Dhoomam Telugu OTT: ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ధూమం మూవీ తెలుగులో నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. పవన్ కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశాడు.
తొలుత ధూమం సినిమాను పాన్ ఇండియన్ మూవీగా అనౌన్స్‌చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. కానీ ఒక్క మలయాళం వెర్షన్ మాత్రమే థియేటర్లలో విడుదలైంది. మిగిలిన భాషల్లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ధూమం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా తెలుగులోనే థియేటర్లను స్కిప్ చేస్తూ ఓటీటీలోనే థ్రిల్లర్ మూవీ విడుదల కాబోతోంది.
ధూమం తెలుగు వెర్షన్ జూలై 11 నుంచి ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగు ఓటీటీ రిలీజ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ధూమం సినిమాలో అపర్ణ బాలమురళి, రోషన్ మాథ్యూ, వినీత్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
తొలుత ధూమం సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. థియేటర్లలో ఈ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో ఓటీటీ రిలీజ్ విషయంలో అమెజాన్ వెనకడుగు వేసింది. దాంతో మేకర్స్ ధూమం మలయాళం వెర్షన్‌ను యూట్యూబ్‌లో ఇటీవలే రిలీజ్ చేశారు.
సిగరెట్, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల సొసైటీకి జరుగుతోన్న నష్టాన్ని థ్రిల్లర్ కథతో దర్శకుడు పవన్ కుమార్ ధూమం సినిమాలో చూపించాడు. అవినాష్ (ఫహాద్ ఫాజిల్) ఓ సిగరెట్ కంపెనీలో సేల్స్ హెడ్‌గా పనిచేస్తుంటాడు.
తన తెలివితేటలు, మార్కెటింగ్ స్ట్రాటజీస్‌తో కంపెనీ అమ్మకాల్ని చాలా పెంచుతాడు. సిగరెట్ కంపెనీ ఎమ్‌డీ సిద్ధార్థ్ తో అభిప్రాభేదాల కారణంగా తన ఉద్యోగానికి అవినాష్ రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత రోజు తన భార్య దియాతో (అపర్ణ బాలమురళి) అవినాష్ కలిసికారులో ప్రయాణిస్తోండగా అతడిపై ఎటాక్ జరుగుతుంది.
అవినాష్ భార్య దియా శరీరంలో ఓ మైక్రో బాంబ్‌ను శత్రువులు ఫిక్స్ చేస్తారు. బాంబ్ పేలకుండా ఉండాలంటే తాము చెప్పిన కండీషన్స్‌కు ఒప్పుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ కండీషన్స్ ఏమిటి? అవినాష్‌ను ఈ ట్రాప్‌లో ఇరికించింది సిద్ధార్థ్ కాకుండా మరెవరూ? ఆ అపరిచిత శత్రువును సిద్ధార్థ్ ఎలా కనిపెట్టాడు? తన భార్య దియా ప్రాణాలను ఎలా కాపాడుకున్నాడు అన్నదే ధూమం మూవీ కథ.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ వెర్సలైట్ యాక్టర్‌గా ఫహాద్ ఫాజిల్ పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా కథ నచ్చితే విలన్ పాత్రలు చేస్తోన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తోన్నాడు.