Raviteja Eagle: థియేటర్ అన్నారు...ఓటీటీలో రిలీజ్ చేశారు. - తమిళంలో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన రవితేజ ఈగల్
Raviteja Eagle: రవితేజ ఈగల్ తమిళ వెర్షన్ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈగల్ తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.
Raviteja Eagle: రవితేజ ఈగల్ మూవీ తెలుగులో రిలీజైన రెండు నెలల తర్వాత తమిళంలో విడుదలైంది. అది కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. గురువారం నుంచి ఈగల్ తమిళ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈగల్ తమిళ వెర్షన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో తమిళ వెర్షన్‌ను రిలీజ్ చేశారు. ఈగల్ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియతో పాటు ఈటీవీ విన్‌లో రిలీజైంది.
తెలుగుతో పాటు హిందీలో మాత్రమే...
ఈగల్‌ను థియేటర్లలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ థియేటర్ల సమస్య కారణంగా కేవలం తెలుగుతో పాటు హిందీలో మాత్రమే థియేటర్లలో రిలీజైంది. తాజాగా తమిళ వెర్షన్ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్...
ఈగల్ మూవీకి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో మిక్సడ్ టాక్‌ను తెచ్చుకున్నది. రవితేజ ఫర్మార్మెన్స్...యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా కథలో కొత్తదనం మిస్సవ్వడంతో సినిమా పరాజయం పాలైంది. దాదాపు 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈగల్ మూవీ రిలీజైంది. థియేటర్లలో పదిహేను కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈగల్ సినిమాలు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా...నవదీప్ కీలక పాత్ర పోషించాడు.
ఈగల్ కథ ఇదే...
సహదేవ వర్మ (రవితేజ) తలకోన అడవుల్లో ఉంటూ చేనేత రైతులకు సాయంగా మిల్ రన్ చేస్తుంటాడు. అక్కడ పండించే అరుదైన పత్తి, తయారైన వస్త్రాలకు దేశవిదేశాల్లో గుర్తింపు తీసుకొస్తాడు సహదేవ వర్మ. అతడి గురించి పేపర్‌లో ఆర్టికల్ రాసినందుకు నళినీరావు (అనుపమ పరమేశ్వరన్) అనే జర్నలిస్ట్ ఉద్యోగం పోతుంది. ఆమెను వెతుక్కుంటూ సీబీఐ, ఆర్మీ ఆఫీసర్స్ వస్తారు. సహదేవ వర్మ జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని తలకోన అడవుల్లోకి వస్తుంది నళినీరావు.
విదేశాల్లో కాంట్రాక్ట్ కిల్లర్‌గా సహదేవ వర్మ తలకోన అడవుల్లో ఏం చేస్తున్నాడు? అసలు అతడు తలకోన ఎందుకొచ్చాడు? సహదేవ వర్మ భార్య రచన (కావ్య థాపర్) అతడికి ఎలా దూరమైంది?ఆమె మరణానికి కారకులు ఎవరు?సహదేవవర్మ గురించి సీబీఐ, సెంట్రల్ ఫోర్స్‌తో పాటు నక్సలైట్లు, టెర్రరిస్టులు ఎందుకు వెతుకుతున్నారు? అనే అంశాలతో దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ కథ.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈగల్ మూవీని ప్రొడ్యూస్ చేసింది. రాసుకున్నాడు.
రైడ్ రీమేక్
ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తోంది. బాలీవుడ్‌లో విజయవంతమైన రైడ్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో షాక్, మిరపకాయ్ సినిమాలొచ్చాయి. లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరు కలిసి చేస్తోన్న మూవీ. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. మిస్టర్ బచ్చన్‌తో పాటు రవితేజ మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.