Vijay Deverakondan on Rashmika: రష్మికతో రిలేషన్‌షిప్‌పై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-vijay deverakonda made interesting comments on relationship with rashmika mandanna
Telugu News  /  Entertainment  /  Vijay Deverakonda Made Interesting Comments On Relationship With Rashmika Mandanna
విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

Vijay Deverakondan on Rashmika: రష్మికతో రిలేషన్‌షిప్‌పై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

10 August 2022, 21:47 ISTHT Telugu Desk
10 August 2022, 21:47 IST

Vijay Deverakondan on Rashmika: లైగర్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ మరోసారి రష్మిక మందన్నాతో రిలేషన్‌షిప్‌పై ఓపెన్‌ అయ్యాడు. అయితే ఈసారి అతడు చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఏం చేసినా ఇతరుల కంటే ప్రత్యేకంగానే ఉంటుంది. అర్జున్‌రెడ్డిలాంటి మూవీతో సంచలనం రేపిన అతడు.. ఆ తర్వాత ఎంపిక చేసుకున్న సినిమాలు కూడా కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు లైగర్‌ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా అతడు తన కోస్టార్‌ రష్మిక మందన్నాతో రిలేషన్‌షిప్‌పై మరోసారి స్పందించాడు.

ఇలాంటి రిలేషన్‌షిప్‌ రూమర్లను తాను పెద్దగా పట్టించుకోనని చెప్పాడు. పైగా తన గురించి ఎలాంటి రూమర్లు లేకుండా ఎవరూ పట్టించుకోకుండా ఉండటం కంటే.. ఇలాంటివే బెటర్‌ అని అనడం విశేషం. "పబ్లిక్‌ ఫిగర్‌గా ఉండటం వల్ల కొంత నష్టం కూడా ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడతారో, మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటారో అప్పుడు మీ జీవితంపై ఆసక్తి చూపుతారు. నా గురించి ఏవైనా న్యూస్‌ వస్తున్నా దానితో నాకు సమస్య లేదు" అని విజయ్‌ అన్నాడు.

"అయినా నా గురించి ఎవరూ ఏమీ రాయకుండా పట్టించుకోకుండా ఉండటం కంటే ఇలాంటి రూమర్లతో నేను నాలాగా ఉండటానికే ఇష్టపడతాను. అందువల్ల అది నిజమైనా కాకపోయినా, పనికొచ్చేదైనా కాకపోయినా నాకు నష్టం లేదు. నేను పెద్దగా పట్టించుకోను" అని విజయ్‌ స్పష్టం చేశాడు. విజయ్‌ దేవరకొండ, రష్మిక రిలేషిన్‌షిప్‌లో ఉన్నారన్న వార్తలు ఇప్పటివి కావు.

ఈ ఇద్దరూ తొలిసారి గీత గోవిందంలో కలిసి నటించినప్పటి నుంచీ వస్తున్నాయి. ఆ తర్వాత డియర్‌ కామ్రేడ్‌లోనూ వీళ్లు కలిసి నటించారు. ఈ మధ్యే కాఫీ విత్‌ కరణ్‌ షోలోనూ రష్మికతో రిలేషన్‌షిప్‌ గురించి అడిగినప్పుడు ఆమె తన మంచి ఫ్రెండ్‌ అని విజయ్‌ చెప్పాడు. ఆమె నా డార్లింగ్‌ అని కూడా అతను అనడం విశేషం.