లైగర్ సినిమాతో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ అవుతున్న లైగర్ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో భారీగా ఎక్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌కు మదర్ సెంటిమెంట్ ను జోడిస్తూ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈసినిమాను తెరకెక్కించారు. లైగర్ రన్‌టైమ్ రెండు గంటల ఇరవై నిమిషాలు ఉండబోతున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ గత చిత్రం ఇస్మార్ట్ శంకర్ కూడా ఇదే రన్‌టైమ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో లైగర్ కు కూడా అదే ఫార్ములాను పూరి జగన్నాథ్ ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు.
ద్వితీయార్థం మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌తోనే ఈసినిమా సాగుతుందని చెబుతున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ నత్తి సమస్యతో బాధపడే యువకుడిగా కనిపించబోతున్నారు. బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. విజయ్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ తల్లి గా రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ తో పాటు ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు.