులోనూ ఇదే నెల‌లో ఇరుల్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్న‌ట్లు స‌మాచారం.

మంజుమ్మ‌ల్ బాయ్స్ ఫేమ్‌...

ఇరుళ్ మూవీలో ఫ‌హాద్ ఫాజిల్‌కు జోడీగా ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్ న‌టించింది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో మంజుమ్మ‌ల్ బాయ్స్ ఫేమ్ సౌబీన్ షాహిర్ విల‌న్‌గా న‌టించాడు. ఈ సినిమాకు న‌సీఫ్‌యూసుఫ్ ఇజుద్దీన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కొవిడ్ కార‌ణంగా మ‌ల‌యాళంలో 2021లో ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది.

కేవ‌లం మూడు పాత్ర‌ల‌తో...

కేవ‌లం మూడు పాత్ర‌ల‌తోనే ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు ఇరుల్ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా క‌థ మొత్తం ఫ‌హాద్ ఫాజిల్‌, ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్‌తో పాటు సౌబీన్ షాహిర్ పాత్ర‌ల నేప‌థ్యంలో ఒకే ఇంట్లో సాగుతుంది.

సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎవ‌రు?

అలెక్స్ (సౌబీన్ షాహిర్‌) ఓ రైట‌ర్‌. త‌న ప్రియురాలు అర్చ‌న‌తో (ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్‌) క‌లిసి కారులో ట్రిప్‌కు బ‌య‌లుదేరుతాడు. ఓ అట‌వీ ప్రాంతంలో వారి కారు ఆగిపోతుంది. షెల్ట‌ర్ కోసం ద‌గ్గ‌ర‌లోని ఓ ఇంట్లోకి వెళ‌తారు. ఆ ఇంటి ఓన‌ర్ ఉన్ని (ఫ‌హాద్ ఫాజిల్‌) వారికి ఆశ్ర‌యం ఇస్తాడు.

నిజంగా ఉన్న ఆ ఇంటి ఓన‌రేనా? ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అలెక్స్‌, అర్చ‌న ఎలాంటి పోరాటం చేశారు? ఆ ఇంటి నుంచి ప్రేమజంట‌ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారా? అస‌లు సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎవ‌రు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఇందులో పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో ఫ‌హాద్ ఫాజిల్ అస‌మాన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. క్లైమాక్స్ ఫ‌హాద్ ఫాజిల్‌ అస‌లైన విల‌న్ అని రివీల‌య్యే సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.

పుష్ప 2లో విల‌న్‌...

ప్ర‌స్తుతం మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం భాష‌ల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఫ‌హాద్ ఫాజిల్‌. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పుష్ప 2లో మెయిన్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. భ‌న్వార్ సింగ్ షెకావ‌త్ అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ ఏడాది డిసెంబ‌ర్ 6న పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ర‌జ‌నీకాంత్ వెట్టైయాన్‌లో ఫ‌హాద్ పాజిల్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

టాపిక్