Tillu Squre OTT Release: అఫీషియ‌ల్ - నెల‌లోపే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న టిల్లు స్క్వేర్ - స్ట్రీమింగ్ డేట్ ఇదే-tillu squre ott release date locked siddhu jonnalagadda anupama parameswaran movie to stream on netflix from april 26th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tillu Squre Ott Release: అఫీషియ‌ల్ - నెల‌లోపే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న టిల్లు స్క్వేర్ - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Tillu Squre OTT Release: అఫీషియ‌ల్ - నెల‌లోపే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న టిల్లు స్క్వేర్ - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Apr 19, 2024 10:49 AM IST

Tillu Squre OTT Release: సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన టిల్లు స్క్వేర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ శుక్ర‌వారం ఖ‌రారైంది. ఏప్రిల్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాష‌ల్లో టిల్లు స్క్వేర్‌ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

టిల్లు స్క్వేర్ మూవీ ఓటీటీ
టిల్లు స్క్వేర్ మూవీ ఓటీటీ

Tillu Squre OTT Release: టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఏప్రిల్‌ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ శుక్ర‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. టిల్లు స్క్వేర్ పోస్ట‌ర్ ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

హిస్ట‌రీ రిపీట్‌...

హిస్ట‌రీ రిపీట్ అవ్వ‌డం నార్మ‌ల్‌. అదే టిల్లు వ‌స్తే హిస్ట‌రీ, మిస్ట‌రీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్‌ అవుతాయ్‌. అట్లుంట‌ది టిల్లుతోని అంటూ ఈ పోస్ట‌ర్‌ను ఉద్దేశించి కామెంట్ జోడించింది నెట్‌ఫ్లిక్స్‌. టిల్లు స్క్వేర్ తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఈ సూప‌ర్ హిట్ మూవీ ఓటీటీలోకి రావ‌డం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.

130 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

టిల్లు స్వ్కేర్ మూవీలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మార్చి 29న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు కొల్ల‌గొట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2024లో తెలుగులో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. 2022లో వ‌చ్చిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ రూపొందింది. టిల్లు స్క్వేర్‌కు మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో హీరోగా న‌టిస్తూనే క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించాడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌.

సిద్దు, అనుప‌మ కెమిస్ట్రీ...

టిల్లు స్క్వేర్‌లో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కామెడీ టైమింగ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్ బోల్డ్ ప‌ర్ఫార్మెన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా బోల్డ్ రోల్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌నిపించింది. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌మ కెమిస్ట్రీతో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు.

టిల్లు స్క్వేర్ క‌థ ఇదే...

రాధిక (నేహా శెట్టి) వ‌ల్ల త‌న జీవితంలో జ‌రిగిన అల్ల‌క‌ల్లోలాన్ని మ‌ర్చిపోయి హ్యాపీగా లైఫ్‌ను గ‌డిపేయాల‌ని ఫిక్స‌వుతాడు టిల్లు (సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌). అత‌డి జీవితంలోకి అనుకోకుండా లిల్లీ (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌)అడుగుపెడుతుంది. ఓ పార్టీలో ప‌రిచ‌య‌మైన లిల్లీతో తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు ఒక్క రోజులోనే వారి ప్రేమ‌కు బ్రేక్ ప‌డుతుంది. లిల్లీ క‌నిపించ‌కుండాపోతుంది. నెల త‌ర్వాత క‌నిపించిన లిల్లీ తాను ప్రెగ్నెంట్ అని, అందుకు టిల్లునే కార‌ణ‌మ‌ని చెబుతుంది.

లిల్లీ చెప్పింది నిజ‌మేనా? ఆమె క‌నిపించ‌కుండాపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? రాధిక ఉంటున్న ఫ్లాట్‌లోనే లిల్లీ ఎందుకుంది? మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ షేక్ మ‌హ‌బూబ్‌ను చంపేందుకు వేసిన ప్లాన్‌లోకి టిల్లు ఎలా వ‌చ్చాడు? లిల్లీ కార‌ణంగా టిల్లు జీవితంలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి? రాధిక‌ను మ‌ళ్లీ టిల్లు ఎందుకు క‌లిసింది? అన్న‌దే టిల్లు స్క్వేర్ మూవీ క‌థ‌.

మూడో పార్ట్ కూడా...

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ హిట్ట‌వ్వ‌డంతో ఈ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్‌ను కూడా తీసుకురాబోతున్న‌ట్లు ఇటీవ‌ల సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌క‌టించాడు. ఈ మూడో పార్ట్‌కు టిల్లు క్యూబ్ అనే టైటిల్ ఫిక్స‌యిన‌ట్లు స‌మాచారం. టిల్లు స్క్వేర్ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు. డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి గెస్ట్ రోల్‌లో క‌నిపించింది.

IPL_Entry_Point

టాపిక్