Ravi Teja Mr Bachchan: బిగ్‌బీ ఫ్యాన్‌గా మాస్ మహారాజా - మిస్టర్ బచ్చన్‌గా రానున్న రవితేజ
Ravi Teja Mr Bachchan: రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న మూవీకి మిస్టర్ బచ్చన్ అనేటైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
Ravi Teja Mr Bachchan: బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌కు తాను వీరాభిమానినని గతంలో పలు సినిమా వేడుకల్లో రవితేజ చెప్పాడు. డాన్ శీనుతో పాటు మరికొన్ని సినిమాల్లో అమితాబ్ బచ్చన్‌ను ఇమిటేట్ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు రవితేజ. మరోసారి అమితాబ్ బచ్చన్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు మాస్ మహారాజా.
రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా సినిమాకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పాతకాలం నాటి స్కూటర్‌పై కూర్చొని స్టైలిష్ లుక్‌లో రవితేజ కనిపిస్తున్నాడు. అతడి వెనుక అమితాబ్ బచ్చన్ పోస్టర్ కనిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ టైటిల్ కింద ఉన్న నామ్ తో సునా హోగా అనే క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.
అమితాబ్ బచ్చన్ పాపులర్ బాలీవుడ్ మూవీ డైలాగ్‌ను క్యాప్షన్‌గా ఉపయోగించారు. తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ పేరుతో సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు రవితేజ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. షాక్, మిరపకాయ్ తర్వాత రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో దాదాపు పన్నెండేళ్ల విరామం తర్వాత మిస్టర్ బచ్చన్ మూవీ రూపొందుతోంది. మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తోన్నాడు.
హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా 2018లో విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ రైడ్ ఆధారంగా మిస్టర్ బచ్చన్ మూవీ తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. మిస్టర్ బచ్చన్‌లో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.