Vijay Deverakonda: లైగర్‌కు గాడ్‌ఫాదర్‌ బ్లెస్సింగ్స్‌.. చిరు, సల్మాన్‌లతో విజయ్-vijay deverakonda and liger team in godfather set with chiranjeevi and salman khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Vijay Deverakonda And Liger Team In Godfather Set With Chiranjeevi And Salman Khan

Vijay Deverakonda: లైగర్‌కు గాడ్‌ఫాదర్‌ బ్లెస్సింగ్స్‌.. చిరు, సల్మాన్‌లతో విజయ్

సల్మాన్ ఖాన్, చిరంజీవిలతో గాడ్ ఫాదర్ సెట్ లో లైగర్ టీమ్
సల్మాన్ ఖాన్, చిరంజీవిలతో గాడ్ ఫాదర్ సెట్ లో లైగర్ టీమ్

Vijay Deverakonda: లైగర్‌ మూవీ రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్‌ దేవరకొండ సోమవారం (ఆగస్ట్‌ 1) ఓ ఇంట్రెస్టింగ్‌ ఫొటో షేర్‌ చేశాడు. అందులో చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌తో విజయ్‌, పూరి జగన్నాథ్‌ ఉన్నారు.

లైగర్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోనున్నాడు విజయ్‌ దేవరకొండ. ట్రైలర్‌తోనే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఓ అంచనాకు వచ్చేశారు అభిమానులు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. లైగర్‌తో అటు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలోనే విజయ్‌ చాలా బిజీగా ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

అయితే తాజాగా అతడు గాడ్‌ఫాదర్‌ చిరంజీవి, బాలీవుడ్‌ స్పెషల్‌ గెస్ట్‌ సల్మాన్‌ఖాన్‌లతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అతనితోపాటు డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, నటి ఛార్మి కూడా ఉన్నారు. వీళ్లంతా గాడ్‌ఫాదర్‌ మూవీ సెట్‌కు వెళ్లారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. చిరు, సల్మాన్‌ ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నట్లు క్యాప్షన్‌ ఉంచాడు.

"లైగర్‌కు మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీపై ఎప్పుడూ నాకు గౌరవం, ప్రేమ ఉంటాయి చిరంజీవి సర్‌, సల్మాన్‌ఖాన్‌ సర్‌" అని విజయ్‌ అన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గాడ్‌ఫాదర్‌ సెట్‌లో లైగర్‌ అంటూ ఈ ఫొటోను ఫ్యాన్స్‌ ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్‌ చేస్తున్నారు. లైగర్‌ మూవీలో విజయ్‌ సరసన అనన్యా పాండే నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇదొక స్పోర్ట్స్‌ డ్రామా. ఓ చాయ్‌ అమ్ముకునే కుర్రాడు మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ రింగ్‌ను ఏలే వ్యక్తిగా ఎలా అయ్యాడు అన్నదే లైగర్‌ స్టోరీ. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌లో పూరి జగన్నాథ్‌ మార్క్‌ కనిపిస్తోంది. విజయ్‌, రమ్యకృష్ణ నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇక ఈ మధ్యే వచ్చిన వాట్‌ లగా దేంగే సాంగ్‌ కూడా ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.