Vijay Devarakonda: గ్రేట్‌ గుజరాతీ తాలి ఎంజాయ్‌ చేసిన విజయ్‌.. లైగర్‌ షెడ్యూల్‌ ఇదీ-vijay devarakonda enjoying his great gujarati thaali as part of liger promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Devarakonda: గ్రేట్‌ గుజరాతీ తాలి ఎంజాయ్‌ చేసిన విజయ్‌.. లైగర్‌ షెడ్యూల్‌ ఇదీ

Vijay Devarakonda: గ్రేట్‌ గుజరాతీ తాలి ఎంజాయ్‌ చేసిన విజయ్‌.. లైగర్‌ షెడ్యూల్‌ ఇదీ

HT Telugu Desk HT Telugu

Vijay Devarakonda: తన నెక్ట్స్‌ మూవీ లైగర్‌ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ దేశం మొత్తం తిరుగుతూ హల్‌చల్‌ చేస్తున్నాడు. తాజాగా ఓ గుజరాతీ తాలీ తింటున్న ఫొటోను షేర్‌ చేశాడు.

లైగర్ ప్రమోషనల్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే (Girish Srivastav)

లైగర్‌.. ఈ ఏడాది మోస్ట్‌ అవేటెడ్‌ పాన్‌ ఇండియా మూవీస్‌లో ఒకటి. ట్రిపుల్‌ ఆర్, కేజీఎఫ్‌ 2 తర్వాత ఆ రేంజ్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తున్న లైగర్‌ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అంతకు చాలా ముందు నుంచే ఈ మూవీ టీమ్‌ ప్రమోషన్లు మొదలుపెట్టింది. తాజాగా దేశవ్యాప్తంగా తాము చేపట్టబోయే ప్రమోషనల్‌ ఈవెంట్ల షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేసింది.

మరోవైపు ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ ప్లే చేస్తున్న రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ ఇప్పటికే దేశంలోని ప్రతి ముఖ్యమైన ప్రాంతాన్ని చుట్టేస్తూ మూవీని ప్రమోట్‌ చేస్తున్నాడు. ముంబై వీధుల్లో అనన్యాతో కలిసి స్టెప్పులేయడం, కాఫీ విత్‌ కరణ్‌ షోకి వెళ్లడంలాంటివి చేసిన విజయ్‌.. తాజాగా గుజరాత్‌ టూర్‌లో అక్కడి గ్రేట్‌ తాలీ రుచి చూశాడు. దీనికి సంబంధించిన ఫొటోను విజయ్‌.. బుధవారం (ఆగస్ట్‌ 10) ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

తన ముందు ఓ భారీ ప్లేట్‌, అందులో 20 వరకూ ఉన్న డిషెస్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు. వాటన్నింటినీ ఆవురావురుమంటూ తినేద్దామా అన్నట్లుగా విజయ్‌ చూస్తున్నాడు. ది గ్రేట్‌ గుజరాతీ తాలీ అంటూ ఈ ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఇక ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న లైగర్‌ టీమ్‌ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తుందో చెబుతూ ఓ షెడ్యూల్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

ఈ నెల 23 వరకూ ఈ ప్రమోషనల్‌ టూర్‌ ఉండనుంది. 11న పుణె, 12న చండీగఢ్, 13న చెన్నై, 14న వరంగల్‌, 15న హైదరాబాద్, 17న ఇండోర్‌, 18న కొచ్చి, 19న బెంగళూరు, 20న గుంటూరు, 21, 22లలో ఢిల్లీ, 23న వారణాసిలో లైగర్‌ టీమ్‌ మూవీని ప్రమోట్‌ చేయనుంది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వస్తున్న లైగర్‌ ఓ స్పోర్ట్స్‌ డ్రామా.

ఇందులో విజయ్‌ సరసన్‌ అనన్యా పాండే నటిస్తోంది. ఇక రమ్య కృష్ణ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా.. తొలిసారి ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై గెస్ట్‌ రోల్‌లో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనున్నాడు లెజెండరీ బాక్సర్‌ మైక్ టైసన్‌.