Im Not a Robot Web Series: తెలుగులోకి వ‌స్తోన్న సూప‌ర్‌హిట్ కొరియ‌న్ వెబ్‌సిరీస్ - రొమాన్స్ మామూలుగా ఉండ‌దు!-korean web series i am not a robot telugu version streaming on etv win ott from april 25th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Im Not A Robot Web Series: తెలుగులోకి వ‌స్తోన్న సూప‌ర్‌హిట్ కొరియ‌న్ వెబ్‌సిరీస్ - రొమాన్స్ మామూలుగా ఉండ‌దు!

Im Not a Robot Web Series: తెలుగులోకి వ‌స్తోన్న సూప‌ర్‌హిట్ కొరియ‌న్ వెబ్‌సిరీస్ - రొమాన్స్ మామూలుగా ఉండ‌దు!

Nelki Naresh Kumar HT Telugu
Apr 18, 2024 08:20 AM IST

Im Not a Robot Web Series: కొరియ‌న్ వెబ్ సిరీస్ ఐ యామ్ నాట్ ఏ రోబో తెలుగులోకి వ‌స్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

ఐయామ్ నాట్ ఏ రోబో వెబ్‌సిరీస్
ఐయామ్ నాట్ ఏ రోబో వెబ్‌సిరీస్

Im Not a Robot Web Series: కొరియ‌న్‌లో ఓటీటీ ఆడియెన్స్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న ఐయామ్ నాట్ ఏ రోబో వెబ్‌సిరీస్ తెలుగులోకి వ‌చ్చేస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 25 నుంచి ఐ యామ్ నాట్ ఏ రోబో తెలుగు వెర్ష‌న్‌ స్ట్రీమింగ్ కానుంది.

yearly horoscope entry point

ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను ఈటీవీ విన్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. కొత్త పోస్ట‌ర్‌ను ఓటీటీ ఫ్యాన్స్‌తో పంచుకున్న‌ది. ఈ సిరీస్ రిలీజ్ డేట్‌ను ఛాట్ చేస్తున్న‌ట్లుగా స్క్రీన్‌షాట్స్ తీస్తూ డిఫ‌రెంట్‌గా వెల్ల‌డించారు. ఈ పోస్ట్‌లో ఆర్‌సీబీ టీమ్‌పై సెటైర్స్ వేస్తూ ఐ యామ్ నాట్ ఏ రోబో రిలీజ్ డేట్ చెప్పారు.

కొరియాలో హిట్టు...

2017లో రిలీజైన ఈ కొరియ‌న్ వెబ్‌సిరీస్ ఐఎమ్‌డీబీలో 8 రేటింగ్‌ను ద‌క్కించుకున్న‌ది. మొత్తం 32 ఎపిసోడ్స్‌తో ఏడాది పాటు స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కొరియాలో అత్య‌ధిక మంది వీక్షించిన సిరీస్‌లో ఒక‌టిగా నిలిచింది. ఐ యామ్ నాట్ ఏ రోబో సిరీస్‌కు సీజ‌న్ 2 కూడా రాబోతుంది. ఇటీవ‌లే డైరెక్ట‌ర్ జంగ్ డే యూన్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాడు. ఫ‌స్ట్ సీజ‌న్‌లో రొమాన్స్ డోస్ ఎక్కువ‌గా ఉండ‌గా...సెకండ్ సీజ‌న్‌లో మాత్రం యాక్ష‌న్‌, బోల్డ్ రెంటింటిని మిక్స్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

రోబోతో ప్రేమ‌లో ప‌డ్డ మిలియ‌నీర్‌...

ఐ యామ్ నాట్ ఏ రోబో వెబ్‌సిరీస్‌లో యు సీయుంగ్ హో, చే సూ బీన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. జంగ్ డే యూన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హీరోహీరోయిన్ల రొమాన్స్‌, బోల్డ్ సీన్స్ ఓటీటీ ల‌వ‌ర్స్‌ను మెప్పించాయి. మ‌ల్టీ మిలియ‌నీర్ అయిన ఓ బిజినెస్‌మెన్‌కు హ్యూమ‌న్ ఎల‌ర్జీ ఉంటుంది.

మ‌నుషుల‌తో క‌ల‌వ‌కుండా ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతాడు. అత‌డి లైఫ్‌లోకి రోబో పేరుతో ఓ అమ్మాయి ఎలా వ‌చ్చింది? రొబోగా భావించి ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డ కోటీశ్వ‌రుడికి...ఆమె మ‌నిషి అనేనిజం ఎలా తెలిసింది? ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అన్న‌దే ఈ సిరీస్ క‌థ‌.

తెలుగులో హ‌న్సిక‌...

ఐ యామ్ నాట్ ఏ రోబో సిరీస్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎమ్ఐ త్రీ పేరుతో రీమేకైంది. ఈ సిరీస్‌లో హ‌న్సిక లీడ్ రోల్ చేసింది. మ్యుగేన్ రావు, శంత‌ను భాగ్య‌రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తెలుగులో డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ రిలీజైంది. రోబోగా, అంద‌మైన అమ్మాయిగా హ‌న్సిక ఈ సిరీస్‌లో డ్యూయ‌ల్ రోల్ చేసింది.

కొరియ‌న్ సిరీస్‌తో పోలిస్తే హ‌న్సిక ఎమ్ఐ త్రీ పెద్ద‌గా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. లీడ్ పెయిర్ మ‌ధ్య కెమిస్ట్రీ , కామెడీ స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు. ఈ సిరీస్‌లో చాలా వ‌ర‌కు ర‌జ‌నీకాంత్ రోబో రిఫ‌రెన్సెస్ క‌నిపిస్తాయి. ఎఎమ్‌వై త్రీతోనే హ‌న్సిక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే ఆమె న‌టించిన ఫ‌స్ట్ వెబ్‌సిరీస్‌. ఆనీ తొలి ప్ర‌య‌త్న‌మే బెడిసికొట్టింది.

Whats_app_banner